Vivo: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన ఉనికిని కాపాడుకోవడానికి వివో (Vivo) చైనాలో కొత్తగా Vivo G5i, Vivo G5z స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు డిజైన్, ఫీచర్లు, మెమరీ ఆప్షన్ల పరంగా ఒకే విధంగా ఉండగా.. పేర్లలో మాత్రమే తేడా ఉంది. వీటిలో 7,200mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 50MP కెమెరా వంటి ఫీచర్లతో ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.
Vivo G5i, Vivo G5z స్మార్ట్‌ఫోన్లలో 6.75 అంగుళాల LCD డిస్‌ప్లేను అందించారు. ఈ స్క్రీన్ 1570 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే 19.6:9 యాస్పెక్ట్ రేషియో, 256ppi పిక్సెల్ డెన్సిటీ, 1500:1 కాంట్రాస్ట్ రేషియో మరియు 83% NTSC కలర్ గామట్‌ను కలిగి ఉంది.
పనితీరు విషయానికి వస్తే.. ఈ రెండు ఫోన్లలో 4nm ప్రాసెస్‌పై తయారైన Qualcomm Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌ను అందించారు. దీనికి Adreno 613 GPU జత చేశారు. ఈ ఫోన్లు గరిష్టంగా 8GB LPDDR5 RAM, 256GB UFS 3.1 స్టోరేజ్‌తో అందుబాటులో ఉన్నాయి. ఇవి Android 16 ఆధారిత OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయి. కెమెరా విభాగంలో.. వెనుక భాగంలో ఆటోఫోకస్ సపోర్ట్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరాను అందించారు. ఈ కెమెరా f/1.8 అపర్చర్‌తో పనిచేస్తూ 10x డిజిటల్ జూమ్‌కు మద్దతు ఇస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP కెమెరాను అమర్చారు. ముందు, వెనుక కెమెరాలు రెండూ 1080p వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. అయితే OIS, EIS వంటి ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్లు ఇందులో లేవు.
ఈ ఫోన్లలో ప్రధాన ఆకర్షణ 7,200mAh భారీ బ్యాటరీ. ఇందులో 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 33W, 22.5W ఛార్జింగ్ స్టాండర్డ్స్‌కు కూడా మద్దతు ఉంది. అలాగే OTG రివర్స్ ఛార్జింగ్ ఫీచర్‌ను కూడా అందించారు. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, Face Wake ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్లు ఉన్నాయి. డ్యూరబిలిటీ పరంగా కూడా ఈ ఫోన్లు IP68, IP69 రేటింగ్స్‌తో నీరు, ధూళి నిరోధకతను కలిగి ఉండటమే కాకుండా.. ఫైవ్ స్టార్ డ్రాప్ అండ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ను కూడా పొందాయి. ప్లాస్టిక్ మిడిల్ ఫ్రేమ్, కాంపోజిట్ బ్యాక్ ప్యానెల్‌తో వీటిని రూపొందించారు.
కనెక్టివిటీ విషయానికి వస్తే.. 5G, డ్యూయల్ నానో సిమ్, Wi-Fi Display, MU-MIMO, Bluetooth 4.2, NFC, GPS, GLONASS, Galileo, QZSS, USB Type-C, OTG వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే స్టీరియో డ్యూయల్ స్పీకర్లు, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ధరల విషయానికి వస్తే.. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 2,199 యువాన్‌లు (రూ.30,900)గా నిర్ణయించారు. 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర 2,899 యువాన్‌లు (రూ.40,700). ప్రస్తుతం ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఓబిసిడియన్ బ్లాక్ రంగులో చైనా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.




