15
October, 2026

A News 365Times Venture

15
Thursday
October, 2026

A News 365Times Venture

Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?

Date:

Story Board: మన దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో ఆహారధాన్యాల కొరత బాగా ఉండేది. అప్పట్లో విదేశాల నుంచి ఓడ వస్తే కానీ.. మనకు ఆహారధాన్యాల సరఫరా జరిగేది కాదు. అలా 2-3 దశాబ్దాల పాటు కష్టాలు పడిన తర్వాత.. హరిత విప్లవంతో మొత్తం కథే మారిపోయింది. అప్పట్నుంచీ ప్రకృతి విపత్తులు వచ్చినా కూడా ఆహారకొరత అనేది ఎప్పుడూ రాలేదు. చివరకు కరోనా లాంటి సంక్షోభం వచ్చినా.. మనకు నిత్యావసరాలకు కొరత రాలేదు. ఇటీవలి ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు కూడా మనపై పరోక్ష ప్రభావం చూపినా.. మొన్నటిదాకా ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండటం సామాన్యుడికి ఊరటనిచ్చింది. కానీ వీటన్నింటికీ మించి ఎల్‌నినో కొట్టిన దెబ్బతో.. జనం దిమ్మ తిరిగింది. అప్పటిదాకా అదుపులో ఉన్న నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా హై జంప్ చేశాయి. దీంతో ద్రవ్యోల్బణం కట్టుదాటి.. కొత్త రికార్డులకు చేరింది. ఇంకా దారుణంగా మునుపెన్నడూ లేని విధంగా పట్టణ ప్రాంతాలకు మించి గ్రామీణ ప్రాంతాల్లో ఆహారద్రవ్యోల్బణం కోరలు చాచింది. ఈ దెబ్బతో నిత్యావసరాల ధరలన్నీ బ్రేకుల్లేని కారుల్లా దూసుకుపోతున్నాయి. అసలే వేతనాలు పెరగక అల్లాడుతున్న సామాన్యుడికి.. ధరాఘాతం గట్టిగానే తగిలింది. అంతంతమాత్రం ఆదాయంలో ఎక్కువ శాతం నిత్యావసరాలకే ఖర్చైపోతోంది. ఇక మిగిలే అరకొరతో కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలో తెలియక.. మధ్యతరగతి కూడా గుడ్లు తేలేసే దుస్థితి నెలకొంది.

దేశంలో ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఆహారం, ఇంధన ధరలు పెరగడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. ఆహార ధరల పెరుగుదల ఇప్పుడు మరిన్ని వస్తువులకు విస్తరిస్తోంది. మిడిల్‌ ఈస్ట్‌లో మరోసారి ఉద్రిక్తకర వాతావరణం నెలకొనగా.. ఇంధన ఉత్పత్తి, సరఫరాలకు అది ఆటంకంగా మారింది. దేశంలో నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. మొత్తం ద్రవ్యోల్బణం కంటే ఆహార ధరలు వేగంగా పెరుగుతున్నాయి. అనేక నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్న తరుణంలో, ఇది గృహ బడ్జెట్లపై ఒత్తిడిని పెంచుతోందని నిపుణుల చెబుతున్నారు. ఎస్‌బిఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం సెప్టెంబర్ 2026 నాటికి దేశ ఆహార ద్రవ్యోల్బణం 7.74%కి చేరుకుంది. ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, నిమ్మకాయలు, బియ్యం ధరలు పెరగడం వల్ల ఆహార ఖర్చులు పెరిగాయి. సవరించిన వినియోగదారుల ధరల సూచిక ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 4.82% నుంచి సెప్టెంబర్‌లో 5.54%కి పెరిగింది. మొదటిసారిగా 5% మార్కును దాటింది.

