14
May, 2026

A News 365Times Venture

14
Thursday
May, 2026

A News 365Times Venture

Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్‌దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..

Date:

టీమ్ ఇండియా బౌలర్, పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ముందు ఈ సంఘటన చోటుచేసుకుంది.

వైరల్ వీడియో ప్రకారం.. అర్ష్‌దీప్ సింగ్ ముంబై ఆటగాడు నమన్ ధీర్‌తో కలిసి కూర్చుని ఉన్న సమయంలో, అక్కడి నుంచి వెళ్తున్న తిలక్ వర్మను ఉద్దేశించి “ఓయ్ అంధేరే” (చీకటి లాంటి వాడా) అని పిలిచారు. అంతటితో ఆగకుండా కెమెరాను నమన్ ధీర్ వైపు తిప్పి, “ఇతను పంజాబ్ అసలైన వెలుగు (నూర్).. నీ ముఖం ఒకసారి చూసుకో” అంటూ తిలక్ వర్మ చర్మ రంగును ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు అర్ష్‌దీప్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. స్నేహితుల మధ్య సరదా సంభాషణ అయినప్పటికీ, ఒకరి చర్మ రంగును గేలి చేయడం ‘వర్ణ వివక్ష’ కిందికే వస్తుందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్ష్‌దీప్ సింగ్ ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆయన పోస్ట్ చేసిన ఒక వ్లాగ్‌లో టీమ్ ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ విమానంలో ‘వేప్’  ఉపయోగిస్తూ కనిపించడం పెద్ద వివాదానికి దారి తీసింది. ఇప్పుడు మరోసారి తోటి ఆటగాడి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ వివాదంపై అటు ఆటగాళ్ల నుంచి కానీ, ఇటు ఐపీఎల్ యాజమాన్యం నుంచి కానీ ఇంకా ఎటువంటి అధికారిక స్పందన రాలేదు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్‌కు నిలిచిపోనున్న రష్యా చమురు..

Russia Oil: మరో రెండు రోజుల్లో రష్యా నుంచి భారత్ దిగుమతి...

Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!

పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టింది. అన్ని రకాలుగా ప్రపంచ...

Kejriwal: కేజ్రీవాల్‌, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరోసారి ముదురుతోంది. తాజాగా మాజీ సీఎం...

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..

భారత క్రికెట్ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతోంది. కేవలం 15...