5
October, 2026

A News 365Times Venture

5
Monday
October, 2026

A News 365Times Venture

Chhattisgarh: బాలీవుడ్‌ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!

Date:

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 9 మంది మహిళా మావోయిస్టులు బాలీవుడ్ సినిమా ఆఫర్ కొట్టేశారు. ఓ వైరల్ వీడియో వారికి సినిమా అవకాశం తెప్పించింది. త్వరలోనే స్క్రీన్‌పై మెరవబోతున్నారు. మావోయిస్టుల హింసాకాండపై ఓ హిందీ చిత్రం రాబోతుంది. అయితే ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో మహిళా మావోయిస్టులు ర్యాంప్‌పై నడిచి జాతీయ వార్తల్లోకి ఎక్కారు. దీంతో వారంతా ప్రాచుర్యం పొందారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. దీంతో వారంతా చిత్ర నిర్మాతల కంట్లో పడ్డారు. దీంతో రియల్ మావోయిస్టులతోనే సినిమా చేయాలని భావించారు. అందులో భాగంగానే మహిళా మావోయిస్టులకు అవకాశం లభించింది.

నివేదికల ప్రకారం.. హిందీ చిత్రం 1994లో అవిభక్త మధ్యప్రదేశ్‌లోని బస్తర్‌లో జరిగిన ఒక వాస్తవమైన, సున్నితమైన సంఘటన ఆధారంగా సినిమా రాబోతుంది. చిత్రనిర్మాతలు ఈ కథను పూర్తిగా వాస్తవికంగా, సజీవంగా ఉంచాలని కోరుకుంటున్నారు. అందుకే నిజ జీవితంలో నక్సలిజం వల్ల తీవ్ర ఇబ్బందులు పడి, ఇప్పుడు తిరిగి ప్రధాన స్రవంతిలోకి వచ్చిన తొమ్మిది మంది మహిళలను ఈ చిత్రంలో చూపించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ సినిమా షూటింగ్‌లో ఎక్కువ భాగం బస్తర్‌లోని దట్టమైన అడవుల్లో, దక్షిణ బస్తర్ ప్రాంతాల్లో జరగనుంది.

వైరల్ వీడియోతో..

నిజానికి సుక్మా జిల్లా పునరావాస కేంద్రంలో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న సుశీల, ఆండే భీమే, కుంజం హిద్మే, మైకం మహిమ, నందిని, దోడి రామే, జోగి వెట్టి, పోడియం రాజేలు రాయ్‌పూర్‌లోని ప్రభుత్వ వేదికపై ఆత్మవిశ్వాసంతో ర్యాంప్‌పై నడిచినప్పుడు, వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను చూసిన తర్వాతే చిత్రనిర్మాతలు ఈ మహిళలను గమనించారు. అలాగున వారికి అవకాశం ఇచ్చారు. ఇక సినిమాలోకి తీసుకునే ముందు వారికి నటనపై అవగాహన కల్పించనున్నారు.

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి కూడా ఈ మార్పు పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. బస్తర్ ప్రాంత ప్రజలలో ప్రతిభకు కొరత లేదని, వారికి కేవలం ఒక వేదిక, సరైన అవకాశాలు మాత్రమే అవసరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రయత్నాల వల్ల బస్తర్‌లో నక్సలిజం నిర్మూలించబడుతోందని, శాంతి పునరుద్ధరించబడటంతో, బస్తర్ ప్రతిభావంతులు ఇప్పుడు దేశం, ప్రపంచం ముందు తమను తాము నిరూపించుకోవడానికి పుష్కలమైన అవకాశాలు పొందుతున్నారని అన్నారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..

India vs Pakistan ఏషియన్ గేమ్స్‌లో 2026 భారత్ మరో బంగారు...

Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లోని శాసనసభ్యుల్లో 50 శాతం మంది యువతేనని మంత్రి...

UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!

UP Election: 2027 ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల వేళ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)-కాంగ్రెస్...

Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!

Flydubai Terror Attack: ఫ్లైదుబాయ్ FZ1073 విమాన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా...