6
June, 2026

A News 365Times Venture

6
Saturday
June, 2026

A News 365Times Venture

AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!

Date:

AFG vs IND: అఫ్గానిస్థాన్‌తో న్యూ చండీగఢ్ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు శుభారంభం లభించింది. తొలి రోజు లంచ్ విరామ సమయానికి భారత్ 25 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్ కేఎల్ రాహుల్ 37 పరుగులతో, సాయి సుదర్శన్ 32 పరుగులతో అజేయంగా నిలిచి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం అందించారు. యశస్వి తన సహజ శైలిలో దూకుడుగా ఆడుతూ అఫ్గాన్ బౌలర్లపై ఒత్తిడి తీసుకొచ్చాడు. 32 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేసిన అతడు మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. మహ్మద్ సలీమ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అఫ్సర్ జజాయ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే అంతకుముందు 11 పరుగుల వద్ద యశస్వికి వచ్చిన లైఫ్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

జైస్వాల్ ఔటైన తర్వాత కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇద్దరూ ఆచితూచి ఆడుతూ రెండో వికెట్‌కు అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాహుల్ 70 బంతుల్లో 5 ఫోర్లతో 37 పరుగులు చేయగా, సాయి సుదర్శన్ 49 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేశాడు. అయితే అఫ్గానిస్థాన్ బౌలర్ల దురదృష్టం కూడా భారత్‌కు కలిసి వచ్చింది. 11వ ఓవర్‌లో జియౌర్ రెహ్మాన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ బ్యాట్ ఎడ్జ్ ఇచ్చినట్లు కనిపించినా అంపైర్ ఔట్ ఇవ్వలేదు. వికెట్ కీపర్ డీఆర్‌ఎస్ కోరకపోవడంతో అఫ్గాన్ జట్టు మంచి అవకాశాన్ని కోల్పోయింది. తర్వాత రిప్లేల్లో బంతి బ్యాట్‌ను తాకినట్లు స్పష్టంగా కనిపించింది.

అంతేకాకుండా సలీమ్ సాఫి వేసిన 16వ ఓవర్‌లో రాహుల్‌పై ఎల్బీడబ్ల్యూ అవకాశం వచ్చినా అఫ్గానిస్థాన్ డీఆర్‌ఎస్‌కు వెళ్లలేదు. రిప్లేల్లో బంతి వికెట్లను తాకే అవకాశం ఉన్నట్లు కనిపించింది. మరోవైపు సాయి సుదర్శన్ కూడా 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్లిప్‌లో క్యాచ్ డ్రాప్ కారణంగా లైఫ్ పొందాడు. అఫ్గానిస్థాన్ తరఫున మహ్మద్ సలీమ్ ఒక్క వికెట్ సాధించాడు. జియౌర్ రెహ్మాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్లు మాత్రం దక్కలేదు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్‌డీ హై అలర్ట్!

Monsoon 2026: ఎండల తీవ్రతతో అల్లాడిపోయిన భారతీయులకు నైరుతి రుతుపవనాలు చల్లని...

Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..

Nashik TCS Harassment Case: నాసిక్‌లో సంచలనం సృష్టించిన టీసీఎస్...

Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..

Putin: రష్యాతో సంబంధాలను తగ్గించుకోవాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల...

Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..

తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో...