17
April, 2026

A News 365Times Venture

17
Friday
April, 2026

A News 365Times Venture

SRHకి డ్రీమ్ స్టార్ట్.. వైభవ్ సూర్యవంశీ గోల్డెన్ డక్‌తో ఔట్! Kavya Maran ఫీలింగ్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్

Date:

Kavya Maran: ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈసారి నిరాశపరిచాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడతాడని ఆశించిన అభిమానులకు షాక్ ఇస్తూ గోల్డెన్ డక్‌తో పెవిలియన్ చేరాడు. మ్యాచ్ ఆరంభంలోనే SRH పేసర్ ప్రఫుల్ హింగే అద్భుత బంతితో వైభవ్‌ ను ఔట్ చేశాడు. హార్డ్ లెంగ్త్ డెలివరీకి పుల్ షాట్ ఆడే ప్రయత్నంలో టైమింగ్ మిస్ అయ్యాడు. అంతే బంతి బ్యాట్ ను ముద్దాడుతూ గాల్లోకి లేచింది.

Nashik: లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి.. ఏకంగా TCS ఆఫీసులోనే దుకాణం పెట్టేసిన కంత్రీగాళ్లు.!

దీనితో వికెట్ కీపర్‌గా ఉన్న ఇషాన్ కిషన్ ముందుకు కదిలినా, చివరకు సలీల్ అరోరా సేఫ్‌గా క్యాచ్ పట్టడంతో SRHకు అద్భుత ఆరంభం లభించింది. క్యాచ్ పూర్తి కాకముందే SRH డగౌట్‌లో ఉత్సాహం కనిపించగా, ముఖ్యంగా SRH ఓనర్ కావ్య మారన్ లేచి నిలబడి వికెట్‌ను తెగ ఎంజాయ్ చేసింది. ఇక క్యాచ్ సమయంలో బంతి బ్యాట్ కు తగిలి గాలిలో ఉన్న సమయంలో కావ్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే.. ఎలాగైనా క్యాచ్ పట్టండి బాబో అన్నట్లుగా ఉంది. ఎలాగైతేమి వైభవ్ ఔట్ అవగానే SRH ఆటగాళ్లు, అభిమానాలు, ఓనర్ కావ్య మారన్ తెగ ఎంజాయ్ చేశారు.

డబ్బులే.. డబ్బులు.. Women’s T20 World Cup 2026కు భారీ ప్రైజ్ మనీ ప్రకటించిన ICC..!

ఇక మ్యాచ్ విషయానికి వస్తే ప్రఫుల్‌ వేసిన తొలి ఓవర్లో 3 వికెట్లు పడ్డాయి. రెండో బంతికి వైభవ్‌(0)సలీల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్ అవ్వగా, నాలుగో బంతికి జురెల్‌(0) క్లీన్‌బౌల్డ్‌, చివరి బంతిని ప్రీటోరియస్‌(0) నితీశ్‌కు క్యాచ్‌ ఇవ్వగా.. తొలి ఓవర్‌కు రాజస్థాన్‌ స్కోర్‌ 1/3 గా ముగిసింది. ఇక ఆ తర్వాత సాకిబ్‌ వేసిన రెండో ఓవర్‌ లో నితీశ్‌కు క్యాచ్‌ ఇచ్చిన జైస్వాల్‌(1) ఔటయ్యాడు. ఇక మూడో ఓవర్‌ చివరి బంతికి రాజస్థాన్ కెప్టెన్ ప్రఫుల్‌ బౌలింగ్ లో పరాగ్‌(4) అభిషేక్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీనితో 3 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్‌ స్కోర్‌ 9/5కు చేరుకుంది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

swayambhu : నిఖిల్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘స్వయంభు’ ఫస్ట్ సాంగ్ ఆదరిందిగా

జోవియల్ క్యారెక్టర్స్ నుండి నిఖిల్ ను టోటల్‌గా ఛేంజ్ చేసింది స్వామిరారా,...

Israel-Lebanon: ఇజ్రాయెల్‌తో 10 రోజులు కాల్పుల విరమణ ఒప్పందం.. లెబనాన్‌లో సంబరాలు

మొత్తానికి మధ్యప్రాచ్యంలో వాతావరణం చల్లబడుతోంది. తాజాగా ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య 10 రోజుల...

Bonus Shares: ఒక షేరు కొంటే.. మరో షేరు ఉచితం.. ప్రకటించిన ప్రభుత్వ రంగ సంస్థ..

భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) పెట్టుబడిదారులకు మరియు షేర్ హోల్డర్లకు...