25
October, 2026

A News 365Times Venture

25
Sunday
October, 2026

A News 365Times Venture

Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!

Date:

Pakistan LPG Crisis: దాయాది దేశం పాకిస్తాన్ మరో సంక్షోభంతో సతమతం అవుతోంది. ఆ దేశంలో వంటగ్యాస్ కొరత తీవ్రమైంది. ఇరాన్‌తో కీలక సరిహద్దు మార్గాలను మూసేయడంతో దేశంలో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో 12 కిలోల గ్యాస్ సిలిండర్ ధర కొన్ని ప్రాంతాల్లో రూ. 8200కు చేరింది. (భారత కరెన్సీలో ఇది రూ. 2700 సుమారుగా) చలికాలం సమీపిస్తుండటంతో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం పడబోతోంది.

సరిహద్దు మూసివేత..

2026 అక్టోబర్ 17న పాకిస్తాన్-ఇరాన్ మధ్య ఉన్న గబ్ద్–రిమ్దాన్, తాఫ్తాన్ సరిహద్దు మార్గాలను మూసివేశారు. బలూచిస్తాన్‌లో తిరుగుబాటు నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అక్రమ రవాణా నియంత్రణ కోసం సరిహద్దుల్ని మూసేసింది. అమెరికా ఒత్తిడి, ఆంక్షల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు ఉన్నాయి. సరిహద్దు మూసేయడంతో ఎల్పీజీ రవాణా దెబ్బతింది. వందలాది ట్యాంకర్లు సరిహద్దులకు ఇరువైపుల నిలిచిపోయాయి. 4500 మెట్రిక్ టన్నులకు పైగా గ్యాస్ ఇరాన్ వైపు నిలిచిపోయినట్లు సమాచారం.

రూ. 4500 నుంచి రూ. 8200కు పెరిగింది.

సరిహద్దు మూసేయడంతో గతంలో 12 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 4500 ఉండగా, ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో రూ. 7000 నుంచి రూ. 8000 వరకు పెరిగింది. లాహోర్‌లో సుమారు రూ. 7500 ఉంటే, స్కార్దూ లో ఇది రూ. 8200కు చేరింది. పాకిస్తాన్ తన గ్యాస్ దిగుమతుల్లో 70 శాతం ఇరాన్‌పైనే ఆధారపడుతోంది. రాబోయే చలికాలం కావడంతో గ్యాస్ డిమాండ్ మరింత పెరుగుతోంది. దీంతో గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Jammu Kashmir: ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్ రక్షిస్తోంది’’.. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..

Jammu Kashmir: నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి...

Neha Bora: నేహా బోరాకు ఢిల్లీ పోలీస్ నోటీసులు.. అక్టోబర్ 29 వరకే గడువు.!

Neha Bora: ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) అధ్యక్షురాలు నేహా...

OTR: ముగ్గురు మంత్రులు.. ముగ్గురు వారసులు! నెక్స్ట్ ప్లాన్ ఏంటి?

OTR: తెలంగాణ మంత్రులు ముగ్గురు ప్లాన్‌ బీ కోసం ఆలోచిస్తున్నారా? సెకండ్‌...

OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం

OTR: అక్కడ జడ్పీ పీఠం టీడీపీ, జనసేన మధ్య నీకా నాకా...