16
October, 2026

A News 365Times Venture

16
Friday
October, 2026

A News 365Times Venture

6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

Date:

TECNO Spark 50s 5G Launched: బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ విభాగంలో టెక్నో (TECNO) మరో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. TECNO Spark 50s 5G పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్‌లో 6500mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది. TECNO Spark 50s 5G రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.19,999 కాగా, 8GB + 128GB వేరియంట్ ధర రూ.22,999గా నిర్ణయించారు. అక్టోబర్ 20 నుంచి దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో మాత్రమే ఈ ఫోన్ అమ్మకాలు జరగనున్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.78 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 560 నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. బర్గుండీ రెడ్, బ్రీజ్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ మొబైల్ లభిస్తుంది. ధూళి, నీటి తుంపర్ల నుంచి రక్షణ కోసం IP64 Pro రేటింగ్ ఉంది. అలాగే MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ ప్రమాణాలను కూడా ఫోన్ అందుకుంటుంది. ఫోన్‌లో 6nm టెక్నాలజీపై తయారైన MediaTek Dimensity 6400 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6GB/8GB LPDDR4X ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజ్ ఉన్నాయి. మైక్రోSD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకోవచ్చు.

మొబైల్ వెనుకవైపు f/1.85 అపెర్చర్‌తో 50MP ప్రధాన కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP కెమెరా అందించారు. ఈ ఫోన్‌లో 6500mAh బ్యాటరీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించే వారికి భారీ బ్యాటరీ ఉపయోగపడనుంది. ఇంకా ఇందులో తక్కువ సిగ్నల్ ఉన్న ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీ కోసం 4×4 MIMO యాంటెన్నా టెక్నాలజీని అందించింది. కంపెనీ ప్రకారం ఇది డౌన్‌లోడ్ వేగాన్ని 82% వరకు పెంచగలదు.

అలాగే UPI లావాదేవీలు వేగంగా పూర్తయ్యేందుకు UPS 3.0 టెక్నాలజీ ఉంది. సెల్యులార్ నెట్‌వర్క్ లేదా Wi-Fi అందుబాటులో లేని సమయంలో FreeLink ద్వారా 1.5 కిలోమీటర్ల పరిధిలో వాయిస్ కాల్స్, మెసేజ్‌లు, ఫొటోలను షేర్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.ఇంకా ఇందులో AI Noise Cancellation ద్వారా సాధారణ కాల్స్, వాట్సాప్ కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్‌లో వాయిస్ క్లారిటీని మెరుగుపరచవచ్చు. గూగుల్ జెమినీ ఇంటిగ్రేషన్, Circle to Search వంటి AI ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!

Vi: వోడాఫోన్ ఐడియా (Vi) ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కొత్త ఫ్యామిలీ...

AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?

AP Alliance Seat Sharing: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి...

KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?

KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు,...

YSRCP Candidates List: మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!

YSRCP Candidates List: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌...