18
October, 2026

A News 365Times Venture

18
Sunday
October, 2026

A News 365Times Venture

Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!

Date:

Army Major: తోలి ఆర్మీ అధికారులత భార్యలతో సహా నలుగురు మహిళలతో వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్మీ మేయర్‌పై చర్యలకు భారత సైన్యం సిద్ధమైంది. సర్వీసును ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆర్మీ చీఫ్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం 23 గ్రెనేడియర్స్‌కు అనుబంధంగా ఉన్న 11 ఆర్మర్డ్ రెజిమెంట్‌కు చెందిన ఒక మేజర్‌ ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సంబంధిత పరిస్థితుల కారణంగా కోర్ట్ మార్షల్ ద్వారా విచారణ చేపట్టడం సరైనది కాదని భావించి, ఆర్మీ రూల్స్ 14,19 కింద పరిపాలనా చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ కోరారు.

భార్య ఫిర్యాదుతో వెలుగులోకి..

ఈ వ్యవహారంపై 2023 ఆగస్టులో మేజర్ భార్య రక్షణమంత్రిత్వ శాఖలోని ఆర్మీ ప్రధాన కార్యాలయానికి చెందిన డిసిప్లిన్ అండ్ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేసినట్లు సాయుధ దళాల ట్రిబ్యునల్‌లో దాఖలైన పిటిషన్ పేర్కొంది. వివాహేతర సంబంధంతో పాటు డ్రగ్స్ వినియోగం, నిర్లక్ష్యం వంటి ఆరోపణలు కూడా అతడి మీద ఉన్నట్లు తెలుస్తోంది. 2023 అక్టోబర్‌లో 55 (I) మెకనైజ్డ్ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయం కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేసింది.

అయితే, విచారణలో ఆర్మీ రూల్ 180 ప్రకారం తప్పనిసరిగా పాటించాల్సిన విధానాలను ఉల్లంఘించారని మేజర్ ఆరోపించారు. ఆరోపణల్లో ప్రస్తావించిన మహిళలు, వారి భర్తలను విచారణకు పిలవలేదని, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం, తన నివాసంలో సోదాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.

కోర్ట్ మార్షల్‌కు బదులుగా పరిపాలనా చర్యలు..

2025 మార్చిలో ఆర్మీ చట్టం సెక్షన్లు 45, 63 కింద ప్రాథమిక అభియోగ పత్రాన్ని రూపొందించారు. దీని తర్వాత సాక్ష్యాల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దశల్లో సంబంధిత మహిళల్ని విచారణకు పిలవాలని మేజర్ కోరినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీని తర్వాత కోర్ట్ మార్షల్‌కు బదులుగా పరిపాలనా చర్యలు చేపట్టాలని ఆర్మీ నిర్ణయించింది. దీనిని సవాల్ చేస్తూ మేజర్ సాయుధ దళాల ట్రిబ్యునల్(AFT)ను ఆశ్రయించారు. తనపై వచ్చిన ఫిర్యాదును భార్య విత్ డ్రా చేసుకున్నందున, గత విచారణల ఆధారంగా జారీ చేసిన నోటీసులు చట్టవిరుద్ధమని వాదించారు.

మేజర్, ఆయన భార్య 2026లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారని పిటిషన్ పేర్కొంది. రాజీ ఒప్పందంలో భాగంగా కుటుంబ వివాదాల నేపథ్యంలో తగిన ఆధారాలు లేకుండా ఫిర్యాదు చేసినట్లు ఆమె తన ఫిర్యాదును విత్ డ్రా చేసుకున్నట్లు మేజర్ తెలిపారు. అయితే, అక్టోబర్ 14న పిటిషన్ విచారించిన AFT ప్రిన్సిపల్ బెంచ్.. మేజర్‌పై కొనసాగుతున్న పరిపాలనా చర్యలను నిలిపివేయడానికి నిరాకరించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!

Sri Lanka: శ్రీలంకలో శనివారం భారీ విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం...

Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..

Kiren Rijiju: కేంద్రమంత్రి కిరెన్ రిజిజు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ...

Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..

Kiren Rijiju: ‘‘రెజిమ్ ఛేంజ్(ప్రభుత్వ మార్పు)’’కోసం పిలుపునిస్తున్న వారికి కేంద్ర మంత్రి...

CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?

CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) చీఫ్ అభిజిత్ దీప్కేను పోలీసులు...