మక్కల్ సెల్వన్, బహుముఖ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘ఏస్’ చిత్రం మే 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు, నిర్మాత అరుముగ కుమార్ 7CS ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడీగా రుక్మిణి వసంత్ నటించారు. మే 23న ఈ చిత్రం విడుదల కానుండగా, తెలుగు హక్కులను శ్రీ పద్మిణి సినిమాస్ సొంతం చేసుకుంది.
Also Read:Pawan Kalyan : ‘హరిహర వీరమల్లు’ మూడో పాటకు టైమ్ ఫిక్స్..
శ్రీమతి పద్మ సమర్పణలో, బి. శివ ప్రసాద్ నేతృత్వంలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల చేయనుంది. మే 23న రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల సోషల్ మీడియాలో విడుదల చేశారు.
‘ఏస్’ ట్రైలర్‌లో విజయ్ సేతుపతి తన పాత్రను ‘బోల్ట్ కాశీ’గా పరిచయం చేసుకోగా, యోగి బాబు ఆ పేరుపై కామెడీ డైలాగులతో నవ్వులు పూయిస్తాడు.
Also Read: Manchu Manoj: మంచు విష్ణు నుంచి నేర్చుకోవాలనుకున్నది ఇదే.. మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
హీరో-హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, మలేసియా నేపథ్యంలో జరిగే ఇల్లీగల్ కార్యకలాపాలు, ఉత్కంఠభరితమైన చేజింగ్ సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘జూదం అనేది ఉప్పెనలాంటిది… క్లైమాక్స్ గుర్తుంది కదా!’ అని యోగి బాబు చెప్పే హాస్య డైలాగ్ ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హీరో ప్లాన్ ఏమిటి? అతని పోరాటం వెనుక ఉద్దేశం ఏమిటి? అనే ప్రశ్నలతో ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. సామ్ సిఎస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కరణ్ బి. రావత్ సినిమాటోగ్రఫీ విజువల్స్‌ను సమృద్ధిగా తీర్చిదిద్దింది. మే 23న ‘ఏస్’ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.