25
October, 2026

A News 365Times Venture

25
Sunday
October, 2026

A News 365Times Venture

OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం

Date:

OTR: అక్కడ జడ్పీ పీఠం టీడీపీ, జనసేన మధ్య నీకా నాకా అన్నట్టు మారిపోయిందా? టిక్కెట్‌ కోసం తమ్ముళ్ళ మధ్య పోటీని తట్టుకోలేక లోకల్‌ టీడీపీ లీడర్స్‌ చేతులెత్తేస్తే… మధ్య జనసేన వచ్చి నాకంటూ తన్నుకుపోయే ప్రయత్నంలో ఉందా? అసలక్కడ గ్లాస్‌ పార్టీకి జడ్పీ ఛైర్మన్‌ స్థాయి నేత లేరన్నది నిజమేనా? బలం లేని చోట ఆ పార్టీ ఎందుకు రేస్‌లోకి వచ్చింది? వాళ్లు చెబుతున్న లెక్కలేంటి?. చిత్తూరు జిల్లా పాలిటిక్స్‌లో ఇప్పుడు జడ్పీ చైర్మన్ కుర్చీ చుట్టూ అసలైన పొలిటికల్ గేమ్ మొదలైందట. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని జనరల్ మహిళకు కేటాయించడంతో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. కానీ… అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన కూటమికి ఇప్పుడు జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకోవడం పెద్ద టాస్క్‌ అయిందని అంటున్నారు. ఆశావహుల జాబితా చాంతాడంత పెరిగిపోవడంతో స్థానిక నాయకత్వానికి ఏం చేయాలో పాలుపోవడం లేదన్నది లోకల్ టాక్. ఎవరికి వారు తమదే పైచేయి కావాలని అంతర్గతంగా లాబీయింగ్ మొదలుపెట్టడం రచ్చకు దారీ తీస్తోంది. పదవి కోసం నాయకులు నడుపుతున్న ఈ ప్రెజర్ పాలిటిక్స్ ఇప్పుడు జిల్లా కూటమిలో అసమ్మతి కుంపట్లను రాజేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

అదే సమయంలో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్‌ ఒకటి లోకల్‌ కూటమిని కుదిపేస్తోందని అంటున్నారు. అంతవరకు తెలుగుదేశం పార్టీ నేతల మధ్యే నడుస్తున్న రేస్‌లోని ఉన్నట్టుండి గ్లాస్ పార్టీ ఎంట్రీ ఇచ్చి బాంబు పేల్చిందట. జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా టీడీపీ నేత కఠారి హేమలతను ఎంపిక చేశారు. దీంతో… రెండు కీలక పదవులు పసుపు ఖాతాలో ఉన్నాయి కాబట్టి… పొత్తు ధర్మం ప్రకారం జడ్పీ చైర్మన్ సీటు తమకే కేటాయించాలని స్థానిక జనసేన నేతలు పట్టుబడుతున్నారట. ఈ విషయాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం, ఆయన నేరుగా సీఎం చంద్రబాబు దగ్గర ప్రస్తావించారన్న ప్రచారం జిల్లా టీడీపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోందంటున్నారు. పైకి చూడ్డానికి, జనసేన నాయకులు చెబుతున్న రీజనింగ్‌ కూడా కన్విన్సింగ్‌గానే ఉన్నా… అసలు సమస్య కూడా అక్కడే ఉందంటున్నారు టీడీపీ లీడర్స్‌. అసలు జిల్లాలో గ్లాస్‌ పార్టీ తరఫున జడ్పీటీసీగా పోటీ చేసిందెవరు? ఛైర్మన్‌గిరీ కోసం నామినేషన్ వేసిందెవరో అంతు చిక్కడం లేదంటున్నారు. టిక్కెట్‌ కోసం పోటాపోటీగా ఉన్న తమను వదిలేసి… అసలు పోటీ పడేవాళ్ళు ఎవరో అర్ధంకాని జనసేనకు జడ్పీ ఛైర్మన్‌ పదవి ఎలా కేటాయిస్తామన్నది టీడీపీ లీడర్స్ క్వశ్చన్‌. ఇక జడ్పీ చైర్మన్ స్థానం ఓసీ మహిళకు ఖరారు కావడంతో టీడీపీ నాయకులంతా గేర్ మార్చేశారట. తమ కుటుంబాల్లోని మహిళలను బరిలోకి దించి ఆ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. జిల్లాలో చైర్మన్ సీటు ఆశిస్తున్న నలుగురు జడ్పీటీసీ అభ్యర్థులు బరిలో ఉండగా, వీరంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు.

