14
November, 2026

A News 365Times Venture

14
Saturday
November, 2026

A News 365Times Venture

IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్‌గా కొత్త బాస్..

Date:

తెలంగాణ పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఏకంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ జీవో నంబర్ 1654ను విడుదల చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా అత్యంత కీలకమైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా 1995 బ్యాచ్ అధికారి మహేష్ మురళీధర్ భగవత్ నియమితులయ్యారు. ప్రస్తుతం శాంతిభద్రతల (ఎల్ అండ్ ఓ) విభాగం డీజీపీగా ఉన్న ఆయన, వీసీ సజ్జనార్ స్థానంలో నగర సీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సజ్జనార్‌ను అగ్నిమాపక, విపత్తు నిర్వహణ (ఫైర్ & డిజాస్టర్ రెస్పాన్స్) డీజీగా బదిలీ చేస్తూ, ఎస్పీఎఫ్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా విభాగం డీజీపీగా డా. సౌమ్య మిశ్రా నియమితులయ్యారు. ఆమెకు ఆర్గనైజేషన్, లీగల్ విభాగాల అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు. జైళ్ల శాఖ డీజీగా స్వాతి లక్రా బదిలీ కాగా, ఆమెకు హోంగార్డ్స్ అదనపు బాధ్యతలు అప్పగించారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా చారు సిన్హా నియమితులయ్యారు; ఆమెకు సీఐడీ డీజీగా అదనపు బాధ్యతలు కొనసాగనున్నాయి. ఏసీబీ డైరెక్టర్‌గా ఎస్. చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు.

తెలంగాణ ఆర్టీసీ వైస్ ఛైర్మన్ అండ్ ఎండీగా డా. అనిల్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న వై. నాగిరెడ్డిని సివిల్ సప్లైస్ కమిషనర్, ఎక్స్-అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్స్ డీజీపీగా విక్రమ్ సింగ్ మాన్, టీజీ-టీఎంఏఆర్ఎస్ డైరెక్టర్‌గా ఎం. స్టీఫెన్ రవీంద్ర, శాంతిభద్రతల (ఎల్ అండ్ ఓ) ఏడీజీపీగా అకున్ సభర్వాల్ నియమితులయ్యారు.

అలాగే, మల్టీ జోన్-1 ఐజీగా కార్తికేయ (ఐసీసీసీ డైరెక్టర్ అదనపు బాధ్యతలు), రైల్వేస్ ఐజీగా కే. రమేష్ నాయుడు, మల్టీ జోన్-2 డీఐజీగా నారాయణ నాయక్, జోన్-7 (జోగులాంబ) డీఐజీగా జి. చందన దీప్తి (అదనపు బాధ్యతలు) నియమితులయ్యారు. రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ జాయింట్ డైరెక్టర్‌గా డి. జోయల్ డేవిస్‌కు బాధ్యతలు అప్పగించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Fire Accident: ఫ్యూచర్ సిటీలో అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ చైర్ల తయారీ కంపెనీలో అకస్మాత్తుగా మంటలు..

ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని నందిగామ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న...

New Pensions: కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం.. నవంబర్ 19న అకౌంట్లోకి డబ్బులు జమ..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నూతన లబ్ధిదారులకు ‘చేయూత’ పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ...

UP Elections: హిందూ ఓటర్లపై ఎస్పీ గురి.. ఎట్టకేలకు అయోధ్యకు అఖిలేష్.!

UP Elections: దేశవ్యాప్తంగా ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై అందరి దృష్టి...

Nvidia CEO: జెన్సన్ హువాంగ్ పదవిపై నిర్ణయం.. కీలకంగా మారిన భారత సంతతి ఆర్తి షా!

Nvidia CEO:  ప్రపంచ టెక్ రంగంలో ప్రముఖ ఏఐ చిప్స్ తయారీ...