నవంబర్‌లో మొత్తం ద్రవ్యోల్బణం 6.7%-6.8% వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఎస్‌బిఐ రీసెర్చ్ అంచనా వేస్తోంది. గృహ ఖర్చులలో ఆహారం ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది. ముఖ్యంగా తక్కువ ఆదాయ కుటుంబాలకు నిత్యావసర కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల ధరలు పెరిగినప్పుడు కిరాణా సామానుపై ఎక్కువ ఖర్చు చేయవలసి రావచ్చు లేదా ఇతర వస్తువుల కొనుగోళ్లను తగ్గించుకోవలసి రావచ్చు. పెరిగిన ధరలకు ప్రతిస్పందనగా గృహాలు చౌకైన ప్రత్యామ్నాయాలకు మారడం, తక్కువ పరిమాణంలో కొనుగోలు చేయడం లేదా ఇతర ఖర్చులను తగ్గించుకోవడం వంటివి చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎస్‌బిఐ రీసెర్చ్ ప్రకారం ద్రవ్యోల్బణానికి వినియోగదారుల ధరల సూచీ అందించే మొత్తం వాటాలో 75% వాటా ఉన్న నిత్యావసర వస్తువుల సంఖ్య ఆగస్టులో 25 నుంచి సెప్టెంబర్‌లో 31కి పెరిగింది. ఇది ధరల ఒత్తిళ్లు విస్తృత శ్రేణి వస్తువులకు వ్యాపిస్తున్నాయని సూచిస్తుంది. కొనసాగుతున్న ఎల్ నినో ప్రభావాలు, పెరిగిన ఇంధన ధరలు నిత్యావసర వస్తువుల ధరలు ద్రవ్యోల్బణ అంచనాలకు ప్రమాదాలుగా ఉంటాయని ఎస్‌బిఐ రీసెర్చ్ గుర్తించింది. వాతావరణ పరిస్థితులు వ్యవసాయ ఉత్పత్తిని, కొన్ని ఆహార పదార్థాల లభ్యతను ప్రభావితం చేయగలని అంచనా వేస్తున్నారు. సరఫరా తగ్గితే, ధరలు మరింత పెరగవచ్చని నివేదిక పేర్కొంది. కానీ సమీప భవిష్యత్తులో సరఫరా పెరుగుదల సంకేతాలు కాకుండా.. తగ్గుదల సూచనలు రావడం.. రాబోయే ప్రమాదాన్ని కళ్లకు కడుతోంది.

ఆహార ద్రవ్యోల్బణానికి తోడు పెరిగిన ఇంధన ధరలు, రవాణా ఖర్చులు కూడా వ్యవసాయ ఉత్పత్తులను, ఇతర వస్తువులను మార్కెట్‌లకు తరలించే వ్యయాన్ని పెంచడం ఖాయం. ఫలితంగా ధరలు మరింతగా పెరుగుతాయనే అంచనాలున్నాయి. ఇప్పటికే మార్కెట్లో రిటైల్ వ్యాపారులే.. రాబోయే రోజుల్లో ధరాభారం తప్పదని వినియోగదారుల్ని బెదరగొడుతున్నారు. ఇప్పటికే గరిష్ఠ స్థాయిలో ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ఇంకా పెరిగితే.. కుటుంబాలు కుప్పకూలే ప్రమాదం ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి ద్రవ్యోల్బణ గణాంకాలకు కొత్త విధానాన్ని కేంద్రం అనుసరిస్తోంది. ఈ సిరీస్‌ విడుదల తర్వాత ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే తొలిసారి. ఆగస్టులో ఫుడ్‌ బాస్కెట్‌ ద్రవ్యోల్బణం 5.97% ఉండగా.. సెప్టెంబర్‌ నెలలో 7.74 శాతానికి చేరింది. గత ఏడాదితో పోలిస్తే బంగాళాదుంపలు 11.50 శాతం, టమాటాలు 8.62 శాతం తగ్గాయి కదా అని సరిపెట్టుకుందామంటే.. మిగతా నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఇక హెచ్చరించదగ్గ మరో డేంజర్ బెల్ ఏంటంటే.. పట్టణాల్లో ఇన్‌ఫ్లేషన్ 4.88 శాతంగా ఉంటే, పల్లెల్లో ఏకంగా 6.08 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు తక్కువ, ధరల భారం ఎక్కువై అక్కడ పేదలు అల్లాడిపోతున్నారు. జీతాలు పెరగడం లేదు కానీ.. నెలాఖరు వచ్చేసరికి నిత్యావసరాల బిల్లులు మాత్రం కొండలా పెరిగిపోతున్నాయి. పొదుపు చేసుకుందామన్నా పైసా మిగలని పరిస్థితి. పండగల సీజన్ దాటిన తర్వాత కూడా ఈ ద్రవ్యోల్బణం తగ్గకపోతే పరిస్థితి మరింత చేయిదాటిపోయే ప్రమాదం ఉంది.

