31
October, 2026

A News 365Times Venture

31
Saturday
October, 2026

A News 365Times Venture

Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!

Date:

Israel Elections: ఇజ్రాయిల్ రాజకీయాల్లో ఇది పెను సంచలనంగా చెప్పొచ్చు. ఒది ఒక అనూహ్యమైన మార్పుగా రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్నారు. యూదుల గడ్డపై అరబ్బు పార్టీలు సత్తా చాటాయి. దేశ జనాభాలో 21 శాతం ఉన్న అరబ్ పౌరులు ఈసారి ఎన్నికల్లో భారీగా ఓటు వేసి తమ రాజకీయ ఉనికిని మరింత బలపరుచుకున్నారు. అరబ్ కూటమిలోని రెండు పార్టీలు కలిసి మొత్తం 120 స్థానాల్లో 19 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారాయి. నెతన్యాహూకు మళ్లీ ప్రధాని పదవి అంత సులభంగా చిక్కకుండా అడ్డుకున్నాయి.

రెండు పార్టీలు 19 సీట్లు..

ఇజ్రాయిల్ ఎన్నికల్లో అరబ్ పార్టీలు 19 సీట్లు గెలుచుకున్నాయి. గతంలో ఈ కూటమికి 15 సీట్లు మాత్రమే ఉండేవి. ఇదే వారి అత్యుత్తమ ప్రదర్శన. ఇజ్రాయిల్ పార్లమెంట్ అయిన క్నెసెట్‌లో మొత్తం 120 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు 61 మ్యాజిక్ ఫిగర్. నెతన్యాహు నేతృత్వంలోని కూటమికి 53 స్థానాలు, గాడి ఐజెన్‌కోట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి 48 స్థానాలు మాత్రమే లభించాయి. ఏ కూటమికి మెజారిటీ దక్కలేదు. దీంతో అరబ్ పార్టీల మద్దతు కీలకంగా మారింది.

అరబ్ కూటమిలోని యూసఫ్ జబారిన్ నాయకత్వంలోని జాయింట్ లిస్ట్ 11 స్థానాలు గెలుచుకుంది. ఇందులో హదాష్, తా’అల్, బలాద్ అనే మూడు పార్టీలు ఉన్నాయి. హదాష్ లెఫ్ట్ ఐడియాలజీ కలిగి ఉంటుంది. ఇందులో అరబ్, యూదు వర్గాల సభ్యులు ఉంటారు. తా ఆల్ అరబ్ జాతీయవాద పార్టీ, బలాల్ పాలస్తీనా గుర్తింపు, సమాన పౌర హక్కులకు మద్దతు ఇస్తుంది.

మన్సూర్ అబ్బాస్ నాయకత్వంలోని రామ్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలను గెలుచుకుంది. ఇది ఇజ్రాయెల్‌లోని ఇస్లామిక్ మూవ్‌మెంట్ దక్షిణ విభాగంతో అనుబంధం కలిగి ఉంది. జాయింట్ లిస్ట్‌తో పోలిస్తే రామ్ పార్టీ రాజకీయ వ్యూహం భిన్నంగా ఉంటుంది. పాలస్తీనా సమస్యతో పాటు ఇజ్రాయిల్‌లోని అరబ్ పౌరుల రోజూవారీ సమస్యలు ప్రధాన ఎజెండాలుగా పనిచేస్తోంది. అరబ్ ప్రాంతాల్లో నేరాల నియంత్రణ, పోలీసు వ్యవస్థ, విద్య, ఉపాధి, గృహవసతి, అభివృద్ధి కోసం ప్రభుత్వ నిధులు వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తుంది.

అరబ్ ఓటర్లలో పెరిగిన రాజకీయ చైతన్యం..

