28
October, 2026

A News 365Times Venture

28
Wednesday
October, 2026

A News 365Times Venture

OTR: జీవీ చేసిన ఒక్క తప్పుతో సీన్ రివర్స్..? ఆర్యవైశ్యుల ఓట్లు ఎటువైపు..?

Date:

OTR: వైసీపీ ఆడుతున్న డిఫరెంట్‌ గేమ్‌ అక్కడ టీడీపీని బాగా…. ఇరకాటంలో పెడుతోందా? తొందపడి ఒక కోయిల అన్నట్టు ముందూ వెనకా ఆలోచించకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే పెట్టిన ఒక మీటింగ్‌ ఇప్పుడు తిరిగి ఆయనకే చుట్టుకుందా? తప్పు దిద్దుకునే క్రమంలో ఇంకో తప్పుచేసి… నల్లేరు మీద నడకలా ఉండాల్సిన గెలుపున సంక్లిష్టం చేసుకున్నది ఎక్కడ? ఏ ఎమ్మెల్యేకు స్థానిక పరిణామాలు నిద్ర లేకుండా చేస్తున్నాయి?. పల్నాడు జిల్లా వినుకొండలో మున్సిపల్ ఎన్నికలు టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు చుక్కలు చూపిస్తున్నాయట. వైసీపీ వేస్తున్న పాచికలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ముందు రకరకాల లెక్కలేసుకుని ఇక్కడ ఈజీగా గెలవవచ్చని భావించింది టీడీపీ. కానీ… తీరా చూస్తే… ఎక్కడో కొడుతోందన్నా అంటూ… ఆ పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారట. అందుకు కారణాలు కూడా బలంగానే ఉన్నాయని అంటున్నారు. వినుకొండ మున్సిపల్ చైర్మన్ సీటు జనరల్‌గా ఉంది. దీంతో పోటీ భారీగా పెరిగిపోయింది. ఛైర్మన్ సీటును ఆర్యవైశ్య సామాజికవర్గానికి కేటాయించాలని భావించారట ఎమ్మెల్యే జీవీ. అందులో భాగంగానే ఆ సామాజికవర్గానికి చెందిన నేతలతో ఎవరు అభ్యర్ది అయితే బాగుంటుందని చర్చించారు కూడా. కానీ… సడన్‌గా.. మైనార్టీ సామాజికవర్గానికి చెందిన షమీమ్ ఖాన్‌ పేరు ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై ఆర్యవైశ్య నేతలు మండిపడ్డారు.

అంతేకాదు ఏకంగా రెబల్ అభ్యర్దులుగా నామినేషన్లు వేశారు. వినుకొండలో గెలుపోటములు డిసైడ్ చేసే స్థాయిలో వైశ్య ఓటర్లు ఉండడంతో దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది టీడీపీ. అయితే ఆ నేతలు తగ్గకపోవడంతో ఇన్ ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రంగంలోకి దిగి ఆర్యవైశ్య నేతలతో చర్చించి ఛైర్మన్ అభ్యర్దిని మార్చడం కుదరదని, కావాలంటే…. వైస్ ఛైర్మన్ పదవి వైశ్యులకు ఇస్తామని చెప్పారట. ఆ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో ఆ చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సరిగ్గా….ఇక్కడే సీన్ లోకి వైసీపీ ఎంటర్ అయ్యింది. వైసీపీ అప్పటికే మైనార్టీ నేత ఖాన్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అసంతృప్తితో ఉన్న ఆర్యవైశ్య సామాజికవర్గం నేతలతో చర్చించారు. దీంతో… టీడీపీ రెబల్ అభ్యర్ది నగేష్ కుటుంబ సభ్యులు వైసీపీలో చేరిపోయారు. ఆ ఊపుతో…. బొల్లా, వైశ్య ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. ఆ మీటింగ్‌ ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు, సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో టీడీపీ శిబిరంలో టెన్షన్ మొదలలైందట. వైసీపీ గెలిస్తే ఆర్యవైశ్యులకు వైస్ చైర్మన్ పదవి ఇస్తానని కూడా ఆ మీటింగ్‌లో హామీ ఇచ్చారు. వైసీపీ తరపున ఆరుగురు వైశ్యులకు కౌన్సిలర్‌ సీట్లు ఇచ్చామని కూడా గుర్తు చేశారట బొల్లా. ఈ రకంగా…. ఇలా ఆ సామాజికవర్గం నేతలను తమవైపునకు తిప్పుకునేందుకు వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది.