ధరలు పెరగడంతో గతంలో తక్కువ మొత్తంతో కొనుగోలు చేసిన సరుకులకే ఇప్పుడు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సెప్టెంబర్‌లో కొన్ని కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఉల్లిపాయల వార్షిక ద్రవ్యోల్బణం 108.09 శాతానికి చేరింది. ఆగస్టులో ఇది 48.78 శాతంగా ఉంది. అలాగే వెల్లుల్లి ద్రవ్యోల్బణం 43.60 శాతం నుంచి 54.62 శాతానికి పెరిగింది. నిమ్మకాయల విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. వీటి ద్రవ్యోల్బణం 15.15 శాతం నుంచి 36.41 శాతానికి చేరింది. అల్లం ద్రవ్యోల్బణం 62.85 శాతంగా నమోదైనప్పటికీ, ఆగస్టులో ఉన్న 73.82 శాతంతో పోలిస్తే తగ్గింది. మరోవైపు బంగాళాదుంపల ద్రవ్యోల్బణం -11.50 శాతంగా, టమాటాల ద్రవ్యోల్బణం -8.62 శాతంగా నమోదైంది. అంటే గత ఏడాదితో పోలిస్తే వీటి ధరలు తగ్గినట్లు అర్థం. కూరగాయల ధరల్లో ఈ మార్పులు ఉన్నప్పటికీ, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి నిత్యావసరాల ధరల పెరుగుదల వంటింటి బడ్జెట్‌పై ప్రభావం చూపుతోంది. ఏతావాతా ద్రవ్యోల్బణం గణాంకాలు.. క్షేత్రస్థాయి వాస్తవాల్ని ప్రతిబింబిస్తున్నాయి. మామూలుగా అయితే ద్రవ్యోల్బణం కట్టడికి ప్రభుత్వాలు చర్యలు తీసుకునే అవకాశం ఉండేది. కానీ సూపర్ ఎల్‌నినో రావడంతో.. సర్కారు తరపున తీసుకోగలిగిన చర్యల అవకాశాలు కూడా బాగా తగ్గిపోయాయి. దీంతో ఎవరికి వారే వచ్చే ఏడాది వరకూ తమ బడ్జెట్ ప్లాన్ చేసుకుని.. ఎవరి కష్టాలు వారు పడక తప్పదనే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎటుచూసినా కష్టాలే తప్ప.. ఎక్కడా ఊరటనిచ్చే పరిణామాలు కనిపించకపోవడం.. సామాన్యుల్ని మరింతగా కలవరపెడుతోంది. దీంతో ఇప్పుడే ఇలా ఉంటే.. ఎల్‌నినో మరింత ముదిరేకొందీ.. ఇంకా ఎలాంటి దుర్భర పరిస్థితులు చూడాల్సి వస్తుందోనని జనం ముందస్తుగానే భయపడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో నాణ్యమైన సన్న బియ్యం కిలో రూ.100 పలుకుతోంది. మినపగుళ్లు, కందిపప్పు సహా అన్ని పప్పుల ధరలూ భగ్గుమంటున్నాయి. కూరగాయల ధరలూ మంటపుట్టిస్తున్నాయి. కూరగాయల ధరలు, సగటున 42 శాతం పెరిగాయి. పప్పులు, చిరుధాన్యాల రేట్లూ పెరిగాయి. ఇలా నిత్యావసరాల ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అదేమంటే ఎల్‌నినో ప్రభావం. పంట ఉత్పత్తుల కొరతనే సమాధానం. డెయిరీలు పాలధరల్ని లీటర్​కు రూ.4 చొప్పున పెంచాయి. ఇలా బియ్యం, పప్పులు, నూనెల రూపంలోనే ఒక్కో కుటుంబంపై సగటున రూ.1200 వరకు అదనపు భారం పడుతోంది. ఒకవైపేమో జీతాలు పెరగడం లేదు. మరోవైపు మాత్రం…నిత్యావసరాల ధరలు మంట పుట్టిస్తున్నాయి. బియ్యం, నూనెలు, కందిపప్పు లాంటివి పోటాపోటీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యుల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతోంది. కొత్త పంట పూర్తిగా రాకముందే బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. సాధారణంగా ధాన్యం కోతలు అక్టోబర్, నవంబర్​లో జరుగుతాయి. సంక్రాంతి వరకు పాత ధాన్యమే ఉపయోగిస్తారు. తెలంగాణ, ఏపీలో ఇంకా ఎక్కడా కొత్త పంట రాలేదు. అయినా ఏప్రిల్‌ నుంచే బియ్యం ధరల్లో పెరుగుదల మొదలైంది. ఎల్‌నినో ప్రభావంతో వరి సాగు తగ్గుతుందని, ధాన్యం ఉత్పత్తి పడిపోతుందని అధికారులు అంచనా వేశారు. సన్నబియ్యం కొరత ఉంటుందనే ప్రచారంతో బియ్యం వ్యాపారులు ముందే రేట్లు పెంచేశారు. దీంతో అడ్డూ అదుపూ లేకుండా ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.