ఇజ్రాయిల్ ఎన్నికల్లో రామ్ పార్టీతో పాటు జాయింట్ లిస్ట్‌లోని మూడు పార్టీలకు కలిపి 8 లక్షలకు పైగా ఓట్లు లభించాయి. 2022 ఎన్నికలతో పోలిస్తే ఇది 60 శాతానికి పైగా పెరుగుదల. నెగెవ్ ఎడారి ప్రాంతం నుంచి ఉత్తర గలీలీ వరకు అరబ్ జనాభా అధికంగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్ కోసం పోలింగ్ సెంటర్లకు బారులుతీరారు.

అరబ్బులు ఎవరు.?

అరబ్బులు ఇజ్రాయిల్ ప్రజలే. వీరిని పాలస్తీనా మూలాలు ఉన్న ఇజ్రాయిల్ ప్రజలు లేదా అరబ్-ఇజ్రాయిలీలు అని పిలుస్తారు. మొత్తం జనాభాలో సుమారు 21 శాతం ఉన్నారు. 1948లో ఇజ్రాయిల్ ఏర్పాటు తర్వాత, వీరిలో అధిక భాగం ఇజ్రాయిల్ లోనే ఉండిపోయారు. ఇజ్రాయిల్ పౌరులతో సమానంగా ఓటు హక్కు కలిగి ఉన్నారు. పౌరసత్వం ఉన్నప్పటికీ భూమి, ఉపాధి, విద్య, భద్రత వంటి సామాజిక ఆర్థిక వివక్షలను ఎదుర్కొంటున్నారు. వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

దీనికి ఒక ఉదాహరణ 2018 జాతీయ రాజ్య చట్టం. ఈ చట్టం ఇజ్రాయిల్ యూదుల జాతీయ రాజ్యంగా ప్రకటించి, జాతీయ స్వీయ నిర్ణయాధికారాన్ని యూదులకు మాత్రమే పరిమితం చేశారు. తాము ఇజ్రాయిల్ ప్రజలమైనా, పన్నులు చెల్లిస్తున్నా, ఎన్నికల్లో పోటీ చేస్తూ, ఓటు హక్కు వినియోగించుకుంటున్నా సొంత దేశంలో జాతీయ గుర్తింపు, స్వీయ నిర్ణయాధికారం విషయంలో సమానంగా ఎందుకు అర్హులంకామని అరబ్బులు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం కష్టమే..

19 సీట్లు గెలుచుకున్నప్పటి, అరబ్ పార్టీలను ప్రభుత్వంలో చేర్చుకోవడం కష్టమే. ఎందుకంటే ఈ పార్టీలు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయని నెతన్యాహూ ఆరోపిస్తున్నారు. వీరిలో ఇప్పుడు నెతన్యాహూ, ఆయన ప్రత్యర్థి ఐసన్‌కోట్ కానీ జత కలిసే అవకాశం లేదు. ప్రతిపక్ష నేతలు నఫ్తాలి బెన్నెట్, యైర్ లాపిడ్ వారితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నిరాకరించారు. 2021 ఎన్ని్కల్లో రామ్ పార్టీ, నఫ్తాలీ బెన్నెట్, యార్ లాపిడ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. ఇజ్రాయిల్ చరిత్రలో ఒక స్వతంత్ర అరబ్ పార్టీ ప్రభుత్వంలో చేరి అధికారంలో భాగస్వామ్య కావాలని నిర్ణయించుకోవడం ఇదే మొదటిసారి.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్

నాలుగో టీ20 మ్యాచ్‌లో సాధించిన భారీ విజయంపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్...

చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలో కలకలం రేగింది. కమ్మెట గ్రామ...

Fake Currency: విశాఖలో భారీగా నకిలీ కరెన్సీ కలకలం.. 66 లక్షల విలువైన నోట్లు పట్టివేత..

విశాఖపట్నం మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నకిలీ కరెన్సీ చెలామణి...

OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి

OTR: ఆ ఇంటి గడప తొక్కారో…. ఇక అంతే సంగతులు. మీరు...