13
August, 2026

A News 365Times Venture

13
Thursday
August, 2026

A News 365Times Venture

NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.99తోనే పెన్షన్‌ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..

Date:

NPS Pension Scheme: కేంద్ర ప్రభుత్వం మరో కొత్త స్కీమ్‌ తీసుకొచ్చింది.. గిగ్ వర్కర్ల భవిష్యత్‌ ఆర్థిక భద్రతను దృష్టిలో పెట్టుకుని జాతీయ పింఛను వ్యవస్థ (NPS) కింద కొత్త పింఛను పథకాన్ని ప్రవేశపెట్టారు. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (PFRDA) ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్‌ వంటి డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌లతో పనిచేసే గిగ్‌ వర్కర్లు చిన్న మొత్తాలతోనే పదవీ విరమణ కోసం పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది.

రూ.99తోనే పెట్టుబడి ప్రారంభం
ఈ పథకంలో గిగ్‌ వర్కర్లు కేవలం రూ.99తోనే పెట్టుబడి ప్రారంభించవచ్చు. పెట్టుబడికి కనీస లేదా గరిష్ట పరిమితి లేదని పేర్కొంది. తమ ఆదాయం, ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా కార్మికులు ఎప్పుడైనా తమ పెట్టుబడిని కొనసాగించవచ్చు లేదా మొత్తాన్ని పెంచుకోవచ్చు. ఈ పథకంలో ప్రత్యేకంగా పదవీ విరమణ వయోపరిమితి లేకపోవడం మరో ప్రయోజనం. గిగ్‌ వర్కర్లు తమకు నచ్చినంత కాలం పనిచేస్తూ పథకానికి విరాళాలు చెల్లించవచ్చు. దీర్ఘకాలంలో ఈ పెట్టుబడి ద్వారా పదవీ విరమణ అనంతరం పెన్షన్‌ పొందే అవకాశం ఉంటుంది.

ఎవరెవరు అర్హులు?
డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పనిచేసే వివిధ రకాల గిగ్‌ వర్కర్లు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్‌ డెలివరీ భాగస్వాములు, బ్లింకిట్‌, జెప్టో, ఇన్‌స్టామార్ట్‌ వంటి క్విక్‌ కామర్స్‌ డెలివరీ వర్కర్లు అర్హులుగా ఉంటారు. అలాగే ఓలా, ఉబర్‌, ర్యాపిడో వంటి రైడ్‌-హెయిలింగ్‌ సంస్థల డ్రైవర్లు, అర్బన్‌ కంపెనీ వంటి గృహ సేవల ప్లాట్‌ఫారమ్‌లతో పనిచేసే భాగస్వాములు, ఇతర డిజిటల్‌ సేవా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పనిచేసే గిగ్‌ వర్కర్లు కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు.

NPS ఖాతా ఎలా తెరవాలి?
ఈ పథకం ప్రయోజనం పొందాలంటే గిగ్‌ వర్కర్లు NPSలో సంబంధిత పింఛను పథకం కింద ఖాతా తెరవాలి. ప్రాథమిక KYC కోసం పేరు, చిరునామా, PAN, మొబైల్‌ నంబర్‌, బ్యాంక్‌ ఖాతా వివరాలను నమోదు చేయాలి. ఆధార్‌ ద్వారా ధృవీకరణ పూర్తవుతుంది. కార్మికుడి సమ్మతితో PRAN (Permanent Retirement Account Number) తక్షణమే జారీ చేయబడుతుంది. ఖాతా ప్రారంభించిన 60 రోజుల్లోపు తల్లిదండ్రుల వివరాలు, నామినీ వివరాలను కూడా జోడించుకునే అవకాశం ఉంటుంది.

కంపెనీ మారినా ఖాతా కొనసాగుతుంది
ఈ పథకంలోని మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. గిగ్‌ వర్కర్‌ పనిచేసే కంపెనీ లేదా ప్లాట్‌ఫారమ్‌ మారినా NPS ఖాతా మూసివేయాల్సిన అవసరం ఉండదు. కొత్త అగ్రిగేటర్‌ లేదా ప్లాట్‌ఫారమ్‌తో అదే ఖాతాను అనుసంధానించుకోవచ్చు. దీంతో ఉద్యోగం లేదా ప్లాట్‌ఫారమ్‌ మారిన ప్రతిసారీ కొత్తగా పెన్షన్‌ ఖాతా ప్రారంభించాల్సిన అవసరం ఉండదు.

60 ఏళ్ల తర్వాత పెన్షన్‌ ఎలా వస్తుంది?
ఈ పథకంలో పెట్టుబడులను మార్కెట్‌ ఆధారిత సాధనాలతో పాటు ప్రభుత్వ సెక్యూరిటీల్లో కూడా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో పెట్టుబడుల ద్వారా రిటైర్మెంట్‌ నిధిని సమకూర్చుకోవచ్చు. 60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత, ఖాతాదారుడు నిబంధనల ప్రకారం ఒకేసారి కొంత మొత్తాన్ని పొందవచ్చు. మిగిలిన నిధులతో యాన్యుటీని కొనుగోలు చేసి నెలవారీ పెన్షన్‌ పొందే అవకాశం ఉంటుంది. అయితే నెలకు లభించే పెన్షన్‌ మొత్తం ఎంత అనేది పెట్టుబడి చేసిన మొత్తం, పెట్టుబడి కాలం, యాన్యుటీ ఎంపిక వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Jharkhand JPSC Protest: రాంచీలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల పోరు.. 600 మంది విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్..

Jharkhand JPSC Protest: జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉద్యోగార్థుల నిరసనలు, విద్యార్థుల...

Pocharam Srinivas Reddy: “అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా”.. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్

Pocharam Srinivas Reddy: ఇటీవల తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి రాజకీయం...

N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?

N Chandrasekaran: టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కీలక నిర్ణయం...