2
October, 2026

A News 365Times Venture

2
Friday
October, 2026

A News 365Times Venture

OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు

Date:

OTR: రాజకీయ ప్రత్యర్థిని గట్టిగా కొడదామని సీఎం రేవంత్‌ రెడ్డి అనుకుంటుంటే…. అక్కడి కాంగ్రెస్‌ నాయకులు మాత్రం తమలో తాము కొట్టుకుంటున్నారా? పైగా బలమైన ప్రత్యర్థి ఉన్నచోట, తాము గెలుపన్నది మర్చిపోయిన నియోజకవర్గాల్లో కలిసి పని చేయాల్సింది పోయి పరస్పరం వెనక్కి లాక్కుంటున్నారా? సీఎం అంతలా ఫోకస్‌ చేసిన ఆ జిల్లా ఏది? అక్కడి రాజకీయ పరిస్థితులు ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన పొలిటికల్‌ హీట్‌ పెంచింది. ఆయన సీఎం అయ్యాక ఎన్నికల ప్రచార సభలు మినహా అధికారిక కార్యక్రమాల కోసం ఇక్కడికి రాలేదు. అయితే… అభివృద్ధి పనుల కోసం జిల్లాలో తొలిసారి అడుగుపెడూతూనే…. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను టార్గెట్‌ చేయడం ఆసక్తి రేపింది.

శత్రువును తన కార్యక్షేత్రానికే పరిమితం చేయాలన్న సూత్రం ప్రకారం… కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లనే లక్ష్యంగా ఎంచుకున్నారు రేవంత్‌. కేటీఆర్ అడ్డాలో మీటింగ్ పెట్టి కాంగ్రెస్‌ కార్యకర్తల్లో జోష్ నింపడంతో పాటు.. రాజకీయాలను వేడెక్కించే ప్రసంగం చేశారు సీఎం. ఓవరాల్‌గా చూస్తే… సిరిసిల్ల సభ పార్టీకి మాంచి ఊపు తెచ్చిందంటూ హ్యాపీగా ఉన్నారట రాష్ట్ర నాయకులు. కానీ… పెద్దలు నింపిన ఉత్సాహంతో కలిసికట్టుగా పనిచేయాల్సిన లోకల్ కాంగ్రెస్‌ నేతలు మాత్రం… తమలో తామే కాళ్లు లాగేసుకునే పనిలో ఉన్నారట. పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నచోట ఈ వర్గపోరు చూసిన వారు వీళ్లు మారరు అని బహిరంగంగానే కామెంట్స్‌ చేస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో గత నాలుగు ఎన్నికల్లో మూడోస్థానానికే పరిమితమైంది హస్తంపార్టీకి. కనీసం రాష్ట్రంలో అధికారంలో ఉన్న సందర్భంలోనైనా పుంజుకోకుండా వర్గపోరుతో చేజేతులా అవకాశాన్ని జారవిడుచుకుంటున్నారని అంటున్నారు పరిశీలకులు.

ప్రధానంగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు పట్టు కోసం కరీంనగర్‌లో రెండు గ్రూపులను ప్రోత్సహిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం పర్యటనలో ఈ గ్రూపు వార్‌ క్లియర్‌గా కనిపించిందని అంటున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ వెలిచాల వర్సెస్.. మిగతా గ్రూపులు అన్నట్టుగా మారింది పరిస్థితి. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన వెలిచాల రాజేందర్‌రావును కరీంనగర్‌ అసెంబ్లీ ఇన్ఛార్జ్‌గా నియమించింది అధిష్టానం. ఆయనకు పదవి వచ్చేంత వరకు సైలెంట్‌గా ఉన్న ఇద్దరు మంత్రులు… తర్వాత తమదైన శైలిలో వెలిచాలను సైడ్ చేసేందుకు పావులు కదిపి శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా కలిసిపోయారనే టాక్ నడుస్తోంది. ఈ పర్యటనలో అదే క్లియర్‌గా కనిపించిందట. సీఎం టూర్‌ ఫ్లెక్సీల్లో ఒకరిపై ఒకరు డామినేషన్ చేసేందుకు లోలోపల చేసిన ప్రయత్నాలు బహిరంగంగా కనిపించాయి. ఇన్ఛార్జ్‌ వెలిచాల వర్గం, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి గ్రూప్, మరో మంత్రి గ్రూపు అన్నట్టుగా ఇలా వర్గాలుగా విడిపోయి కుస్తీలు పట్టకున్నారట.

