7
July, 2026

A News 365Times Venture

7
Tuesday
July, 2026

A News 365Times Venture

వన్డే ప్రపంచకప్‌ 2027లో Vaibhav Sooryavanshi.. భారత మాజీ స్పిన్నర్ కీలక వ్యాఖ్యలు.!

Date:

Vaibhav Sooryavanshi: క్రికెట్‌ ప్రపంచంలో సంచలనంగా మారిన 15 ఏళ్ల బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. తాజాగా ఈ బుడ్డోడు అంతర్జాతీయ క్రికెట్‌లో మరో కీలక చర్చకు కేంద్రబిందువయ్యాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ ద్వారా భారత జట్టుకు అరంగేట్రం చేసిన ఈ యువ ఆటగాడిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు అతడిని భవిష్యత్ వన్డే ప్రపంచకప్‌కు కూడా పరిశీలించాలని మాజీ స్పిన్నర్ ‘లక్ష్మణ్ శివరామకృష్ణన్’ అభిప్రాయపడ్డారు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచిన వైభవ్ సూర్యవంశీ 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. అదే ప్రదర్శన అతడికి భారత జట్టులో చోటు కల్పించింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో అరంగేట్రం చేసిన వైభవ్ 10 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసినప్పటికీ.. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు కొట్టడంతో తన సత్తా ఏంటో రుచిచూపించాడు.

అయితే ప్రస్తుతం టీ20 జట్టులో వైభవ్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలా.? లేక మూడో టీ20లో మళ్లీ సంజూ శాంసన్‌ను ఆడించాలా.? అనే చర్చ కొనసాగుతోంది. అయితే ఇప్పుడు లక్ష్మణ్ శివరామకృష్ణన్ మాత్రం మరో ఆసక్తికర విషయాన్నీ తెరపైకి తెచ్చారు. టీ20 ఫార్మాట్‌లో వైభవ్ అసాధారణ ప్రదర్శన కొనసాగిస్తే అతడిని 2027 వన్డే ప్రపంచకప్‌కు కూడా పరిశీలించాలని సెలెక్టర్లకు సూచించారు. టీ20ల్లో అతడు అద్భుతంగా రాణిస్తే.. రాబోయే 50 ఓవర్ల ప్రపంచకప్‌లో అవకాశం ఇవ్వాలి. అతడు మ్యాచ్ విన్నర్‌గా మారే సామర్థ్యం కలిగిన ఆటగాడు అంటూ శివరామకృష్ణన్ పేర్కొన్నారు.

వైభవ్ సూర్యవంశీ వన్డే ఫార్మాట్‌లో కూడా మంచి రికార్డును కలిగి ఉన్నాడు. ఇప్పటివరకు 25 యూత్ వన్డే మ్యాచ్‌లు ఆడిన అతడు 56.48 సగటుతో 1,412 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఏడు అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. ఇంగ్లండ్ అండర్-19 జట్టుపై 175 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ తో ప్రపంచ కప్ ను అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

అంతేకాకుండా భారత ‘A’ జట్టుతో కలిసి శ్రీలంకలో జరిగిన ట్రై-సిరీస్‌లో కూడా వైభవ్ ఆకట్టుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 200.95 స్ట్రైక్‌రేట్‌తో 211 పరుగులు చేసి 42.20 సగటును నమోదు చేశాడు. అయితే ప్రస్తుతం అతడిని నేరుగా ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవడం తొందరపాటు నిర్ణయం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ అతడి ప్రతిభ, నిలకడను దృష్టిలో ఉంచుకుంటే త్వరలోనే భారత వన్డే జట్టులో అవకాశం ఇవ్వడం మాత్రం ఆశ్చర్యకరమైన విషయం కాదని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

చీటింగ్ కేసుతోపాటు క్రిమినల్ కేసు.. ప్రొడ్యూసర్ వెంకట్ అనీష్ రెడ్డిపై కేసు నమోదు.!

సినీ నిర్మాత వెంకట్ అనీష్ రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు...

Job Interview Tips: సీఈవోను అడిగిన ఒక్క ప్రశ్నే కొంపముంచిందా..? భారతీయుడి అనుభవం వైరల్

Job Interview Tips: కెనడాలో నివసిస్తున్న భారతీయ ప్రొడక్ట్ మేనేజర్ కరణ్...

డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!

Xiaomi 18 Pro Max: షియోమీ నుండి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌గా...