10
August, 2026

A News 365Times Venture

10
Monday
August, 2026

A News 365Times Venture

IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!

Date:

IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణం అన్నా.. రాముడు అన్నా.. భారతీయులకు ఓ ఎమోషన్‌.. రామాయణం.. శ్రీలంకతో ముడిపడిఉన్న విషయం విదితమే.. అయితే, శ్రీలంకలోని రామాయణంతో ముడిపడిన పుణ్యక్షేత్రాలను సందర్శించాలని భావిస్తున్న వారికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక అంతర్జాతీయ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. 5 రాత్రులు, 6 రోజుల పాటు సాగే ఈ ‘శ్రీలంక రామాయణ యాత్ర’లో రామాయణంతో ముడిపడిన ప్రముఖ ఆలయాలతో పాటు క్యాండీ, నువారా ఎలియా, కొలంబో వంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది.

సెప్టెంబర్ 24న బెంగళూరు నుంచి యాత్ర ప్రారంభం

IRCTC అందిస్తున్న ఈ శ్రీలంక రామాయణ యాత్ర 2026 సెప్టెంబర్ 24న బెంగళూరు నుంచి ప్రారంభమవుతుంది. మొత్తం 5 రాత్రులు, 6 రోజుల పాటు పర్యటన కొనసాగుతుంది. ఈ ప్యాకేజీలో పరిమితంగా 15 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. ముగ్గురు వ్యక్తులు ఒక గదిని పంచుకునే విధానంలో ఒక్కొక్కరికి రూ.59,950 నుంచి ప్యాకేజీ ధర ప్రారంభమవుతుంది.

గది షేరింగ్ ఆధారంగా ప్యాకేజీ ధరల్లో మార్పు ఉంటుంది. ఒక వ్యక్తి ఒంటరిగా ప్రయాణిస్తే ఒక్కొక్కరికి రూ.81,100, ఇద్దరు వ్యక్తులు ఒక గదిని పంచుకుంటే ఒక్కొక్కరికి రూ.60,500, ముగ్గురు వ్యక్తులు ఒక గదిని పంచుకుంటే ఒక్కొక్కరికి రూ.59,950 చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు అదనపు బెడ్‌తో రూ.46,000, బెడ్ లేకుండా రూ.41,700గా ధర నిర్ణయించారు. ఇక, రెండేళ్లలోపు చిన్నారులకు వర్తించే శిశు రుసుము అదనంగా ఉంటుంది. ఆ మొత్తాన్ని బుకింగ్ సమయంలో IRCTC కార్యాలయంలో చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకేజీ ధరలో 2 శాతం TCS కూడా చేర్చినట్లు పేర్కొన్నారు. సీట్లు పరిమితంగా ఉన్నందున ముందుగానే బుకింగ్ చేసుకోవాలని IRCTC సూచిస్తోంది.

ఆరు రోజుల్లో ఎక్కడెక్కడికి వెళ్తారు?
మొదటి రోజు: సెప్టెంబర్ 24న బెంగళూరు నుంచి కొలంబోకు విమాన ప్రయాణంతో యాత్ర ప్రారంభమవుతుంది. కొలంబో చేరుకున్న తర్వాత దంబుల్లాకు బయలుదేరుతారు. మార్గమధ్యంలో మునేశ్వరం, మునావరం ఆలయాలను సందర్శిస్తారు.

రెండో రోజు: దంబుల్లా గుహాలయం, తిరుకోణేశ్వరం ఆలయం, శ్రీ లక్ష్మీ నారాయణ పెరుమాళ్ ఆలయాలను సందర్శిస్తారు. ఈ రోజున సిగిరియా, ట్రింకోమలీ ప్రాంతాలను కూడా కవర్ చేస్తారు.

మూడో రోజు: దంబుల్లా నుంచి క్యాండీకి ప్రయాణిస్తారు. అక్కడ రత్నాల ఫ్యాక్టరీతో పాటు ప్రసిద్ధ దంతాల ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది.

నాలుగో రోజు: క్యాండీ నుంచి నువారా ఎలియాకు ప్రయాణం ఉంటుంది. ఈ సందర్భంగా రంబోడాలోని శ్రీ భక్త హనుమాన్ దేవాలయం, సీతా అమ్మన్ దేవాలయం, అశోక వాటిక వంటి రామాయణంతో ముడిపడిన ప్రదేశాలను సందర్శిస్తారు. IRCTC శ్రీలంక రామాయణ యాత్రలో సీతా అమ్మన్ ఆలయం, హనుమాన్ ఆలయం, నువారా ఎలియా వంటి ప్రదేశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.

