26
November, 2026

A News 365Times Venture

26
Thursday
November, 2026

A News 365Times Venture

Russia Nuclear Satellite: అంతరిక్షంలో రష్యా అణుబాంబు.. న్యూక్లియర్ శాటిలైట్‌పై ఆందోళన.!

Date:

Russia Nuclear Satellite: అంతరిక్షంలో రష్యా తన ‘‘న్యూక్లియర్ శాటిలైట్’’లను మోహరిస్తోందనే రిపోర్టు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమవుతోంది. 2026 చివరి నాటికి, బహుశా డిసెంబర్‌లో ఈ ప్రయోగం జరిగే అవకాశం ఉందని పాశ్చాత్య నిఘా అంచనా వేస్తున్నట్లు సమాచారం. జర్మనీకి చెందిన మీడియా దీనిపై ఒక నివేదిక విడుదల చేసింది. రష్యా అణ్వాయుధాలను మోసుకెళ్లే ఉపగ్రహాలను కొన్ని వారాల్లోనే కక్ష్యలోకి పంపే అవకాశం ఉందని జర్మన్ మీడియా వెల్లడించింది.

స్పుత్నిక్-ఎస్ ప్రయోగం..?

జర్మన్ మీడియా ప్రకారం.. రష్యా రూపొందించినట్లు చెప్పబడుతున్న న్యూక్లియర్ శాటిలైట్ ‘‘స్పుత్నిక్-ఎస్’’ డిసెంబర్‌లో అంతరిక్షం ప్రయోగానికి సిద్ధంగా ఉందని చెప్పింది. ఈ ఉపగ్రహాన్ని కొన్ని ఏళ్లకు ముందే రష్యా తయారు చేసి సిద్ధంగా ఉంచిందని చెప్పింది. దీనిపై నవంబర్‌లోనే కొన్ని నాటో దేశాలకు హెచ్చరికలు అందాయని, ఈ ఉపగ్రహాన్ని 60 రోజుల్లో ప్రయోగించే అవకాశం ఉందని జర్మన్ మీడియా వెల్లడించింది.

అయితే, రష్యా ఈ ఆరోపణలను ఖండించింది. అంతరిక్షంలో అణ్వాయుధాన్ని మోహరించేందుకు సిద్ధమవుతోందన్న వార్తలు నిరాధారమైనవని బెర్లిన్‌లోని రష్యా రాయబార కార్యాలయం పేర్కొంది. ఇవి ప్రచారంలో భాగంగా చేస్తున్న ఆరోపణలని, తమ అంతరిక్ష కార్యకలాపాలు అంతర్జాతీయ బాధ్యతలకు అనుగుణంగానే ఉన్నాయని స్పష్టం చేసింది.

అంతరిక్షంలో అణు విస్పోటనం జరిగితే అంతే..

రష్యా న్యూక్లియర్ శాటిలైట్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుందనే వార్తలు ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టింది. అంతరిక్షంలో అణు విస్పోటనం జరిగితే తీవ్రమైన ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది ఉపగ్రహాలు నావిగేషన్‌, టెలికమ్యూనికేషన్లు, వాతావరణ అంచనాలు, ఆర్థిక లావాదేవీలు, సైనిక నిఘా వంటి కీలక సేవలకు ఆధారంగా ఉన్నాయి. అంతరిక్షంలో అణు విస్ఫోటనం సంభవిస్తే పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలు దెబ్బతినే లేదా పనిచేయకుండా పోయే ప్రమాదం ఉందని జర్మన్ పరిశోధనాత్మక కథనం హెచ్చరించింది.

జర్మనీ, నాటోలో టెన్షన్..

ఈ నివేదికపై జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ స్పందించారు. రష్యా ఉద్రిక్తల్ని ఎంత వరకు తీసుకెళ్తుందనే విషయాన్ని ఇది సూచిస్తోందని అన్నారు. ఈ నివేదిక తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మాట్లాడుతూ.. అంతరిక్ష రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను నాటో పరిశీలిస్తోందని అన్నారు. నాటో భూభాగంలో ప్రతీ అంగుళాన్ని రక్షించుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని, అంతరిక్ష రంగంలో భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Thiruparankundram Deepam Controversy: కార్తీక దీపం వివాదంలో మరో ట్విస్ట్…! గవర్నర్ సీరియస్.. సీఎం విజయ్‌కు కీలక ఆదేశాలు!

Thiruparankundram Deepam Controversy: తమిళనాడులోని తిరుపరంకుండ్రం కార్తీక దీపం వివాదం మరోసారి...

CM Chandrababu: గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం చంద్రబాబు.. రేషన్ షాపుల్లో తక్కువ ధరకే కందిపప్పు, పామాయిల్..

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి సామాన్య ప్రజలపై...

Trump Tariffs: ట్రంప్ టారిఫ్ బాంబ్.. భారత్‌పై 25, చైనాకు 40 శాతం..

అమెరికా వాణిజ్య ప్రతినిధి కొత్త ప్రణాళిక ప్రకారం భారత్‌తో పాటు మరికొన్ని...