మరోవైపు కరీంనగర్ నగరం మొత్తం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫ్లెక్సీలే ఎక్కువగా కనిపించడం కూడా చర్చనీయాంశంగా మారింది. దీని వెనక ఓ మంత్రి ఉన్నారనే టాక్ నడుస్తోంది. ఓ వైపు వెలిచాలకు… మరోవైపు ఇంకో మంత్రికి చెక్ పెట్టేందుకు తన అనుచరులతో పాటు మంత్రి అడ్లూరిని కూడా రంగంలోకి దింపి సదరు కీలక మంత్రి తనదైన మార్క్ వేశారట. దీంతో సీఎం పర్యటన సాక్షిగా ముగ్గురు లీడర్లు నాలుగు గ్రూపులు అన్నట్టుగా మారిందట కరీంనగర్ కాంగ్రెస్ పరిస్థితి. కరీంనగర్ పరిస్థితి ఇలా ఉంటే… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ టాస్క్‌గా ఫోకస్ చేసిన సిరిసిల్ల జిల్లాలోనూ ఇదే వాతావరణం కనిపిస్తోంది. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇంఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి వర్గాల మధ్య పొసగడం లేదట. ఒకరికొకరికి పడకుండా ఫైట్ చేస్తుంటే… మధ్యమధ్యలో మరో మంత్రి రావడంపైనా ఈ ముగ్గురు నేతల్లో బయటకు కనిపించని అంతర్గత అసహనం వ్యక్తమవుతున్నట్టు సమాచారం. బలమైన ప్రత్యర్థి కేటీఆర్‌ను ఢీకొట్టాలంటే అందరూ కలిసి ఉండాల్సిన తరుణంలో గ్రూప్ వార్ హస్తం పార్టీకి తలనొప్పిగా మారిందట… కొత్త లీడర్‌ కావాలి, పాత లీడర్లు సరిపోరని చెబుతున్న క్రమంలో… ఆ స్థాయి లీడర్‌ను అందరూ కలిసి ప్రొజెక్ట్‌ చేయాల్సింది పోయి… గ్రూప్‌ వార్‌కి దిగడం కార్యకర్తలకు రుచించడం లేదంటున్నారు. జిల్లా అధ్యక్షుడు, బలమైన సామాజిక వర్గానికి చెందిన సంగీతం శ్రీనివాస్ ఫోటోను ప్లెక్సీల్లో వేయకపోవడం కలకలం రేపింది. బీసీ లీడర్‌ అధ్యక్షుడు అయితే ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అటు సీఎం ప్రసంగిస్తున్నంత సేపూ ముగ్గురు నేతలు ఆయన పక్కనే నిలబడినప్పటికీ… ఎడమొహం పెడమొహంగానే కనిపించారు. సంగీతం శ్రీనివాస్‌ పై అడుగుడుగునా డామినేషన్ చేసేందుకు కేకే మహేందర్‌రెడ్డి ప్రయత్నం చేశారని సభకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.మరోవైపు జెండా పండుగ రోజున కరీంనగర్ పెరేడ్ గ్రౌండ్ లో తనకు జెండా ఆవిష్కరించే అవకాశం రాకపోవడంతో గుర్రుగా ఉన్న ఓ మంత్రి… సందట్లో సడేమియా అన్నట్టు ఓవైపు కరీంనగర్ లోనూ… మరోవైపు, సిరిసిల్లలోనూ హడావిడి చేస్తున్నారట. అయితే, ఆ మంత్రి గారు సిరిసిల్ల పర్యటనకు వెళ్లి… కరీంనగర్‌లో అడుగుపెట్టే లోపే… కరీంనగర్ మొత్తం మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫ్లెక్సీలతో నిండిపోవడం… ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయాల్ని చెప్పకనే చెబుతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. మొత్తానికి ప్రత్యర్ధితో ఫైట్ చేసేందుకు సీఎం రేవంత్ వస్తే… ఇక్కడి హస్తం పార్టీ నేతలు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించడం… మంత్రులు సైతం ఈ గ్రూప్‌ వార్‌కు ఆజ్యం పోయడం ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పొలిటికల్‌ హాట్‌ అయింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..

Maharashtra Tragedy: మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని దివేగర్ బీచ్‌లో తీవ్ర విషాదం...

OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్‌లో ఉన్నారా?

OTR: ఆంధ్రప్రదేశ్‌లో మెజార్టీ కూటమి ఎమ్మెల్యేలు డేంజర్‌ జోన్‌లో ఉన్నారా? నియోజకవర్గాల్లో...

Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..

Mamata Banerjee:  2029 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రధాని...

Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!

Modi-Trump: ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య టెలిఫోన్...