13
October, 2026

A News 365Times Venture

13
Tuesday
October, 2026

A News 365Times Venture

CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం

Date:

CM Chandrababu: అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రజలు అందించే ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టం చేశారు.. ఆర్టీజీఎస్ సమీక్షలో ఆయన ప్రజా సమస్యల పరిష్కారం, క్షేత్రస్థాయిలో అందుతున్న ప్రభుత్వ సేవల పనితీరుపై ఆరా తీశారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుపై బాధ్యతగా స్పందించి, సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

పీజీఆర్ఎస్ ద్వారా సమస్యల పరిష్కారంపై సమీక్ష
ప్రస్తుతం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) ద్వారా ప్రజల సమస్యలను వీలైనంత మేరకు పరిష్కరించగలుగుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే, ఈ విధానాన్ని మరింత వేగంగా, సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌కు ఆదేశాలు జారీ చేశారు.

అధికారుల్లో జవాబుదారీతనం ఉండాలి
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు నియమించిన నోడల్ అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత వాటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించడంతోనే సరిపెట్టకుండా, వాటిపై తీసుకున్న చర్యలను పర్యవేక్షించాలని తెలిపారు. సమస్యల పరిష్కారంలో ఉద్యోగులు, అధికారుల్లో జవాబుదారీతనం ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వ శాఖలపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
వివిధ ప్రభుత్వ శాఖలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలను వక్రీకరిస్తూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపుతున్నారని అన్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ జారీ చేసిన జీవో విషయంలో ఈ తరహా దుష్ప్రచారం జరుగుతోందని ప్రస్తావించారు. ప్రభుత్వ నిర్ణయాలు, జీవోలపై తప్పుడు ప్రచారం జరిగినప్పుడు అధికారులు ఎప్పటికప్పుడు స్పందించాలని సీఎం సూచించారు. వాస్తవాలను ప్రజలకు స్పష్టంగా వివరించి, దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆదేశించారు. మొత్తంగా, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో వేగం పెంచడంతో పాటు అధికారుల్లో జవాబుదారీతనం పెంచాలని, ప్రభుత్వ సేవలు క్షేత్రస్థాయిలో ప్రజలకు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు నాయుడు..

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు

Srisailam Reservoir: శ్రీశైలం జలాశయం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రతిష్ఠాత్మక...

Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..

Hyderabadi Dalcha Recipe: హైదరాబాదీ దాల్చాకు ప్రత్యేక స్థానం ఉంది.. పెళ్లిళ్లు.....

India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..

India Retail Inflation Rises: మార్కెట్‌లో ఏ వస్తువు కొనబోయినా.. ధరలు...

AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్‌డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!

AP Municipality Reservations 2026: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ వైపు...