ఐదో రోజు: నువారా ఎలియా నుంచి కొలంబోకు ప్రయాణిస్తారు. మార్గమధ్యంలో పిన్నవాల ఏనుగుల అనాథాశ్రమాన్ని సందర్శిస్తారు. అనంతరం కెళనియా బుద్ధ దేవాలయం, పంచముఖ ఆంజనేయర్ దేవాలయంతో పాటు కొలంబో నగర సందర్శన ఉంటుంది.

ఆరో రోజు: పర్యటన చివరి రోజున కొలంబోలో ప్రయాణికులకు షాపింగ్ కోసం కొంత ఖాళీ సమయం ఉంటుంది. అనంతరం విమానాశ్రయానికి చేరుకుని బెంగళూరుకు తిరుగు ప్రయాణం చేస్తారు.

విమాన ప్రయాణ వివరాలు
* ఈ ప్యాకేజీలో ఎకానమీ క్లాస్ విమాన ప్రయాణం ఉంటుంది. ఇచ్చిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 24న శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానం UL-1174 ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 11:30 గంటలకు కొలంబో చేరుకుంటుంది.
* తిరుగు ప్రయాణంలో UL-173 విమానం సెప్టెంబర్ 30న తెల్లవారుజామున 12:35 గంటలకు కొలంబో నుంచి బయలుదేరి ఉదయం 2 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది.

ప్యాకేజీలో ఏం ఉన్నాయి?
IRCTC ప్యాకేజీలో 5 రాత్రుల హోటల్ బస, ఎకానమీ క్లాస్ విమాన ప్రయాణం, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, ఏసీ వాహనంలో స్థానిక ప్రయాణం, షెడ్యూల్ ప్రకారం సందర్శనీయ ప్రాంతాల పర్యటన, ప్రవేశ టికెట్లు, టూర్ గైడ్, విదేశీ ప్రయాణ బీమా, జీఎస్టీ, 2 శాతం TCS వంటి సౌకర్యాలు ఉంటాయి. IRCTC అధికారిక వివరాల్లో కూడా శ్రీలంక రామాయణ యాత్ర ప్యాకేజీల్లో వసతి, భోజనం, రవాణా, సైట్‌సీయింగ్, గైడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు ఉన్నట్లు పేర్కొంది. అయితే విమానంలో భోజనం, షెడ్యూల్‌లో లేని అదనపు సందర్శన స్థలాలు, కెమెరా ఫీజులు, బోటింగ్, టిప్స్, టెలిఫోన్ ఛార్జీలు, పోర్టర్ సేవలు, లాండ్రీ, మినరల్ వాటర్, ఇతర వ్యక్తిగత ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. ప్యాకేజీలో పేర్కొనని సేవలు సాధారణంగా అదనపు ఖర్చుగా ఉంటాయని IRCTC కూడా స్పష్టం చేస్తోంది.

పాస్‌పోర్ట్ విషయంలో జాగ్రత్త
శ్రీలంక అంతర్జాతీయ పర్యటన కావడంతో ప్రయాణికులు తమ ఒరిజినల్ పాస్‌పోర్ట్‌ను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. భారతదేశానికి తిరిగి వచ్చే తేదీ నుంచి కనీసం ఆరు నెలల చెల్లుబాటు ఉండే పాస్‌పోర్ట్ కలిగి ఉండాలని సూచించారు. అలాగే విమానం బయలుదేరే సమయానికి కనీసం మూడు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని ప్రయాణికులకు సూచించారు.

రామాయణంతో ముడిపడిన ప్రముఖ ఆలయాలు, పుణ్యక్షేత్రాలతో పాటు శ్రీలంకలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను ఒకే ప్యాకేజీలో చూడాలనుకునే వారికి ఈ యాత్ర ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. అయితే ధరలు, సీట్ల లభ్యత, విమాన షెడ్యూల్, ప్యాకేజీ నిబంధనలు మారే అవకాశం ఉన్నందున బుకింగ్‌కు ముందు IRCTC అధికారిక ప్యాకేజీ వివరాలను పరిశీలించడం మంచిది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

India vs Sri Lanka: ఒకప్పుడు భారత్‌కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్‌..!

India vs Sri Lanka: ఒకప్పుడు టీమిండియాను ప్రపంచ ఛాంపియన్లుగా నిలిపిన...

Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు

Minister TG Bharat: కర్నూలులో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్య ఘటనపై...

AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ

AP PPP Policy 2026: పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) విధానంపై పెద్ద...

Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్‌ గుడ్‌న్యూస్.. క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు

Tobacco Farmers: పొగాకు రైతులకు శుభవార్త చెబుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక...