18
October, 2026

A News 365Times Venture

18
Sunday
October, 2026

A News 365Times Venture

Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్‌ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..

Date:

Kiren Rijiju: బంగ్లాదేశ్, ఫ్రాన్స్ దేశాల్లో చోటుచేసుకుంటున్న హింసాత్మక సంఘటనల తరహాలోనే భారత్‌లో విధ్వంసానికి కొన్ని శక్తులు కుట్ర పన్నాయని కేంద్రమంత్రి కిరెన్ రిజిజు సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో అధికార మార్పు ఎన్నికల ద్వారానే సాధ్యమవుతుందని, బాహ్య శక్తుల ద్వారా కాదని ఆయన స్పష్టం చేస్తూ, ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌లో హింస, ఫ్రాన్స్‌లో అల్లర్లు, దహనాలు, దోపిడీలను ప్రస్తావిస్తూ భారతదేశంలో ఇలాంటి పరిణామాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తు్న్నారని ఆరోపించారు. భారతదేశ వ్యతిరేక శక్తులు, కొందరు రాజకీయ నాయకులు యువతను రెచ్చగొట్టి దేశంలో హింసను వ్యాప్తి చేయాలని చూశారని ఆరోపించారు.

ఇదే సమయంలో, కిరెన్ రిజిజు జార్జ్ సోరోస్ పేరును ప్రస్తావిస్తూ.. ‘‘భారత్ బంగ్లాదేశ్‌, ఫ్రాన్స్ కాదని, భారత్‌లో అధికార మార్పు ఎన్నికల ద్వారా జరుగుతుంది, కానీ సోరోస్ ద్వారా కాదు’’ అని వ్యాఖ్యానించారు. తన పోస్టులు ఇటీవల ‘‘రెజిమ్ ఛేంజ్’’(పాలన మార్పు) గురించి మాట్లాడిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, వామపక్ష విద్యార్థి నేత నేహా బోరా వీడియోలను షేర్ చేశారు. ఈ వీడియోల్లో నేహా బోరా బంగ్లాదేశ్ ఉద్యమం మాకు స్పూర్తి అని చెబుతోంది, ప్రశాంత్ భూషణ్ మోడీ సర్కార్ ‘‘పాలన మార్పు’’పై వ్యాఖ్యలు చేశారు.

దీనికి ముందు కూడా కిరెన్ రిజిజు అక్టోబర్ 15 తన సోషల్ మీడియా పోస్టులో.. దేశభక్తులుగా భావించే భారతీయులు, భారత రాజ్యాంగాన్ని విశ్వసించే వారు ఒక వైపు ఉండగా.. నక్సలైట్లు, అరాచకవాదులు మరోవైపు ఉన్నారని అన్నారు. భారత్‌ను రక్షించుకోవాలనే దేశభక్తులకు, దేశవ్యతిరేకులకు మధ్య పోరాటం జరుగుతోందని అన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..

Gurugram Techie Couple: హర్యాలోని గురుగ్రామ్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఐటీ...

Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!

Donald Trump: ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న హింసాత్మక ఆందోళనలు, దహనాలు, లూటీలపై అమెరికా...

Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!

Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు...

Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!

Sri Lanka: శ్రీలంకలో శనివారం భారీ విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం...