27
September, 2026

A News 365Times Venture

27
Sunday
September, 2026

A News 365Times Venture

Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు

Date:

Gyanesh Kumar:  ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై మరో వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూ, ఆయన రాజీనామాను కోరుతున్నాయి. ఇదిలా ఉంటే, 2019లో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేయాలని తనకు జ్ఞానేష్ కుమార్ సూచించారని మాజీ కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిజి థామ్సన్ ఆరోపించారు. 2016లో ఢిల్లీ విమాన ప్రమాణ సమయంలో తనకు ఈ ప్రతిపాదన వచ్చిందని, అయితే తాను ఈ ప్రతిపాదనను తిరస్కరించానని థామ్సన్ చెప్పారు.

జ్ఞానేష్ కుమార్ తనకు స్నేహితుడని చెప్పిన థామ్సన్.. రిటైర్ అయిన తర్వాత తన భవిష్యత్ ప్రణాళిక గురించి అడిగారని, అందుకు తాను పిల్లల కోసం ఒక ప్రాజెక్ట్‌పై పనిచేయాలని భావిస్తున్నట్లు చెప్పానని వెల్లడించారు. అయితే, జ్ఞానేష్ కుమార్ మాత్రం పథనంతిట్ట నుంచి బీజేపీ తరఫున లోక్‌సభకు పోటీ చేసి ఎంపీగా, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా ఎదగవచ్చని సూచించినట్లు థామ్సన్ పేర్కొన్నారు. వెంటనే తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు చెప్పారు.

ఈ ఘటన జరిగిన సమయంలో జ్ఞానేష్ కుమార్ ప్రభుత్వ సర్వీసులోనే ఉన్నారు. థామ్సన్ 1988 బ్యాచ్ కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి. 2024 జనవరిలో సర్వీస్ నుంచి రిటైరయ్యారు. థామ్సన్ ప్రస్తుతం వ్యాఖ్యలు ప్రస్తుతం ఎన్నికల సంఘంపై రాజకీయ వివాదం నెలకొన్న తరుణంలో వచ్చాయి. ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన నిర్ణయాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు నివేదిక వచ్చిన నేపథ్యంలో, జ్ఞానేష్ కుమార్‌పై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి.

థామ్సన్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. జ్ఞానేష్ కుమార్ అప్పట్లో బీజేపీకి అభ్యర్థులను రిక్రూట్ చేయడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా పోస్టులో.. ‘‘అప్పటి ఐఏఎస్ అధికారి జ్ఞానేష్ కుమార్‌ను బీజేపీ కోసం నియామకాలకు ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత మోడీ, షా అతడిని ఎంపైర్‌గా చేసి, భారత ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు బాధ్యుడిగా నియమించారు’’ అని ఆరోపించారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

ECI SIR Meeting: ఎన్నికల సంఘం కీలక భేటీ.. SIR గడువులపై కీలక నిర్ణయాలు

ECI SIR Meeting: కేంద్రం ఎన్నికల సంఘం కీలక సమావేశం శనివారం...

High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కుటుంబ వ్యవస్థను కాపాడటానికి గృహానికి భర్త కూడా అవసరమేనని.. మహిళలు మాత్రమే...

Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం...