29
May, 2026

A News 365Times Venture

29
Friday
May, 2026

A News 365Times Venture

పాకిస్తాన్ అణుకేంద్రంపై దాడికి సిద్ధమైన భారత్-ఇజ్రాయిల్.. ఇందిరా గాంధీ ఎందుకు వెనక్కి తగ్గింది?

Date:

1974లో భారత్ తన తొలి అణు పరీక్షల్ని విజయవంతగా నిర్వహించింది. అయితే, ఈ పరిణామాలు దాయాది పాకిస్తాన్‌లో భయాలను పెంచాయి. అప్పటి పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికల్ అలీ భుట్టో మాట్లాడుతూ.. ‘‘గడ్డి తిన్నా సరే, మేము అణు బాంబు తయారు చేస్తాం’’ అని ప్రకటించారు. ఇప్పటికే ప్రపంచంలో ‘‘క్రిస్టియన్ బాంబ్’’, ‘‘జ్యూయిష్ బాంబ్’’, ‘‘హిందూ బాంబ్’’ ఉన్నాయని, ‘‘ఇస్లామిక్ బాంబ్’’ ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలే పాకిస్తాన్‌ అణు శక్తిగా మారాలనే కసిని పెంచాయి. దీని తర్వాత పాకిస్తాన్ తన అణు శాస్త్రవేత్త ఏక్యూ ఖాన్ నేతృత్వంలో అణు పరీక్షల్ని ముమ్మరం చేసింది.

ఇజ్రాయిల్‌తో సువర్ణవకాశాన్ని చేజార్చుకున్న భారత్:

ప్రస్తుతం ఏ ఉగ్రవాద దాడి చేసైనా, పాకిస్తాన్ తమ వద్ద అణుబాంబులు ఉన్నాయని భారత్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తోంది. అయితే, 80లలో భారత్ ఇజ్రాయిల్‌లో కీలక ఆపరేషన్‌కు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఓకే చెప్పి ఉంటే, పాకిస్తాన్ ఇప్పటికీ అణు శక్తిగా మారే అవకాశాలు లేకుండా పోయేవి. రాజకీయ, భౌగోళిక కారణాల వల్ల ఇందిరాగాంధీ ఓకే చెప్పలేకపోయింది.

పాకిస్తాన్ అణుబాంబు తయారు చేస్తున్న విషయం ఇజ్రాయిల్‌కు చేరింది. దీంతో ఇది పూర్తిస్థాయిలో వారి వద్దకు వస్తే తమ శత్రు దేశాలైన ఇస్లామిక్ దేశాలకు ఈ టెక్నాలజీని ఇస్తుందని ఇజ్రాయిల్ భయపడింది. ఇటు పాకిస్తాన్‌తో భారత్‌కు వైరం ఉన్న కారణంగా రెండు దేశాలు కలిసి ఒక ఆపరేషన్‌కు ప్లాన్ చేశాయి. ఆ సమయంలో భారత్, ఇజ్రాయిల్ మధ్య దౌత్యసంబంధాలు పెద్దగా లేకపోయినా, బ్యాక్ ఛానెల్ ద్వారా జరిగిన చర్చల అనంతరం పాకిస్తాన్‌లో కహోటా అనే ప్రాంతంలో అణు స్థావరంపై దాడి చేయాలని రెండు దేశాలు భావించాయి.

దాడికి ఎలా ప్లాన్ చేశారు?

భారత్‌లోని జామ్ నగర్, ఉదంపూర్ ఎయిర్ బేసుల నుంచి ఇజ్రాయిల్ తన యుద్ధ విమానాల ద్వారా కహుటాపై దాడి చేయాలని ప్లాన్ చేసింది. దీని కోసం ఆరు ఇజ్రాయిల్ F-16 యుద్ధవిమానాలు, ఆరు F-15 యుద్ధవిమానాలు ఉపయోగించాలని అనుకుంది. భారత్ చేరుకుని, పాక్ రాడార్లకు చిక్కకుండా కొండల మధ్య ప్రయాణించి కహూలా అణు కేంద్రంపై బాంబులు వేయాలని ప్లా్న్ చేశారు. ఇదే సమయంలో భారత్‌కు చెందిన జాగ్వార్ స్వ్కాడ్రన్ల ద్వారా లో లెవర్ బాంబింగ్ చేయాలని అనుకున్నట్లు సమాచారం.

వెనక్కి తగ్గిన ఇందిరా గాంధీ:

ఈ ఆపరేషన్ చివరి దశలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నిలిపేశారు. దీనికి ప్రధాన కారణాల్లో అమెరికా ఒత్తిడి అని చెబుతారు. అప్పట్లో సోవియట్ రష్యా-ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది. అమెరికాకు ఈ విషయంలో పాకిస్తాన్ సాయం చేస్తోంది. అప్పటి పాక్ అధ్యక్షుడు జియా ఉల్ హక్ అమెరికాకు స్నేహితుడిగా మారాడు. ఈ దాడి జరిగితే ప్రాంతీయ అస్థిరత పెరుగుతుందని అమెరికా భావించింది. అప్పటి యూఎస్ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ కూడా ఇలాంటి చర్యల్ని తీవ్రంగా వ్యతిరేకించే వారని సీఐఏ ఆ తర్వాత వెల్లడించింది.

భారత్‌ను పాక్ బెదిరించిందా.?

కహుటాపై దాడి చేస్తే ముంబై లోని ట్రాంబే అణు కేంద్రంపై ప్రతిదాడి చేస్తామని పాకిస్తాన్ బెదిరించినట్లు సమాచారం. ట్రాంబే ముంబైకి సమీపంలో ఉండటంతో ఏదైనా దాడి జరిగితే అది ముంబైలో భారీ రేడియేషన్‌ ప్రమాదాన్ని సృష్టిస్తుందని, అందుకే ఇందిరాగాంధీ ఈ ఆపరేషన్‌కు ఆమోదం తెలపలేదని చాలా మంది విశ్లేషకులు భావిస్తారు.

చివరికి అణ్వాయుధ దేశంగా పాకిస్తాన్:

భారత్-ఇజ్రాయిల్ ప్లాన్ విఫలమైన తర్వాత పాక్ తన అణు కార్యక్రమాలను మరింత వేంగా చేసింది. 1998లో భారత్ పోఖ్రాన్-2 అణు పరీక్షలు నిర్వహించగా, పాకిస్తాన్ కూడా తన అణు పరీక్షల్ని జరిపింది. ఆ తర్వాత రెండు దేశాలు కూడా అణ్వాయుధ దేశాలు మారాయి. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే ఏదైనా ఉగ్రదాడి చేసి, మనం పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుందామని భావిస్తే, తాము అణు దేశమని పాక్, భారత్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తోంది. కానీ, ఆపరేషన్ సిందూర్ సమయంలో ఈ బ్లాక్‌మెయిల్‌లకు చెక్ పడింది. భారత్ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లో భీకర దాడులు చేసింది. పాక్ తన అణ్వాయుధాలను దాచే ‘‘కిరాణా హిల్స్’’పై భారత్ దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే, దీనిని మన రక్షణ అధికారులు ధ్రువీకరించలేదు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే

CM Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో...

Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్‌లో లేవనెత్తుతానని హామీ

కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆటో అవతారమెత్తారు....

Vaibhav Century Miss: మరోసారి సెంచరీ మిస్ చేసుకున్న సూర్యవంశీ.. చెత్త రికార్డులో కూడా నంబర్ వన్‌గా వైభవ్..

ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల సునామీ సృష్టిస్తూ సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్న...

Venkat Reddy: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి.. విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు శ్రీ గాదె...