26
September, 2026

A News 365Times Venture

26
Saturday
September, 2026

A News 365Times Venture

Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు

Date:

అమెరికాలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పర్యటన కొనసాగుతోంది. ట్రంప్ దంపతులు దగ్గరుండి మరీ మర్యాదలు చేస్తున్నారు. మునుపెన్నడూ లేనంతగా జిన్‌పింగ్‌కు గౌరవం ఇస్తున్నారు. వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు ప్రత్యేక విందు ఇచ్చారు. అంతేకాకుండా పలు పరిసరాలు కూడా చూపించారు.

ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య జరిగిన భేటీలో ఇరాన్ అంశం కీలకంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇరాన్‌కు చైనా నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సాయం అందినా అది తమకు “పూర్తిగా ఆమోదయోగ్యం కాదు” అని ట్రంప్ స్పష్టం చేసినట్లు అమెరికా రాయబారి డేవిడ్ పెర్డ్యూ తెలిపారు. వైట్‌హౌస్‌లో ట్రంప్-జిన్‌పింగ్ సమావేశంలో ఈ అంశాన్ని మరోసారి స్పష్టంగా చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

చైనాకు కొన్ని వారాల క్రితమే అమెరికా ఈ విషయాన్ని స్పష్టం చేసిందని పెర్డ్యూ చెప్పారు. ఇరాన్‌కు చైనా నేరుగా లేదా పరోక్షంగా సహాయం చేయడం, అది ఇంటెలిజెన్స్ సమాచారం కావచ్చు, విడిభాగాలు కావచ్చు లేదా సైనిక పరికరాలు కావచ్చు.. ఏ రూపంలో ఉన్నా అమెరికాకు ఆమోదయోగ్యం కాదని ట్రంప్ మరోసారి జిన్‌పింగ్‌కు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. చైనా నుంచి ఇరాన్‌కు పరోక్ష సహాయం అందుతున్నదనే విషయంలో అమెరికా ఆందోళన కొనసాగుతోందని పెర్డ్యూ తెలిపారు. అయితే హార్ముజ్ జలసంధిని మూసి ఉంచడంలో చైనా నేరుగా ఇరాన్‌కు సహాయం చేసిందని నిర్ధారించే ప్రత్యక్ష ఆధారాలు తమ దగ్గర లేవని కూడా పేర్కొన్నారు.

ట్రంప్, జిన్‌పింగ్ ఇద్దరూ ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదనే అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు పెర్డ్యూ చెప్పారు. అలాగే హార్ముజ్ జలసంధిని తెరవడం, అక్కడ ఎలాంటి టోల్ వసూలు చేయడానికి ఎవరికీ అవకాశం ఉండకూడదనే అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలిపారు. ఇరాన్‌తో అమెరికా చర్చలు కొనసాగుతాయని.. ఈ విషయంలో ప్రైవేట్‌గా సంప్రదింపులు జరుగుతున్నాయని పెర్డ్యూ చెప్పారు. చర్చల ప్రక్రియలో కొంత పురోగతి కనిపిస్తోందని పేర్కొన్నారు.

గత నెల రోజులుగా ట్రంప్ దృష్టిలో ఇరాన్ అంశం ప్రధానంగా ఉందని పెర్డ్యూ తెలిపారు. ఇరాన్ విషయంలో అమెరికా ప్రయోజనాలు స్పష్టంగా ఉన్నాయని, ఈ అంశానికి తైవాన్ వంటి ఇతర అమెరికా-చైనా సమస్యలతో సంబంధం లేదని పేర్కొన్నారు అయితే చైనా నుంచి ఇరాన్‌కు అందుతున్నట్లు అమెరికా చెబుతున్న “పరోక్ష సహాయం” విషయంలో వాషింగ్టన్ ఆందోళన మాత్రం కొనసాగుతోందని పెర్డ్యూ స్పష్టం చేశారు.

చైనా సాయం చేస్తోందా?

ఇరాన్‌కు చైనా నుంచి సాయం అందుతోందన్న అంశంపై ఇటీవల పలు అంతర్జాతీయ నివేదికలు వెలువడ్డాయి. అమెరికా అధికారులు, ది వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టుల ప్రకారం.. చైనా సంస్థల నుంచి ఇరాన్‌కు డ్యూయల్-యూజ్ సాంకేతిక పరికరాలు, ఎలక్ట్రానిక్స్, GPS పరికరాలు, ఎలక్ట్రిక్ మోటార్లు వంటి సామగ్రి చేరినట్లు ఇరాన్ కస్టమ్స్ డేటా సూచిస్తోంది. వీటిలో కొన్ని డ్రోన్లు, క్షిపణి గైడెన్స్ వ్యవస్థల్లో ఉపయోగించే అవకాశం ఉందని రిపోర్టులు పేర్కొన్నాయి.

అలాగే, ఇరాన్‌కు చైనా సంస్థలు అందించిన హై-రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలు జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై జరిగిన క్షిపణి దాడికి ముందు ఉపయోగించబడ్డాయని అమెరికా అధికారులు వాల్ స్ట్రీట్ జర్నల్‌కు తెలిపినట్లు నివేదికలు వచ్చాయి. అయితే, ఈ వ్యవహారంలో చైనా ప్రభుత్వం నేరుగా పాల్గొన్నట్లు అమెరికా ఆరోపించలేదని ఆ రిపోర్టులు పేర్కొన్నాయి.

ట్రంప్-జిన్‌పింగ్ భేటీలో వాణిజ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తైవాన్ వంటి అంశాలతో పాటు ఇరాన్, హార్ముజ్ జలసంధి కూడా కీలకంగా మారాయి. ప్రస్తుతం హార్ముజ్‌ను తిరిగి తెరవడంపై అమెరికా-ఇరాన్ మధ్య దశలవారీ ఒప్పందంపై చర్చలు జరుగుతున్నట్లు రాయిటర్స్ నివేదించింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు చైనా నుంచి ఎలాంటి సైనిక, సాంకేతిక లేదా ఇంటెలిజెన్స్ సహాయం అందకుండా చూడాలని అమెరికా ఒత్తిడి పెంచుతున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. అయితే చైనా ప్రభుత్వం నేరుగా ఇరాన్‌కు సైనిక సహాయం అందిస్తోందనే ఆరోపణలపై బీజింగ్ వైఖరి, అలాగే సహాయం స్వరూపంపై పూర్తి వివరాలు వేర్వేరు నివేదికల్లో భిన్నంగా ఉన్నాయి.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో కొత్తగా ‘NPS స్వాస్థ్య’ పేరుతో ఓ...

OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?

OTR:  పార్టీ పవర్‌లో లేకపోతే మాకేంటి? అధిష్టానం నిరసన కార్యక్రమాలు పిలుపునిస్తే...

PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని

ఢిల్లీలో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోడీ యువతతో కలిసి...

Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు

Minister Satyakumar Yadav: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది.....