5
November, 2026

A News 365Times Venture

5
Thursday
November, 2026

A News 365Times Venture

Care Health Insurance పాలసీదారులకు షాక్.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్స నిలిపివేత.!

Date:

Care Health Insurance: తెలంగాణలోని ప్రముఖ ప్రైవేట్, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ (Care Health Insurance) పాలసీదారులకు నగదు రహిత చికిత్స (Cashless Treatment) సేవలు నిలిచిపోయాయి. క్లెయిమ్‌ల పరిష్కారంలో తీవ్ర జాప్యం, కారణం లేకుండా క్లెయిమ్‌లను తిరస్కరించడం వంటి చర్యలకు నిరసనగా తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (TSHA) ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో చికిత్స పొందే రోగులు ఆస్పత్రి బిల్లులను ముందుగా సొంత జేబు నుంచే చెల్లించి, ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అసలేం జరిగింది?

తమ అసోసియేషన్ పరిధిలోని అన్ని సభ్య ఆస్పత్రుల్లో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ నగదు రహిత సేవలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు TSHA ప్రకటించింది. క్లెయిమ్ మొత్తాల్లో విచక్షణారహితంగా కోతలు విధించడం, సరైన కారణం లేకుండా క్లెయిమ్‌లను తిరస్కరించడం, సెటిల్‌మెంట్లలో తీవ్ర జాప్యం, ఆస్పత్రులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నెట్‌వర్క్ నుంచి తొలగించడం వంటి విధానాలను అసోసియేషన్ ప్రధానంగా ఎత్తిచూపింది. ఈ సమస్యలపై కేర్ హెల్త్ ఉన్నతాధికారులను పలుమార్లు సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ సంస్థ నుంచి సరైన స్పందన రాలేదని TSHA పేర్కొంది. కేర్ హెల్త్ యాజమాన్యం చర్చలకు ముందుకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తే సేవలను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది.

పాలసీదారులపై పడనున్న తీవ్ర భారం

సాధారణంగా అత్యవసర సమయాల్లో భారీ మెడికల్ బిల్లులను చేతి నుంచి చెల్లించలేక ఎక్కువ మంది క్యాష్‌లెస్‌ సదుపాయం కోసమే ఆరోగ్య బీమాను తీసుకుంటారు. అయితే తాజా నిర్ణయంతో హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రులలో చేరే రోగులు లక్షల్లో బిల్లులను ముందస్తుగా చెల్లించాల్సి రావడం మధ్యతరగతి కుటుంబాలకు తీవ్ర ఆర్థిక భారంగా మారింది. హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రులకు చికిత్స కోసం వచ్చే ఆంధ్రప్రదేశ్ రోగులపై కూడా ఈ ప్రభావం నేరుగా పడనుంది.

గతంలో ఐఆర్‌డీఏఐ (IRDAI) జరిమానా

క్లెయిమ్‌ల నిర్వహణలో లోపాలు, ఆస్పత్రుల డిస్కౌంట్లను తుది బిల్లుల్లో సరిగ్గా చూపకపోవడం, క్లెయిమ్ కోతలకు సంబంధించిన స్పష్టమైన వివరాలను పాలసీదారులకు పంపకపోవడం వంటి కారణాలతో 2025 డిసెంబర్‌లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు రూ. 1 కోటి జరిమానా విధించింది కూడా.

తెలంగాణ, ఏపీకి చెందిన పాలసీదారులు ఎవరైనా తమ క్లెయిమ్‌లలో అన్యాయమైన కోతలు లేదా తిరస్కరణలను ఎదుర్కొంటే, హైదరాబాద్‌లోని ‘ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్’ (Insurance Ombudsman) కార్యాలయాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేయవచ్చు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

CM Chandrababu: కరువు నుంచి రైతన్న గట్టెక్కేలా ఆదుకోండి.. కేంద్ర బృందానికి సీఎం విజ్ఞప్తి..!

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగానికి...

CM Chandrababu Aerial Survey: మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ వ్యూ..

CM Chandrababu Aerial Survey: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతులు...

Anshul Kamboj: అతని బౌలింగ్ నిజంగా అద్భుతం.. అరుదైన క్లబ్‌లో చోటు..!

Anshul Kamboj: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న...