26
October, 2026

A News 365Times Venture

26
Monday
October, 2026

A News 365Times Venture

Asian Para Games: ఆసియా పారా క్రీడలను ఘనంగా ముగించిన భారత్.. 114 పతకాలతో గత రికార్డులు బద్దలు..

Date:

జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరిగిన ఆసియా పారా గేమ్స్ 2026లో భారత పారా అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించారు. చరిత్రలోనే భారత్ ఎన్నడూ లేనివిధంగా అత్యుత్తమంగా నాల్గవ స్థానాన్ని దక్కించుకుంది. ఈ పోటీలు శనివారంతో ముగియగా, మునుపటి రికార్డులన్నింటినీ తిరగరాస్తూ భారత్ ఏకంగా 114 పతకాలతో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇందులో 30 స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్య పతకాలు ఉన్నాయి. గతంలో 2022 హాంగ్‌జౌ ఆసియా పారా గేమ్స్‌లో భారత్ సాధించిన 108 పతకాలే ఇప్పటివరకు అత్యుత్తమ రికార్డుగా ఉండేది. కానీ, ఈసారి ఆ రికార్డును బద్దలు కొడుతూ భారత్ పతకాల సంఖ్యను 114కి పెంచింది.

పోటీల చివరి రోజు వరకు నాల్గవ స్థానం కోసం దక్షిణ కొరియా నుంచి భారత్‌కు గట్టి పోటీ ఎదురైంది. దక్షిణ కొరియా తమ పతకాల సంఖ్యను 100కి చేర్చినప్పటికీ, ఆ దేశం కేవలం 29 స్వర్ణాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భారత్ కంటే ఒక స్వర్ణ పతకం వెనుకబడిపోవడంతో, దక్షిణ కొరియా ఐదవ స్థానంతో సరిపెట్టుకుంది. అలాగే ఇరాన్ 26 స్వర్ణాలతో ఆరవ స్థానంలో నిలిచింది.

ఈ పతకాల పట్టికలో చైనా అగ్రస్థానాన్ని దక్కించుకోగా, ఆతిథ్య జపాన్ రెండవ స్థానంలో, ఉజ్బెకిస్తాన్ మూడవ స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత భారత్ నాల్గవ స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణ కొరియా, ఇరాన్, థాయ్‌లాండ్, ఇండోనేషియా, కజాకిస్తాన్, సౌదీ అరేబియా దేశాలు టాప్-10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, ఆర్చరీ, షూటింగ్ వంటి విభాగాలలో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి దేశం గర్వపడేలా చేశారు. చిన్న జట్టుతోనే బరిలోకి దిగినప్పటికీ, గత రికార్డులను పూర్తిగా బద్దలు కొట్టి పారా క్రీడారంగంలో భారత్ తన సత్తాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!

PAK vs ENG: లాహోర్ వేదికగా జరిగిన వన్డే ట్రై-సిరీస్ మ్యాచ్‌లో...

El Nino: ఎల్‌నినో రికార్డ్.. తొలిసారిగా 30°Cకు చేరిన ఉష్ణోగ్రతలు..

El Nino: పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో(El Nino) ప్రపంచాన్ని భయపెడుతోంది....

Saurav Das: ‘‘ఢిల్లీలో ఉంటున్నట్లు ఆధారాలేవి?’’ CJP నేతకు కోర్టు ఆదేశం

Saurav Das: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కో-కన్వీనర్ సౌరవ్ దాస్‌‌కు...

Astra Missile: భారత ‘‘అస్త్ర క్షిపణి’’పై ఇండోనేషియా ఆసక్తి..

Astra Missile: భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులపై విదేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి....