28
September, 2026

A News 365Times Venture

28
Monday
September, 2026

A News 365Times Venture

Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్‌.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..

Date:

Telangana Ration Cards: తెలంగాణలో నూతన పీడీఎస్ (PDS) రేషన్ కార్డుల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం తుది ముహూర్తం ఖరారు చేసింది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. నూతన అర్హులకు ఆహార భద్రతను విస్తరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.05 కోట్ల కొత్త, ల్యామినేటెడ్ రేషన్ కార్డులను అర్హులకు అందించనున్నారు. సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి స్వయంగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా, అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో పంపిణీ ప్రక్రియ మొదలవుతుంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు ఈ పంపిణీ కార్యక్రమాలు సాగుతాయి.

కార్యక్రమం సజావుగా సాగేందుకు ప్రతి నియోజకవర్గంలో పంపిణీ పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం ఆర్డీవోల (RDO)కు అప్పగించింది. స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ వేడుకలు జరగనున్నాయి. కార్డుల సేకరణకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేదికల వద్ద మౌలిక వసతులు, తాగునీరు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పంపిణీ పూర్తయిన వెంటనే సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని స్పష్టమైన సూచనలు జారీ చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Virat Kohli: వన్డేల్లో విరాట్‌ కోహ్లీ మరో అద్భుత రికార్డు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..

భారత క్రికెట్ రారాజు విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ చరిత్రలో మరో...

The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!

The Paradise Shankaranna: హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో...

AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..

ఏపీలో మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...

CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?

CJP:  అస్సాంలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP)కి భారీ ఎదురుదెబ్బ తాకింది. ఆ...