18
April, 2026

A News 365Times Venture

18
Saturday
April, 2026

A News 365Times Venture

Fake Letters: పవన్ కళ్యాణ్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలంటూ ఎర.. సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ..

Date:

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరును అడ్డుపెట్టుకుని కొందరు అక్రమార్కులు పక్కదారి పడుతున్నారు. సామాన్య ప్రజల నమ్మకాన్ని, నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని నకిలీ సిఫారసు లేఖల దందాను తెరపైకి తెచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల ఆశ చూపి, డిప్యూటీ సీఎం సంతకాన్ని, లెటర్ హెడ్లను ఫోర్జరీ చేస్తూ అక్రమ సంపాదనకు తెరలేపడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి మోసపూరిత చర్యలు వ్యక్తులకు మాత్రమే కాకుండా.. ప్రభుత్వ ప్రతిష్టకు కూడా భంగం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలి నియోజకవర్గ పరిధిలో ఈ మోసాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

నకిలీ లేఖల సృష్టి..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి జారీ అయినట్లుగా నకిలీ సిఫారసు లేఖలను అక్రమార్కులు సృష్టించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయక నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసేందుకు ఈ లేఖలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ విషయం పార్టీ దృష్టికి వెళ్లడంతో అత్తిలికి చెందిన జనసేన నాయకులు వెంటనే అప్రమత్తమయ్యారు. పవన్ కళ్యాణ్ పేరును దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీసు స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.

Also Read:Central Govt: ఎట్టకేలకు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్రం..

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నకిలీ లేఖలు ఎక్కడ తయారయ్యాయి? దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? అనే కోణంలో టెక్నికల్ టీమ్ సాయంతో సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కేవలం అధికారిక నోటిఫికేషన్లు, పరీక్షల ద్వారానే జరుగుతుందని.. ఎవరైనా సిఫారసు లేఖల పేరుతో డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జనసేన నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Ponguleti Srinivas Reddy: తెలంగాణలో భూముల ధరలు పెంచేందుకు కసరత్తు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన..

Ponguleti Srinivas Reddy: తెలంగాణలో భూముల ధరలు పెంచేందుకు కసరత్తు జరుగుతోందని,...

Salary Increased: డీఏ పెంపుతో.. మీ నెల జీతం ఎంత వస్తుందో తెలుసా.. ఇదిగో ఇలా లెక్కించండి..

పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వ...

Regina Cassandra: కోల్పోయాకే దాని విలువ తెలిసింది.. రెజీనా కాసాండ్రా ఎమోషనల్ పోస్ట్ వైరల్!

తెలుగులో ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి...

Macron-Meloni Kiss: ఇటలీ ప్రధాని మెలోని బుగ్గపై ముద్దు పెట్టిన మాక్రాన్.. వీడియో వైరల్

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఫ్రాన్స్ పర్యటనకు వచ్చారు. అయితే మెలోనికి...