9
September, 2026

A News 365Times Venture

9
Wednesday
September, 2026

A News 365Times Venture

Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!

Date:

Realme 16 Pro 5G Harry Potter Edition Launched: రియల్‌మీ (Realme) నుండి మరో ఆసక్తికరమైన స్పెషల్ ఎడిషన్ ఫోన్‌ లాంచ్ అయ్యింది. Warner Bros.తో భాగస్వామ్యం చేసుకున్న కంపెనీ.. రియల్‌మీ 16 ప్రో 5G హ్యారీ పాటర్ ఎడిషన్ (Realme 16 Pro 5G Harry Potter Edition)ను తీసుక వచ్చింది. హ్యారీ పోటర్ థీమ్‌తో ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఫోన్‌తో పాటు బాక్స్, యాక్సెసరీస్‌లోనూ ప్రత్యేక డిజైన్‌ను అందించనుంది. హ్యారీ పోటర్ అభిమానులను ఆకట్టుకునేలా ఈ ఎడిషన్‌ను రూపొందించారు.

Realme 16 Pro 5G సిరీస్‌ను కంపెనీ 2026 ప్రారంభంలో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు Warner Bros. భాగస్వామ్యంతో అదే సిరీస్‌లో హ్యారీ పోటర్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. త్వరలో హ్యారీ పోటర్ ఆధారంగా కొత్త టీవీ సిరీస్ కూడా రానున్న నేపథ్యంలో ఈ భాగస్వామ్యం మరింత ఆసక్తిని పెంచుతోంది. రియల్‌మీ గతంలో కూడా ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్రాంచైజీలతో కలిసి ప్రత్యేక ఎడిషన్ ఫోన్లను విడుదల చేసింది.

Realme 16 Pro 5G స్పెసిఫికేషన్లు:

ఇందులో 6.78 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. ఇది 1400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు హై రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ పనితీరు కోసం 4nm ప్రాసెస్‌పై తయారైన MediaTek Dimensity 7300 Max చిప్‌సెట్‌ను ఉపయోగించారు. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఫోన్‌కు IP66, IP68, IP69, IP69K రేటింగ్‌లు ఉన్నాయి. దీంతో వివిధ రకాల నీటి చిమ్ముర్లు, దుమ్ము నుంచి మెరుగైన రక్షణ లభించనుంది.

కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో 200MP మెయిన్ కెమెరాతో పాటు 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50MP కెమెరాను అందించారు. బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో 7,000mAh భారీ బ్యాటరీను ఇందులో ఇచ్చారు. దీనికి 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీంతో ఎక్కువసేపు ఫోన్‌ను ఉపయోగించడంతో పాటు తక్కువ సమయంలోనే బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు.

హ్యారీ పోటర్ ఫ్యాన్స్‌కు స్పెషల్ డిజైన్..

హ్యారీ పోటర్ ఎడిషన్లో సాధారణ Realme 16 Pro 5Gతో పోలిస్తే డిజైన్, ప్యాకేజింగ్, యాక్సెసరీస్‌లో ప్రత్యేక మార్పులు ఉండనున్నాయి. హోగ్వార్ట్స్ థీమ్, హ్యారీ పోటర్ బ్రాండింగ్‌తో ఈ స్పెషల్ ఎడిషన్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. అయితే పూర్తి బాక్స్ కంటెంట్, ప్రత్యేక యాక్సెసరీస్ వివరాలను ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ ఎడిషన్ ధర, విక్రయ తేదీ వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఈ ఫోన్‌ను ఫ్లిప్కార్ట్ ద్వారా టీజ్ చేయడంతో త్వరలోనే అక్కడ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ధర, సేల్ తేదీ, బాక్స్‌లో లభించే ప్రత్యేక యాక్సెసరీస్ వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ

భారత్‌ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ తదుపరి దశకు సిద్ధంగా ఉందని ప్రధాని...

Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!

ఇజ్రాయెల్‌ సెటిల్మెంట్‌ విధానంపై అంతర్జాతీయ విమర్శలు పెరుగుతున్న వేళ.. బ్రిటన్, ఫ్రాన్స్,...

Free Coaching: ఫీజు సున్నా.. ఉద్యోగం పక్కా! నిరుద్యోగులకు APCRDA శుభవార్త..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో...

Israeli-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి

దక్షిణ లెబనాన్‌పై మరోసారి బాంబ్ దాడులు దద్దరిల్లాయి. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక...