18
November, 2026

A News 365Times Venture

18
Wednesday
November, 2026

A News 365Times Venture

ICC Schedules: 2035 వరకు ఐసీసీ క్రికెట్ టోర్నీల షెడ్యూల్ విడుదల.. ఇండియాలో ఆ వరల్డ్ కప్..

Date:

ఇండోనేషియాలోని బాలిలో జరిగిన బోర్డు సమావేశంలో 2027 నుంచి 2035వ సంవత్సరం వరకు జరగబోయే ప్రధాన అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ల పూర్తి క్యాలెండర్‌ను ఐసీసీ అధికారికంగా ఖరారు చేసింది. ఈ దీర్ఘకాలిక షెడ్యూల్ ప్రకారం 2029 అక్టోబర్ 9 నుంచి 28 వరకు జరిగే పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీకి భారతదేశం ఒక్కటే ఆతిథ్యం ఇవ్వనుంది. అలాగే 2031 అక్టోబర్ 9 నుంచి నవంబర్ 23 వరకు జరిగే పురుషుల వన్డే ప్రపంచకప్‌ను భారత్, బంగ్లాదేశ్ దేశాలు కలిసి సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఇక 2027 వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 7 నుంచి నవంబర్ 21 వరకు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల్లో జరుగుతుంది.

పొట్టి ఫార్మాట్ విషయానికి వస్తే 2028 టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 12 నుంచి నవంబర్ 12 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికలుగా నిర్వహించనున్నారు. అనంతరం 2030 టీ20 ప్రపంచకప్ జులై 4 నుంచి ఆగస్టు 4 వరకు ఇంగ్లండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్ దేశాల్లో జరుగుతుంది. టెస్ట్ క్రికెట్‌లో అత్యున్నతమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్స్ 2027 జూన్ 9 నుంచి 13 వరకు ఇంగ్లండ్‌లోని ది ఓవల్ మైదానంలో, అలాగే 2029 (జూన్ 8-12), 2031 (జూన్ 12-16) ఫైనల్స్ కూడా ఇంగ్లండ్‌లోనే జరగనున్నాయి. 2032, 2034 టీ20 ప్రపంచకప్‌లు, 2033 ఛాంపియన్స్ ట్రోఫీ, 2035 వన్డే ప్రపంచకప్‌తో పాటు 2033, 2035 డబ్ల్యూటీసీ ఫైనల్స్ తేదీలను ఐసీసీ ప్రకటించినప్పటికీ, వాటి ఆతిథ్య దేశాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.

మరోవైపు 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ తిరిగి ప్రవేశపెడుతున్న నేపథ్యంలో, చివరి అర్హత పోటీల వివరాలను కూడా వెల్లడించారు. 2028 ఫిబ్రవరి 5 నుంచి 13 వరకు అమెరికాలో పురుషుల ఒలింపిక్ క్వాలిఫయర్ పోటీలు, ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 వరకు బంగ్లాదేశ్‌లో మహిళల ఒలింపిక్ క్వాలిఫయర్ పోటీలు జరుగుతాయి. దీంతో పాటు 2027 వన్డే ప్రపంచకప్, 2028 పురుషుల మరియు మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ల అర్హత పోటీల విధానాలను కూడా ఐసీసీ స్పష్టం చేయడంతో రాబోయే దశాబ్దపు క్రికెట్ సమరంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

UP Elections 2027: అయోధ్య, కాశీ తర్వాత మధురపై బీజేపీ గురి.. కృష్ణ జన్మభూమి అజెండాలోకి!

UP Elections 2027: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ...

Dating App Crime: డేటింగ్ యాప్ వేదికగా వల.. ఇళ్లకు వెళ్లి మత్తు ఇచ్చి దోపిడీలు..

హైదరాబాద్ నగరంలో డేటింగ్ యాప్ వేదికగా పరిచయాలు పెంచుకుని, మత్తుమందు ఇచ్చి...

AP Elections: ముగిసిన 23 పట్టణ స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం.. రేపు పరిశీలన..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల...

INDIA Bloc: ఎన్నికల సంఘానికి 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టులో INDIA కూటమి పిటిషన్!

INDIA Bloc: ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై...