14
September, 2026

A News 365Times Venture

14
Monday
September, 2026

A News 365Times Venture

Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..

Date:

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తనదైన శైలిలో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. 157 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన అభిషేక్ శర్మ తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 32 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో ఏకంగా 82 పరుగులు సాధించి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఆఫ్ఘన్ స్పిన్ దిగ్గజం రషీద్ ఖాన్ బౌలింగ్‌లోనూ వరుస సిక్సర్లు బాది తన సత్తా చాటాడు.

పిచ్‌పై కుదురుకోవడానికి ఎంతో సమయం తీసుకోకుండా, బంతి పడడమే ఆలస్యం అన్నట్లుగా మైదాన నలుమూలలకూ బంతులను తరలించాడు. 256.25 స్ట్రైక్ రేట్‌తో అతను ఆడిన తీరు మ్యాచ్‌ స్వరూపాన్నే పూర్తిగా మార్చేసింది. పవర్‌ప్లేలోనే జట్టు స్కోరును అంబరాన్నంటించేలా చేసి, ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కేవలం 13.4 ఓవర్లలోనే భారత్‌ను విజయతీరాలకు చేర్చడంలో అభిషేక్ కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మతో పాటు ఇషాన్ కిషన్ (42), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (8 నాటౌట్) రాణించారు. సంజు శాంసన్ (1) త్వరగా అవుటైనప్పటికీ, అభిషేక్ శర్మ సృష్టించిన విధ్వంసంతో భారత్ కేవలం 13.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 157 పరుగులు లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ నబీ రెండు వికెట్లు తీయగా, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ ఘన విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అభిషేక్ శర్మ ఆడిన ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?

BRICS: బ్రిక్స్ సదస్సు తొలి రోజు ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు...

PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్‌డేట్..

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన ద్వారా రైతుల ఖాతాల్లో ప్రతిఏటా...

Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..

Ivolga high-speed train: భారత్ తన పాతకాలపు రైల్వే వ్యవస్థను ఆధునీకీకరించే...

UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!

UK Break-Up: యునైటెడ్ కింగ్‌డమ్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. స్కాట్లాండ్, వేల్స్,...