22
May, 2026

A News 365Times Venture

22
Friday
May, 2026

A News 365Times Venture

BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..

Date:

BJP: భారతదేశంలో బీజేపీ హవా 20 ఏళ్లు కొనసాగుతుందని ప్రముఖ పోల్‌స్టర్, యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా అన్నారు. సమర్థవంతమైన పాలన అందించే వారి సామర్థ్యంపై ఇది ఆధారపడుతుందని చెప్పారు. బీజేపీ పాలన పనితీరు గణనీయంగా బలహీనపడనంత కాలం ఆ పార్టీ స్థానం సురక్షితంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఒకప్పుడు కాంగ్రెస్ అనుభవించిన సుదీర్ఘ ఆధిపత్యాన్ని, ఇప్పుడు బీజేపీ అనుభవిస్తోందని చెప్పారు. భారతదేశంలో ఏక-పార్టీ ఆధిపత్య పరిస్థితులను చూస్తున్నామని అన్నారు.

పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘రాజకీయాల్లో ఒక కాలపరిమితి ఉంటుంది. గతంలో కాంగ్రెస్ 1977 వరకు నిరంతరం పాలించింది. ఆ తర్వాత ఇబ్బందుల్ని ఎదుర్కొవడం ప్రారంభించింది. ఒక రాజకీయ తరం సుమారు 20 ఏళ్లు ఉంటుందని మనం భావిస్తాం. ఇప్పుడు బీజేపీ కూడా దీనినే అనుభవిస్తోంది’’ అని ఆయన చెప్పారు. బీజేపీ సుదీర్ఘకాలం పాటు భారత రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉంటుందని ఆయన చెప్పారు.

ఇదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ భవిష్యత్తు ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. భారీ మెజారిటీ పొందిన తర్వాత బీజేపీపై కూడా అంచనాలు పెరిగిపోయాయని, దీనికి అనుగుణంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అద్భుతంగా రాణించాల్సి ఉంటుందని చెప్పారు. బీజేపీ బలహీనపడనంత కాలం గెలుస్తూనే ఉంటుందని, ప్రతిపక్షం ఓడిపోతూనే ఉంటుందని చెప్పారు.

వారసత్వ సమస్యల భారాన్ని కాంగ్రెస్ ఇంకా ఎదుర్కొంటూనే ఉందని అన్నారు. గత పాలనపై ఏర్పడి నెగిటివ్ అభిప్రాయాలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌కు ఇంకా సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2029 నాటికి కాంగ్రెస్‌కు అధికారం దూరమై 15 ఏళ్లు పూర్తవుతుంది, దేశవ్యాప్తంగా ప్రజల్ని మళ్లీ నమ్మించే స్థాయికి రావడానికి మరో 5 ఏళ్లు పట్టొచ్చు అని ఆయన తెలిపారు. బీజేపీ ఆధిపత్యం 2034 వరకు కొనసాగుతుందని ఆయన చెప్పారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..

ఐపీఎల్ 2026లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్) వేదికగా...

Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్

బీహార్‌లోని గయా జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి జీతన్...

Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్‌ సింగ్‌కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్

తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో మరో కీలక పరిణామం...

SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!

SRH vs RCB: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు జరుగుతున్న కీలక...