14
July, 2026

A News 365Times Venture

14
Tuesday
July, 2026

A News 365Times Venture

5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!

Date:

Lava Virat V1 5G: భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా (Lava) నుండి కొత్త విరాట్ (Virat) సిరీస్‌ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ సిరీస్‌లో భాగంగా Lava Virat V1 5G, Lava Virat V1 4G స్మార్ట్‌ఫోన్లను జూలై 21 మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ రెండు ఫోన్లు కొత్త ‘విరాట్’ లైనప్‌లో తొలి మోడళ్లుగా మార్కెట్లోకి రానున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్స్ కు సంబంధించి ఓ ప్రత్యేక మైక్రోసైట్ ఇప్పటికే ఫ్లిప్కార్ట్ లో అందుబాటులోకి తీసుకవచ్చారు కూడా…

కంపెనీ ఇప్పటికే Virat V1 సిరీస్ డిజైన్‌ను రివీల్ చేసింది. లావా Virat V1 4Gలో స్క్వేర్ ఆకారంలో డ్యూయల్ రియర్ కెమెరా మాడ్యూల్ ఉండగా.. లావా Virat V1 5Gలో ప్రత్యేక డిజైన్‌తో డ్యూయల్ కెమెరా సెటప్, LED ఫ్లాష్ ఇవ్వనున్నారు. రెండు ఫోన్లలోనూ ఫ్లాట్ బ్యాక్ ప్యానెల్ ఉండగా.. 5G వేరియంట్ వెనుక భాగంలో ప్రత్యేక ప్యాటర్న్ డిజైన్ కనిపించనుంది. ఈ రెండు మొబైల్స్ ఫోన్లు బ్లూ, గోల్డ్ రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఫోన్ కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉండనున్నాయి.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో కూడా USB Type-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్ కటౌట్‌ను అందిస్తున్నారు. లావా విరాట్ V1 4Gలో 13MP ప్రైమరీ రియర్ కెమెరాతో పాటు LED ఫ్లాష్ ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది. డిజైన్ పరంగా ఈ ఫోన్ ఇటీవల విడుదలైన లావా స్మార్ట్ 4 ప్లస్ ను పోలి ఉంది. ఆ ఫోన్ ప్రారంభ ధర రూ.9,999గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ల పూర్తి స్పెసిఫికేషన్లు, ప్రాసెసర్, బ్యాటరీ, డిస్‌ప్లే, ధర వంటి వివరాలను కంపెనీ వెల్లడించలేదు. జూలై 21న జరిగే లాంచ్ ఈవెంట్‌లో పూర్తి వివరాలు ప్రకటించనుంది. ఈ సిరీస్‌ బడ్జెట్ సెగ్మెంట్‌లో మిగితా కంపెనీలకు పోటీ ఇవ్వనుంది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Vietnam Boat Tragedy: నేడు భారత్‌కు 15 మంది భారతీయుల మృతదేహాలు.!

Vietnam Boat Tragedy: వియత్నాంలో శనివారం జరిగిన ఘోర బోటు ప్రమాదంలో...

Shabad Murders: రాజ్‌కుమార్ బెయిల్ ఆర్డర్‌లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?

Shabad Murders: షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో ప్రధాన...

APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. ‘చంద్రన్న బోడిగుండు’ అంటూ ప్లకార్డులు!

APGEF Protest: అమరావతిలో ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏపీజీఈఎఫ్) ఆధ్వర్యంలో...