13
May, 2026

A News 365Times Venture

13
Wednesday
May, 2026

A News 365Times Venture

8K కెమెరా, 165Hz డిస్‌ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!

Date:

Motorola Razr Fold Launched: మోటోరోలా (Motorola) భారత్‌లో కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘మోటరోలా రేజర్ ఫోల్డ్’ (Motorola Razr Fold)ను అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ ముందుగా ప్రకటించినట్టుగానే ఈ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్‌తో పాటు.. ప్రత్యేకమైన FIFA వరల్డ్‌కప్ 26 కలెక్షన్ ఎడిషన్‌ను కూడా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అట్రాక్టివ్ డిజైన్, మంచి కెమెరా సెటప్, AI ఫీచర్లు, భారీ బ్యాటరీతో ఈ ఫోన్ ప్రీమియం సెగ్మెంట్‌లో వినియోగదారుల ముందుకు వచ్చింది.

రేజర్ ఫోల్డ్‌లో స్టెయిన్‌లెస్ స్టీల్ టియర్‌డ్రాప్ హింజ్‌తో పాటు టైటానియం ఇన్నర్ స్క్రీన్ ప్లేట్‌ను ఉపయోగించారు. దీని వల్ల స్క్రీన్ మడతలు తగ్గి, ఫోన్ మరింత బలంగా ఉంటుంది. ప్రపంచంలో తొలిసారిగా ఈ ఫోన్‌లో ‘కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 3’ రక్షణను అందించారు. గత తరాల గ్లాస్‌తో పోలిస్తే 75% మెరుగైన డ్రాప్ ప్రొటెక్షన్ ఇస్తుందని మోటరోలా తెలిపింది. ఈ ఫోన్ ఓపెన్ చేసినప్పుడు కేవలం 4.6 mm మందంతో ఉండగా, ఫోల్డ్ చేసినప్పుడు 9.9 mm మందంతో ఉంటుంది. “ల్యాప్‌టాప్ మోడ్”, “టెంట్ మోడ్” వంటి ప్రత్యేక ఫోల్డింగ్ మోడ్‌లను కూడా అందించారు.

కొత్త Motorola Razr Fold ఫోన్‌లో 8.1 అంగుళాల 2K LTPO pOLED ఇన్నర్ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్‌తో వస్తుంది. అలాగే బయట భాగంలో 6.56 అంగుళాల LTPO pOLED కవర్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. గేమింగ్, వీడియోలు, మల్టీటాస్కింగ్‌కు ఈ డిస్‌ప్లేలు ప్రత్యేక అనుభవాన్ని అందిస్తాయి.

Image (1)

FIFA వరల్డ్‌కప్ 26 స్పెషల్ ఎడిషన్:
ఫుట్‌బాల్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా FIFA వరల్డ్‌కప్ 26 ఎడిషన్‌ను కూడా మోటరోలా విడుదల చేసింది. ఈ వేరియంట్ వెనుక భాగంలో ప్రత్యేక టెక్స్చర్డ్ డాట్ ప్యాటర్న్‌ను ఉపయోగించారు. అలాగే 24K గోల్డ్ ప్లేటింగ్‌తో రూపొందించిన అధికారిక FIFA వరల్డ్‌కప్ 26 లోగోను అమర్చారు. ప్రత్యేక కలెక్టర్స్ ఎడిషన్‌గా దీనిని మార్కెట్‌లో ప్రవేశపెట్టారు.

ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో మూడు 50 MP కెమెరాలను అందించారు. Sony LYTIA 828 సెన్సర్‌తో కూడిన ప్రధాన కెమెరా 8K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. డాల్బీ విజన్, ఫాంటోన్ వాలిడేటెడ్ కలర్ అక్యురసీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ 3x ఆప్టికల్ జూమ్, 100x AI సూపర్ జూమ్ ప్రో ఫీచర్‌తో వస్తుంది. 50MP అల్ట్రావైడ్ కెమెరా 122 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ అందిస్తుంది. సెల్ఫీల కోసం 32MP ఇన్నర్ కెమెరా, 20MP అవుటర్ కెమెరాలను ఇచ్చారు.

ఈ ఫోన్‌కు శక్తివంతమైన Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌ను అమర్చారు. 12GB/16GB LPDDR5X ర్యామ్, 256GB/512GB UFS 4.1 స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేసే ఈ డివైస్‌కు 7 సంవత్సరాల OS అప్‌డేట్స్, 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని కంపెనీ ప్రకటించింది. AI ఆధారిత “మోటో ai” ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. నోటిఫికేషన్ సమరీలు, లైవ్ ట్రాన్స్‌క్రిప్షన్, గూగుల్ జెమినీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్, పర్ప్లేక్సిటీ AI వంటి సేవలకు సపోర్ట్ ఉంటుంది.

రేజర్ ఫోల్డ్‌లో 6000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందించారు. 80W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. కేవలం 12 నిమిషాల ఛార్జింగ్‌తో 12 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్ అందుతుందని కంపెనీ తెలిపింది.

Image (2)

ఇక ధరల విషయానికి వస్తే.. 12GB + 256GB వేరియంట్ రూ. 1,49,999, 16GB + 512GB వేరియంట్ ధర రూ. 1,59,999, FIFA వరల్డ్‌కప్ 26 ఎడిషన్ రూ. 1,69,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్, రిలయన్స్ డిజిటల్ సహా ప్రముఖ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. మే 20 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.

లాంచ్ ఆఫర్ల కింద Axis, HDFC, SBI బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 10,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై 18 నెలల వరకు నో-కాస్ట్ EMI సదుపాయం కల్పించారు. ప్రారంభ నెలలో కొనుగోలు చేసే వారికి రూ. 57,000 విలువైన ఉచిత ఒకసారి స్క్రీన్ రీప్లేస్‌మెంట్ కూడా ఇవ్వనున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Air India: ప్రధాని మోదీ పొదుపు మంత్రం.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..

Air India: పశ్చిమాసియా యుద్ధం, ఇంధన సంక్షోభంతో భారత్ సహా ప్రపంచదేశాలు...

Bomb Threat: ఆ సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం.. ఏకంగా ముఖ్యమంత్రికే బాంబు బెదిరింపు!

Bomb Threat: పంజాబ్‌లో మరోసారి బాంబు బెదిరింపులు పెను సంచలనం సృష్టిస్తున్నాయి....

Hantavirus: హంటావైరస్‌పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?

Hantavirus: హంటావైరస్ అనేది ప్రధానంగా ఎలుకల ద్వారా మనుషులకు సోకే వైరస్....

Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్‌ ఫైర్‌

Raghunandan Rao: తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ చేసిన...