25
June, 2026

A News 365Times Venture

25
Thursday
June, 2026

A News 365Times Venture

6.39mm స్లిమ్ డిజైన్‌, 144Hz AMOLED డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

Date:

TECNO CAMON Slim Launched: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్‌ను సృష్టించేలా టెక్నో (TECNO) నుండి కొత్త స్మార్ట్‌ఫోన్ టెక్నో కామోన్ స్లిమ్ (TECNO CAMON Slim)ను అధికారికంగా లాంచ్ చేసింది. కేవలం 6.39 మి.మీ. అల్ట్రా స్లిమ్ 3D కర్వ్డ్ యూనీబాడీ డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్ స్టైలిష్ లుక్‌తో పాటు శక్తివంతమైన AI ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ కెమెరా వ్యవస్థ, భారీ బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తోంది.

ఆకట్టుకునే డిజైన్:

ఈ కొత్త స్మార్ట్ ఫోన్ సమ్మెట్రికల్ 3D కర్వ్డ్ డిజైన్‌తో రూపొందించబడింది. ఫోన్ వెనుక భాగంలో 354 మినీ LED లైట్లతో కూడిన కొత్త మూడ్ లైటింగ్ సిస్టమ్‌ను అందించారు. కాల్స్, మెసేజ్‌లు, గేమింగ్, ఛార్జింగ్ వంటి నోటిఫికేషన్లకు అనుగుణంగా మొత్తం 55 రకాల లైటింగ్ ఎఫెక్ట్‌ లను అందించగలదు. అంతేకాదు యూజర్లు తమకు నచ్చిన యానిమేషన్లను కూడా సెట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం 5 ప్రత్యేక డిజైన్ వేరియంట్లలో లభిస్తుంది. UV కాంతికి స్పందించే “New Mondrian”, 3D క్రిస్టల్ డైమండ్ ఎఫెక్ట్‌తో “Prism Black”, “Jungle Green”, స్టార్‌ర్రీ నైట్ ఆర్ట్ ప్రేరణతో రూపొందిన “Van Gogh Blue”, మ్యాట్ ఫినిష్‌తో “Burgundy Red” రంగులు అందుబాటులో ఉన్నాయి.

సోనీ కెమెరా:

ఫోన్‌లో 50MP సోనీ LYT-600 ప్రధాన కెమెరాను అమర్చారు. పెద్ద సెన్సార్ కారణంగా తక్కువ వెలుతురులో కూడా మెరుగైన ఫోటోలు తీయవచ్చు. టెక్నో ప్రత్యేక నైట్ ఇమేజింగ్ అల్గారిథమ్స్ ఫోటోలలో నాయిస్‌ను తగ్గించి సహజ రంగులను అందిస్తాయి. అలాగే AI ఆధారిత మోషన్ డిటెక్షన్, షట్టర్ కంట్రోల్ టెక్నాలజీలతో బ్లర్ తగ్గించి క్లియర్ ఫోటోలను అందిస్తుంది. ముందు భాగంలో 92.4 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో అనేక AI ఆధారిత ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. AI స్నాప్ పోస్టర్ ద్వారా ఫోటోలను ఆటోమేటిక్‌గా ప్రొఫెషనల్ పోస్టర్లుగా మార్చుకోవచ్చు. AI పెట్ టుగెథర్ ఫీచర్ ద్వారా పెంపుడు జంతువులతో కలిసి ప్రత్యేక ఫోటోలను రూపొందించవచ్చు.

భారీ బ్యాటరీ:

ఈ మొబైల్ కేవలం 6.39mm మందం ఉన్నపటికీ.. 6000mAh (కొన్ని మార్కెట్లలో 5600mAh) భారీ బ్యాటరీని అందించారు. 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 2000 ఛార్జింగ్ సైకిళ్ల తర్వాత కూడా బ్యాటరీ హెల్త్ 80% వరకు నిలిచి ఉంటుందని కంపెనీ తెలిపింది.

144Hz AMOLED డిస్‌ప్లే:

ఫోన్ ముందు భాగంలో 6.78 అంగుళాల 1.5K రిజల్యూషన్‌తో కూడిన 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2160Hz PWM డిమ్మింగ్, Gorilla Glass 7i రక్షణతో ఇది మరింత ప్రీమియం అనుభూతిని అందిస్తుంది.

ప్రాసెసర్:

ఈ ఫోన్‌లో MediaTek Helio G200 Ultimate ప్రాసెసర్, 8GB RAM, 128GB/256GB స్టోరేజ్, డ్యూయల్ స్పీకర్లు, డాల్బీ ఆటమ్స్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, IR బ్లాస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే IP68, IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్స్‌తో పాటు MIL-STD-810 మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ కూడా అందించారు. TECNO CAMON Slim ప్రస్తుతం పలు అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల అవుతోంది. ధర, ప్రాంతాల వారీ విడుదల తేదీలను కంపెనీ త్వరలో ప్రకటించనుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..

Ketan Agarwal Murder: పూణేకు చెందిన ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్...

Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!

Benefits of Hugging: ప్రస్తుత ఆధునిక జీవితంలో పనిఒత్తిడి, కుటుంబ బాధ్యతలు,...

YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఇచ్చిన మరో కీలక హామీని కూటమి ప్రభుత్వం విస్మరించిందని...

Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్‌ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!

Hyderabad: హైదరాబాద్‌ సంతోష్‌నగర్ డివిజన్ పరిధిలోని ఐఎస్‌సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో...