24
August, 2026

A News 365Times Venture

24
Monday
August, 2026

A News 365Times Venture

AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ వైరల్‌.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం

Date:

AP Local Body Election: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కసరత్తు సాగుతోంది.. అయితే, ఎన్నికల షెడ్యూల్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. అయితే, వైరల్ అవుతున్న వార్తలపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన సమాచారం ఫేక్ అని ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని SEC సూచించారు. అధికారికంగా ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకముందే షెడ్యూల్ పేరుతో ప్రచారం చేస్తున్న సమాచారాన్ని నమ్మడం లేదా ఇతరులకు షేర్ చేయడం చేయవద్దని హెచ్చరించారు.

అలాగే, ఎన్నికల సంఘం అధికారిక అనుమతి లేకుండా దాని పేరు, లోగోను ఉపయోగించడం చట్టరీత్యా నేరమని అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు. ఎన్నికల సంఘం పేరును, అధికారిక లోగోను దుర్వినియోగం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు.. అయితే, తప్పుడు సమాచారం, అసత్య వార్తలను సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని SEC హెచ్చరించారు. అలాంటి వ్యక్తులపై సైబర్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని ప్రజలు అప్రమత్తంగా పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికలకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం ఎన్నికల సంఘం అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. “అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు.. షేర్ చేయవద్దు. తప్పుడు సమాచారం ప్రచారం చేసేవారిపై సైబర్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.” అని ప్రకటించారు SEC అనిల్‌చంద్ర పునేఠా..

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!

Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్‌పై భారత్ ‘‘ఆపరేషన్...

Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!

Bangladesh: వస్తే ఓ బాధ, రాకుంటే ఓ బాధ అన్నట్లు తయారైంది...

CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు

కాక్రోచ్ జనతా పార్టీ మరో ఉద్యమానికి సిద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీలో...

Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో సహరాన్‌పూర్ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్...