28
May, 2026

A News 365Times Venture

28
Thursday
May, 2026

A News 365Times Venture

US-Hormuz: హార్ముజ్‌పై అమెరికా-ఇరాన్ గుడ్‌న్యూస్.. తీరనున్న చమురు కష్టాలు!

Date:

పశ్చిమాసియాలో నెమ్మది నెమ్మదిగా పరిస్థితులు చక్కబడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. కొన్ని గంటల ముందు రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ.. తాజా పరిణామాలు చూస్తుంటే ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కొలిక్కి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రధానంగా హార్ముజ్ జలసంధిపై నెలకొన్న సందిగ్ధం వీడబోతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రాథమిక ముసాయిదా జరిగిందని.. త్వరలోనే హార్ముజ్ జలసంధి నుంచి వాణిజ్య రవాణా నౌకలు యధావిథిగా ప్రయాణాలు జరగొచ్చని తెలుస్తోంది.

హార్ముజ్‌పై నావికా దిగ్బంధాన్ని ఎత్తివేసేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లుగా ఇరాన్ ప్రభుత్వ టీవీ పేర్కొంది. రెండు దేశాల మధ్య ముసాయిదా అవగాహన ఒప్పందం జరిగినట్లుగా తెలుస్తోంది. ఒప్పందంలో భాగంగా ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అమెరికా సైనిక బలగాలు ఉపసంహరణ, నావికా దిగ్బంధానాన్ని ఎత్తివేయడం వంటి అంశాలు ఉన్నట్లు తెలిపింది. దిగ్బంధం ఎత్తేస్తే.. హార్ముజ్ జలసంధిని తెరుస్తామని ఇరాన్ హామీ ఇచ్చిందని పేర్కొంది.

ఇక అమెరికాతో ఉన్న సంఘర్షణను ముగించేందుకు కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) ప్రాథమిక అనధికారిక ముసాయిదా ప్రతిని టెహ్రాన్ అందుకుందని ఇరాన్ ప్రభుత్వ టీవీ నివేదించింది. ఈ ముసాయిదా ప్రకారం.. ఇరాన్ ఒక నెలలోపు హోర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలను పునరుద్ధరిస్తుంది. అదే సమయంలో అమెరికా.. ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతం నుంచి తన సైనిక దళాలను ఉపసంహరించుకుని.. నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేస్తుంది.

ఇక యుద్ధ నౌకల మోహరింపులో మార్పులు ముసాయిదాలో చేర్చలేదని నివేదించింది. అంతేకాకుండా ఒమన్‌తో కలిసి హార్ముజ్ జలసంధిలో నౌకా రవాణాను ఇరాన్ నిర్వహించడంపై ఇంకా ధృవీకరణ రాలేదు. పక్కా ధృవీకరణ లేకుండా టెహ్రాన్ ఎలాంటి చర్య తీసుకోదని కూడా ఈ ముసాయిదాలో పేర్కొంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు

US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఘర్షణలో కీలక...

Trinamool congress: బెంగాల్‌లో టీఎంసీ పతనానికి నాంది.. బీజేపీలోకి 20 మంది ఎంపీలు..?

Trinamool congress: పశ్చిమ బెంగాల్లో సీఎం సువేందు అధికారి దూకుడుకు మమతా...

Terror Plot: ఢిల్లీ, పంజాబ్‌లో భారీ దాడులకు కుట్ర.. పాక్‌ పన్నాగం విఫలం..

ఢిల్లీ, పంజాబ్ లలో భారీ దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్ర ముఠాను...

Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎగ్జిట్.. హైకమాండ్ ఫోర్స్ చేసిందా? ఆయనే లొంగిపోయారా?

కర్ణాటక రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయ యవనికపై...