5
November, 2026

A News 365Times Venture

5
Thursday
November, 2026

A News 365Times Venture

Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!

Date:

Motichoor Laddu Recipe: దీపావళి పండుగ వచ్చిందంటే చాలు ప్రతి ఇంటా పిండివంటలు, రకరకాల స్వీట్ల సందడి మొదలవుతుంది. పండుగ రోజుల్లో దేవుడి నైవేద్యానికైనా, ఇంటికి వచ్చే బంధుమిత్రులకు పెట్టడానికైనా నోరూరించే మిఠాయిలు ఉండాల్సిందే. సాధారణంగా స్వీట్ షాపుల్లో కొనే మోతిచూర్ లడ్డూలంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టం. అయితే వీటిని ఇంట్లోనే ఎంతో సులభంగా, పర్ఫెక్ట్ కొలతలతో, నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయేలా ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

* శనగపిండి – 2 కప్పులు
* చక్కెర – 2 కప్పులు
* నీళ్లు – సరిపడా (పిండి కలపడానికి సుమారు 2 కప్పులు, పాకానికి ఒకటిన్నర కప్పు)
* వంట సోడా – చిటికెడు (ఆప్షనల్)
* రెడ్ ఫుడ్ కలర్ – చిటికెడు (నచ్చితేనే)
* పుచ్చకాయ గింజలు (వాటర్‌మెలన్ సీడ్స్) – సరిపడా
* డీప్ ఫ్రైకి సరిపడా – నూనె

తయారీ విధానం

బూందీ పిండి కలుపుకోవడం

ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో రెండు కప్పుల శనగపిండి వేసుకోవాలి. ఇందులోనే ఒక్క చిటికెడు వంట సోడా, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసి పిండిని బాగా కలుపుకోవాలి. వంట సోడా ఎక్కువైతే నూనె ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి ఒక్క చిటికెడు మాత్రమే వేయాలి లేదా పూర్తిగా మానేసినా ఫర్వాలేదు. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా పిండిని చక్కగా కలుపుకోవాలి. రెండు కప్పుల శనగపిండికి సుమారు ఒకటింపావు నుంచి ఒకటి ముప్పావు కప్పు వరకు నీళ్లు పడతాయి. బూందీ కోసం పిండి మరీ చిక్కగా కాకుండా, కాస్త పల్చగానే ఉండాలి.

బూందీ వేయించడం

స్టవ్ వెలిగించి బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా వేడి చేయాలి. కొద్దిగా పిండి వేసి చూస్తే వెంటనే పైకి తేలేంతగా నూనె వేడిగా ఉండాలి. ఇప్పుడు మోతిచూర్ లడ్డు కోసం ఉపయోగించే సన్నని బూందీ గరిటను (0 mm నుంచి 2 mm సైజు వరకు ఉన్నది) తీసుకుని, అందులో కొద్దిగా పిండి వేస్తూ గరిటను పైకి కిందకి సున్నితంగా ఊపుతూ నూనెలో వేసుకోవాలి. బాండీకి సరిపడా మాత్రమే బూందీ వేయాలి. బూందీ సైజు చాలా చిన్నదిగా ఉండటం వల్ల వెంటనే వేగిపోతుంది. మరీ క్రిస్పీగా కాకుండా, పైన స్వల్పంగా కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండేలా వేయించి వెంటనే తీసి ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పిండి మొత్తాన్ని ఇదే విధంగా బూందీగా సిద్ధం చేసుకోవాలి.

చక్కెర పాకం

మరో పాన్‌ను స్టవ్ మీద పెట్టి రెండు కప్పుల చక్కెర, ఒకటిన్నర కప్పు నీళ్లు పోసుకోవాలి. అందులోనే చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసి మీడియం మంట మీద చక్కెరను పూర్తిగా కరిగించాలి. ఈ లడ్డూకు తీగ పాకం లేదా ముదురు పాకం అవసరం లేదు. చక్కెర పూర్తిగా కరిగి చేతి వేళ్లతో తాకితే స్వల్పంగా జిగురుగా (స్టిక్కీగా) అనిపిస్తే సరిపోతుంది.

లడ్డూల మిశ్రమం

చక్కెర నీరు జిగురుగా వచ్చిన వెంటనే స్టవ్‌ను లో ఫ్లేమ్‌లో ఉంచి, ముందుగా సిద్ధం చేసుకున్న బూందీని ఆ పాకంలో వేయాలి. బూందీ పాకాన్ని పీల్చుకుంటూ దగ్గరపడేంత వరకు చిన్న మంటపైనే కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్‌గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ సేపు ఉంచితే చల్లారాక పొడిపొడిగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చివరగా కొన్ని పుచ్చ గింజలు వేసి బాగా కలిపి, మిశ్రమం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి.

మోతిచూర్ లడ్డూల తయారీ

చేత్తో పట్టుకునేంత వేడి ఉన్నప్పుడు కొద్దికొద్దిగా బూందీ మిశ్రమాన్ని తీసుకుంటూ గుండ్రని లడ్డూలుగా చుట్టుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన, జ్యూసీ జ్యూసీ మోతిచూర్ లడ్డూలు సిద్ధమవుతాయి. ఈ దీపావళికి ఈ సులభమైన టిప్స్‌తో ఇంట్లోనే మోతిచూర్ లడ్డూలు తయారు చేసి పండుగను మరింత తియ్యగా జరుపుకోండి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!

IND vs NZ: ఆక్లాండ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో...

Care Health Insurance పాలసీదారులకు షాక్.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్స నిలిపివేత.!

Care Health Insurance: తెలంగాణలోని ప్రముఖ ప్రైవేట్, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులలో...

CM Chandrababu: కరువు నుంచి రైతన్న గట్టెక్కేలా ఆదుకోండి.. కేంద్ర బృందానికి సీఎం విజ్ఞప్తి..!

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగానికి...