28
September, 2026

A News 365Times Venture

28
Monday
September, 2026

A News 365Times Venture

బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!

Date:

Toyota Hyryder Aero Black Edition: టయోటా ఇండియా (Toyota) కంపెనీ పాపులర్ ఎస్‌యూవీ అర్బన్ క్రూయిసర్ హైరైడెర్ లో సరికొత్త ఏరో బ్లాక్ ఎడిషన్ (Aero Black Edition)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్‌లో భాగంగా ఎస్‌యూవీకి ప్రత్యేకమైన బ్లాక్-థీమ్ డిజైన్‌ను అందించారు. పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండే ఈ స్టైలింగ్ ప్యాకేజీ ధర రూ.31,999గా నిర్ణయించారు. స్టాక్ ఉన్నంత వరకు టయోటా డీలర్‌షిప్‌ల ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు.

బ్లాక్ థీమ్‌.. కొత్త లుక్..

ఈ బ్లాక్ ఎడిషన్లో ప్రధానంగా ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో మార్పులు చేశారు. సాధారణ మోడల్‌లో క్రోమ్ ఫినిషింగ్‌తో కనిపించే పలు భాగాలను ఇప్పుడు బ్లాక్ కలర్‌లోకి మార్చారు. ఇందులో అప్పర్ గ్రిల్ గార్నిష్, హెడ్‌ల్యాంప్ సరౌండ్స్, టెయిల్‌గేట్ ట్రిమ్ ఉన్నాయి. అలాగే ముందు బంపర్ దిగువ భాగంలో ఉండే సిల్వర్ ఫినిష్‌డ్ సెక్షన్‌కు కూడా బ్లాక్ వేరియెంట్ ఇచ్చారు. ఫ్రంట్, రియర్ స్పాయిలర్లను కూడా బ్లాక్ కలర్‌లో అందించారు. ప్రత్యేకంగా ఈ ఎడిషన్‌ను గుర్తించేందుకు “ఏరో బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్” బ్యాడ్జ్ను కూడా అమర్చారు.

ఆల్ బ్లాక్ ప్యాకేజీ:

మరింత ప్రత్యేకమైన లుక్ కావాలనుకునే కస్టమర్ల కోసం టయోటా మరో “ఆల్ బ్లాక్ ప్యాకేజీ”ను కూడా అందిస్తోంది. అయితే ఇది ఏరో బ్లాక్ ఎడిషన్ స్టైలింగ్ ప్యాకేజీకి అదనంగా డీలర్ స్థాయిలో అందించే ప్రత్యేక ఆప్షన్. దీని ధర వేరుగా ఉంటుంది.

ఇంజిన్‌లో మార్పులు:

ఈ ఎడిషన్లో కేవలం డిజైన్ మార్పులు మాత్రమే చేశారు. ఎస్‌యూవీ ఇంజిన్, సస్పెన్షన్ లేదా గేర్‌బాక్స్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. పెట్రోల్ వెర్షన్‌లో 1.5 లీటర్, 4-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 103hp పవర్, 137Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. కొన్ని వేరియంట్లలో 2WDతో పాటు AWD ఆప్షన్ కూడా లభిస్తుంది.

దీనిని నియో డ్రైవ్ పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లతో అందిస్తున్నారు. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో 1.5 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ సిస్టమ్ మొత్తం 115hp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 0.60kWh లిథియం-అయాన్ బ్యాటరీ, e-CVT గేర్‌బాక్స్ ఉంటాయి. పవర్ ముందు చక్రాలకు అందుతుంది. అయితే ఏరో బ్లాక్ ఎడిషన్లో CNG పవర్‌ట్రెయిన్ అందుబాటులో ఉండదని టయోటా తెలిపింది.

ధర:

టొయోట అర్బన్ క్రూయిసర్ హైరైడెర్ ఏరో బ్లాక్ ఎడిషన్ ను కేవలం మిడ్ నైట్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ కలర్‌లో అందిస్తున్నారు. ఇది G(O), V గ్రేడ్‌లలో లభిస్తుంది. G(O) Neo Drive వేరియంట్ సాధారణంగా రూ.14.87 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఏరో బ్లాక్ ప్యాకేజీతో దీని ధర రూ.15.19 లక్షలకు చేరుతుంది. అదేవిధంగా V వేరియంట్ సాధారణ ధర రూ.16.42 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, ఏరో బ్లాక్ ప్యాకేజీతో రూ.16.74 లక్షలకు చేరుతుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్

భారత్ , వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో...

BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్

తెలంగాణలో కొత్తగా 41 టూబీ (2B) బార్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రొహిబిషన్...

Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..

Parvesh Verma Slap Row: ఢిల్లీలో రోడ్డు తనిఖీ సమయంలో పీడబ్ల్యూడీ...

Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!

భారతీయ బ్యాంకింగ్ రంగంలో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. కేరళ...