దాంతో… స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఏమీ తేల్చలేక తలలు పట్టుకుంటున్నారట. అందరూ సీనియర్లే కావడం, ఎవరికి మద్దతిచ్చినా మిగతావారు భగ్గుమనే ప్రమాదం ఉండటంతో సైలెంట్‌గా ఉండిపోవడం తప్ప నేతలేమీ చేయలేకపోతున్నట్టు తెలిసింది. రేసులో ప్రధానంగా ప్రముఖ విద్యాసంస్థల అధినేత డాక్టర్ మందలపు తేజోమూర్తి భార్య శైలజ మూర్తి పేరు గట్టిగా వినిపిస్తోంది. పూతలపట్టు జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమెకు పార్టీకి విధేయత ప్లస్‌ అవుతుందంటున్నారు. అలాగే… గత అసెంబ్లీ ఎన్నికల్లో పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారని చెబుతారు.అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వద్ద కూడా ఈ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం కలిసొస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట. అయితే ఆర్థికంగా బలంగా ఉన్న వీరికి అవకాశం ఇస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఎక్కడ దెబ్బతింటుందోనని ఒకరిద్దరు సీనియర్ తమ్ముళ్లు తెరవెనుక అడ్డుపుల్లలు వేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు జీడీ నెల్లూరు మాజీ కో ఆర్డినేటర్ భీమినేని చిట్టిబాబు తన కుమార్తె డాక్టర్ జాహ్నవిని ఎలాగైనా కుర్చీపై కూర్చోబెట్టాలని తీవ్రంగా శ్రమిస్తున్నారట.

గతంలో పాలసముద్రం జడ్పీటీసీగా, పుత్తూరు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఆయనది. వీరితో పాటు చిత్తూరు రూరల్ మండలానికి చెందిన సీనియర్ నేత చంద్రప్రకాష్ తన భార్య గీర్వాణిని గానీ, ఇద్దరు కూతుళ్లలో ఒకరిని గానీ బరిలో నిలపాలని చూస్తున్నట్టు తెలిసింది. గతంలో గీర్వాణి జడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేసినప్పుడున్న పరిచయాలు కలిసివస్తాయన్నది ఆ ఫ్యామిలీ లెక్క. అటు బంగారుపాళ్యం మండలానికి చెందిన ఎన్‌పీ జయప్రకాష్ సైతం తన భార్య సుచిత్ర కోసం సీనియర్ నేతల ద్వారా గట్టిగానే చక్రం తిప్పుతున్నారట. మొత్తానికి చిత్తూరు జడ్పీ పీఠం వ్యవహారం కూటమిలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరిందని అంటున్నారు. ఒకవైపు ఒకే ఒక్క కుర్చీ కోసం ఇంతమంది సీనియర్లు పోటీ పడుతుంటే మధ్యలో జనసేన ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయిందని అందరూ తలలు పట్టుకుంటున్నట్టు తెలిసింది. ఇప్పుడు జనసేన కోరినట్టుగా జడ్పీ చైర్మన్ వారికే వెళితే పరిస్థితి ఏంటన్నది తమ్ముళ్ళ ఆందోళన. మొత్తానికి ఆశల్లో విహరిస్తున్న టిడిపి నేతలకు గట్టి షాకే జనసేన రూపంలో తగిలిందని అంటున్నారు పరిశీలకులు. ఫైనల్‌గా ఎవరి లెక్కలు ఎలా మారతాయో చూడాలి.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Jammu Kashmir: ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్ రక్షిస్తోంది’’.. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..

Jammu Kashmir: నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి...

Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!

Pakistan LPG Crisis: దాయాది దేశం పాకిస్తాన్ మరో సంక్షోభంతో సతమతం...

Neha Bora: నేహా బోరాకు ఢిల్లీ పోలీస్ నోటీసులు.. అక్టోబర్ 29 వరకే గడువు.!

Neha Bora: ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) అధ్యక్షురాలు నేహా...

OTR: ముగ్గురు మంత్రులు.. ముగ్గురు వారసులు! నెక్స్ట్ ప్లాన్ ఏంటి?

OTR: తెలంగాణ మంత్రులు ముగ్గురు ప్లాన్‌ బీ కోసం ఆలోచిస్తున్నారా? సెకండ్‌...