కూరగాయల ధరలు ఎగసిపడుతున్నాయి. నెలక రోజుల క్రితం ధరలతో పోలిస్తే, నెల వ్యవధిలో 42 శాతం వరకు పెరిగాయి. ఎల్‌నినో ప్రభావంతో సాగు తగ్గింది. వేసిన పంట కూడా సెప్టెంబర్ నెలాఖరులో కురిసిన వర్షాలకు కొంతమేర దెబ్బతింది. దీంతో ధరల్లో పెరుగుదల మొదలైంది. ఆకుకూరల రేట్లూ దాదాపు రెట్టింపయ్యాయి. జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష తదితరాల ధరలు కూడా కిలోకి రూ.100 వరకు పెరిగాయి. పప్పులూ ప్రియమయ్యాయి. ఈ ఏడాది పప్పుధాన్యాల సాగుపైనా ఎల్‌నినో ప్రభావం ఉంటుందనే అంచనాలతో వాటి ధరలూ ఇప్పటి నుంచే పెంచేశారు. కిలో కందిపప్పు రూ.150 దాటేసింది. గత నెలతో పోలిస్తే కిలోకి 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు పెరిగింది. మార్కెట్‌లో నిత్యావసరాల ధరలన్నీ మండిపోతున్నాయి. ఏ వస్తువు కొందామన్నా ధరలు ఠారెత్తిస్తున్నాయి. ముఖ్యంగా బియ్యం, పంచదార, వంటనూనెల ధరలు ఆకాశాన్నంటడంతో…సగటు కుటుంబం నెలవారీ బడ్జెట్‌ తలకిందులవుతోంది. నిన్నటి దాకా నెలకు రూ. 3 వేలు అయ్యే సరకులకు ఇప్పుడు ఏకంగా రూ. 4 వేలు దాటుతోందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ దందా పెరగడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ధరాభారంతో సామాన్యులు నిత్యావసరాలను కొనలేకపోతున్నారు. కిలో కొనే చోట…అర కిలో మాత్రమే కొంటున్నారు. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో భవిష్యత్‌లో పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి

OTR:  ఆ జిల్లా టీడీపీలో లోకల్‌ బాడీ రిజర్వేషన్లు కొత్త ఈక్వేషన్స్‌కు...

AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్

AP MPTC, ZPTC Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు సంబంధించిన షెడ్యూల్‌...

Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!

Yuvraj Singh: భారత క్రికెట్ మాజీ విధ్వంసకర ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్...

Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా...