17
November, 2026

A News 365Times Venture

17
Tuesday
November, 2026

A News 365Times Venture

Kishtwar SPO Killings: ‘‘మసీదు నుంచి బెదిరింపులు, ఇద్దరు పోలీసుల హత్య’’ బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు..

Date:

Kishtwar SPO Killings: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులు (SPO) హత్యకు గురైన ఘటన రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ జంట హత్యల వెనక స్థానికంగా కుట్ర జరిగి ఉండొచ్చని బీజేపీ ఎమ్మెల్యే షుగన్ పరిహార్ అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఆ ఇద్దరు ఎస్‌పీఓలకు ఒక మసీదు నుంచి బెదిరింపులు వచ్చాయని ఆమె ఆరోపించారు. ఈ బెదిరింపులపై అప్పట్లో ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. భద్రతా లోపాలు, సీనియర్ పోలీస్ అధికారుల పాత్ర గురించి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

హత్యకు గురైన ఇద్దరు పోలీస్ అధికారుల గ్రామమైన కియార్‌ను షుగన్ పరిహార్ సందర్శించారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు సునీల్ శర్మ కూడా ఆమెతో వెళ్లారు. ఇద్దరు పోలీసుల అంత్యక్రియల సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరికి గతంలో మసీదు నుంచి బెదిరింపులు వచ్చాయని, ఈ ప్రాంతంలో ఎవరైనా ఉగ్రవాదులకు సమాచారం అందిస్తున్నారా? అనే కోణంలో దర్యాప్తు జరపాలని అన్నారు.

జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్‌ (SOG)లో విధులు నిర్వర్తిస్తున్న 57 ఏల్ల బాబీ చంద్, 45 ఏళ్ల రష్పాల్ కుమార్ నవంబర్ 11న తమ శిబిరం నుంచి పోలీస్ పోస్టకు వెళ్లారు. విధుల్లో భాగంగా ధర్నా-మార్వా ప్రాంతానికి వెళ్లాల్సి ఉండగా, మార్గం మధ్యలో అదృశ్యమయ్యారు. నవంబర్ 12న అటవీ ప్రాంతంలో తీవ్రమైన బుల్లెట్ గాయాలతో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరి వద్ద ఉన్న ఇన్సాన్, 303 రైఫిల్ కనిపించకుండాపోయాయి. ఘటనా స్థంలో పాకిస్తాన్ లో తయారైన బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్‌ను ఛేదించే తూటాలు లభ్యమయ్యాయి. ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేపట్టింది. ముగ్గురు ఉగ్రవాదుల ఆచూకీ తెలిపిన వారికి రూ. 30 లక్షల నజరానా ప్రకటించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Amit Shah: రాహుల్ భారత్ పరువు తీస్తున్నాడు.. మరో 30 ఏళ్లు కాంగ్రెస్‌కు అధికారం రాదు..

Amit Shah: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై...

Janasena: జనసేన నుంచి ఇద్దరు మేయర్లు, ముగ్గురు చైర్మన్ అభ్యర్థులు ఖరారు..

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం...

Congress Chalo Delhi: కాంగ్రెస్ ‘‘ఛలో ఢిల్లీ’’ కార్యక్రమం వాయిదా!

Congress Chalo Delhi: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించాల్సిన ‘ఛలో...

Uttam Kumar Reddy : మేడిగడ్డపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కీలక విన్నపాలు

తెలంగాణలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు, నిధుల విషయంలో...