11
October, 2026

A News 365Times Venture

11
Sunday
October, 2026

A News 365Times Venture

Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..

Date:

‎తెలంగాణలో క్రీడల అభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా మౌలిక సదుపాయాల కల్పనతోపాటు, యువ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, ప్రోత్సాహకాలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్పోర్ట్స్ స్టేడియాన్ని నిర్మించనున్నట్లు సీఎం ప్రకటించారని గుర్తుచేశారు.
‎
‎హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్, ఎన్‌డీటీవీ, ఏఎం గ్రీన్, ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ (ఐజీపీఎల్‌) సంయుక్త ఆధ్వర్యంలో గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ కోర్స్‌లో నిర్వహించిన ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆర్ అండ్ బి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రీడా రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ‎
‎
‎ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీని తెలంగాణకు ముఖ్యమంత్రి ఆహ్వానించారని  తెలిపారు. మెస్సీ ఫుట్‌బాల్ ఆడటంతో పాటు, హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడిందని పేర్కొన్నారు. క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రాన్ని క్రీడా రంగంలో కీలక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.
‎
‎ఇటీవల ముఖ్యమంత్రి రాష్ట్రంలో క్రీడలు, ఇతర సంబంధిత కార్యకలాపాల పురోగతిపై సమీక్ష నిర్వహించారని చెప్పారు. దక్షిణ కొరియా వంటి దేశాల్లోని విశ్వవిద్యాలయాలు క్రీడల్లో వందలాది పతకాలు సాధిస్తున్న తీరును పరిశీలించాలని ఈ సందర్భంగా సూచించారని తెలిపారు. ఒకే విశ్వవిద్యాలయం వంద పతకాలు సాధించడం వెనుక ఉన్న శిక్షణా విధానాలు, క్రీడాకారులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రోత్సాహకాలను అధ్యయనం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా దక్షిణ కొరియాలోని సంబంధిత విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, వైస్‌ ఛాన్సలర్‌తోపాటు క్రీడా అధికారులతో చర్చలు జరిపారని  వెల్లడించారు. తెలంగాణ విద్యార్థులకు క్రీడా శిక్షణ అందించేందుకు ఆ విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకోవాలని కోరినట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి శిక్షణా విధానాలను అధ్యయనం చేసి, వాటిని రాష్ట్రంలో అమలు చేయాలన్న ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
‎
‎గోల్ఫ్ క్రీడ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని, గోల్కొండ కోట వంటి చారిత్రక ప్రాంతానికి సమీపంలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ నగరానికి మరింత ప్రాచుర్యం తీసుకువస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కొనసాగుతున్న గోల్ఫ్ కోర్స్‌ను క్రీడలు, పర్యాటక రంగాల అభివృద్ధికి ఉపయోగపడే ముఖ్యమైన ప్రాజెక్టుగా అభివర్ణించారు. క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధితోపాటు పర్యాటక రంగానికి కూడా ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర క్రీడా వేదికలకు అవసరమైన సహకారాన్ని భవిష్యత్తులోనూ అందిస్తామని భరోసా ఇచ్చారు.
‎
‎విజేతలకు అభినందనలు 
‎
‎ఐజీపీఎల్‌ టోర్నమెంట్‌లో పతకాలు, విజయాలు సాధించిన క్రీడాకారులను భట్టి విక్రమార్క ప్రత్యేకంగా అభినందించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించి, తమ ప్రతిభతో దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఎన్‌డీటీవీ ప్రతినిధులు, తన మిత్రులు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఫహీమ్ ఖురేషి, భాస్కర్ రెడ్డి, ‎ప్రత్యేకంగా ఆహ్వానించారని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు రావడానికి ఐదు నుంచి ఐదున్నర గంటల సమయం పడుతుందని, అయినప్పటికీ ఈ కార్యక్రమ ప్రాధాన్యాన్ని గుర్తించి తన ఇతర కార్యక్రమాలను రద్దు చేసుకుని వచ్చానని చెప్పారు. క్రీడాకారులను ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు. అనంతరం విజేతలకు ట్రోఫిలను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అందజేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని విమానాశ్రయం దగ్గర మరోసారి భారీ శబ్దం...

Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిపోయిన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియకు ఎక్సైజ్ శాఖ...

CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర

CJP Protest: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా...

Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు

ఉత్తరాఖండ్‌లో శనివారం రెండుసార్లు భూకంప ప్రకంపనలు సంభవించాయి. ఉత్తరకాశిలో 4.2, బాగేశ్వర్‌లో...