ఈ పరిస్థితుల్లో… వినుకొండ వైశ్యులు వైసీపీ వైపునకు మొగ్గుతున్నారంటూ కూటమి నేతల్లో గుబులు మొదలైందని చెప్పుకుంటున్నారు. బొల్లా మీటింగ్‌ మరుసటి రోజే నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు రంగంలోకి దిగారు.
ఆర్యవైశ్య నేతలతో మరోసారి సమావేశం నిర్వహించారాయన. అయితే ఆ మీటింగ్‌కు ఆ సామాజికవర్గం నుంచి పెద్దగా స్పందన లేకపోవడం కూటమి నేతలకు మింగుడుపడ్డంలేదని అంటున్నారు. ఇదే సమయంలో వైసీపీ మరో అస్త్రాన్ని బయటకు తీసింది. వినుకొండ కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్దిగా షమీమ్ ఖాన్, వైసీపీ అభ్యర్దిగా పీఎస్ ఖాన్ బరిలో ఉన్నారు. ఈ మున్సిపాలిటీ పరిధిలో అత్యధికంగా ముస్లిం ఓటర్లుంటే… ఆ తర్వాతి స్థానంలో ఆర్యవైశ్యులు ఉన్నారు.
అయితే… ఇప్పటికే టిక్కెట్‌ ఝలక్‌ తర్వాత వైశ్యులంతా ఎమ్మెల్యే జీవీపై అసంతృప్తితో ఉన్నారట. ఇక అత్యధిక ఓటు బ్యాంక్ ఉన్న ముస్లిం ఓట్లు కూడా టీడీపీకి దక్కకుండా తమ పార్టీ నేత రషీద్ హత్య కేసును తెరపైకి తెస్తోంది ఫ్యాన్‌ పార్టీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో వినుకొండలో రషీద్‌ను నడిరోడ్డుపై హత్య చేశారు. ఆ కేసులో నిందితుడిగా ఉన్న షమీమ్‌ఖాన్‌కే ఇప్పుడు టీడీపీ టిక్కెట్‌ దక్కింది. దీంతో… ఇద్దరూ ముస్లింలే అయినా… హత్యలు చేసిన అభ్యర్దివైపు ఉంటారా… మంచి వ్యక్తి వైపు ఉంటారా అంటూ వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది. రషీద్ హత్యను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవడం ద్వారా ముస్లిం ఓట్లు కూటమి వైపు మళ్లకుండా ప్రయత్నిస్తున్నారు వైసీపీ నేతలు. అదే జరిగితే అత్యధిక ఓటర్లు ఉన్న రెండు సామాజికవర్గాలు అధికార పార్టీకి దూరం అవడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వినుకొండ మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి ఎదురీత తప్పదనే ప్రచారం బలంగా జరుగుతోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Shreyas Iyer: ఓపెనర్ల ఆట చూసి ఆశ్చర్యం వేసింది.. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు..

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల...

Arnab Cyclone Alert: దూసుకొస్తున్న ‘అర్నబ్‌’.. తెల్లవారుజామున 2–4 గంటల మధ్య తీరం దాటనున్న అతితీవ్ర తుఫాన్..

Arnab Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ తీరానికి అతితీవ్ర తుఫాన్ అర్నబ్ వేగంగా...

Pak Vs SL: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు చేరుకున్న శ్రీలంక..

శ్రీలంకతో జరిగిన ట్రై సిరీస్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై శ్రీలంక 8 వికెట్ల...