15
September, 2026

A News 365Times Venture

15
Tuesday
September, 2026

A News 365Times Venture

Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..

Date:

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది భారత ప్రభుత్వ మద్దతుతో నడిచే అత్యంత సురక్షితమైన, దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. ఇందులో పెట్టే డబ్బు పూర్తిగా సురక్షితం మాత్రమే కాదు, ఆకర్షణీయమైన వడ్డీ రేటును కూడా అందిస్తుంది. పాత పన్ను విధానాన్ని ఎంచుకునేవారికి సెక్షన్ 80C కింద ప్రతి ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయ పౌరుడు బ్యాంకు లేదా పోస్టాఫీసులో సులభంగా ఖాతా తెరవచ్చు. మైనర్ పిల్లల పేరు మీద కూడా తల్లిదండ్రులు ఖాతా నిర్వహించవచ్చు.

ఈ పథకంలో లాకింగ్ కాలం 15 సంవత్సరాలు. మెచ్యూరిటీ తర్వాత 5-5 సంవత్సరాల చొప్పున దీన్ని ఎన్నిసార్లయినా పొడిగించుకునే వెసులుబాటు ఉంటుంది. నెలవారీగా లేదా ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 12 విడతలుగా లేదంటే ఒకేసారి మొత్తం డబ్బు జమ చేయవచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై 7.1 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది.

ఉదాహరణకు.. మీ పాప లేదు బాబు పేరు మీద 18 ఏళ్ల వయసులో పీపీఎఫ్ ఖాతా ప్రారంభించి, ప్రతీఏటా గరిష్టంగా రూ.1.5 లక్షలు పెట్టుబడి పెడితే, 15 ఏళ్ల మెచ్యూరిటీ నాటికి 7.1 శాతం వడ్డీ లెక్కన దాదాపు రూ.55.14 లక్షల ఫండ్ తయారవుతుంది. ఒకవేళ ఈ పెట్టుబడిని 42 ఏళ్ల వయసు వరకు కొనసాగిస్తే, మొత్తం రూ.75 లక్షల అసలు పెట్టుబడిపై సుమారు రూ.6.75 కోట్ల భారీ కోటీశ్వరుల ఫండ్ రూపొందుతుంది.

ఒకవేళ సాధారణంగా ప్రతీఏటా రూ.1 లక్ష చొప్పున 18 ఏళ్లు పెట్టుబడి పెడితే రూ.36.76 లక్షలు రాగా, 42 ఏళ్ల వరకు కొనసాగిస్తే రూ.50 లక్షల అసలు పెట్టుబడితో రూ.4.50 కోట్ల ఫండ్ ఏర్పడుతుంది. అలాగే ఏడాదికి రూ.50 వేలు 18 ఏళ్లు జమ చేస్తే రూ.18.38 లక్షలు, 42 ఏళ్లు అయితే రూ.25 లక్షల పెట్టుబడితో రూ.2.25 కోట్ల ఫండ్ సమకూడుతుంది. అత్యవసర సమయాల్లో పాక్షిక ఉపసంహరణ లేదా లోన్ తీసుకునే సౌకర్యం కూడా ఇందులో ఉంది. భవిష్యత్తు అవసరాలకు, రిటైర్మెంట్ లేదా పిల్లల ఉన్నత చదువులకు ఇది బెస్ట్ ఆప్షన్.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Smart Phone Prices: ఇకపై స్మార్ట్‌ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్‌టీ..?

భారతదేశంలో పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ ధరలు సామాన్య ప్రజలతో పాటు మొబైల్ తయారీ...

Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన

గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ను ఓ కారు డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి పారిపోయాడు....

Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు

Oracle layoffs: టెక్‌ సంస్థల్లో ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ ఆగడం లేదు.....

India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..

India-China Ties: భారత్-చైనా సంబంధాలపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత...