11
July, 2026

A News 365Times Venture

11
Saturday
July, 2026

A News 365Times Venture

అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..

Date:

BSNL AirFibre: దేశంలో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను మరింత పెంచేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ (BSNL) అందిస్తున్న ఎయిర్ ఫైబర్ (AirFibre) సేవలు వినియోగదారులకు భారీ ఆఫర్స్ ను తీసుక వచ్చింది. ఫైబర్ కేబుల్స్ వేయడం కష్టమైన ప్రాంతాల్లో కూడా వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందించేందుకు ఈ సేవను తీసుకొచ్చింది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ సేవ 5G కాకుండా BSNL ఇప్పటికే ఉన్న 4G నెట్‌వర్క్ ఆధారంగా పనిచేస్తుంది.

హైస్పీడ్ ఇంటర్నెట్:

బిఎస్ఎన్ఎల్ AirFibre 200Mbps ప్లాన్‌లో గరిష్టంగా 200Mbps డౌన్‌లోడ్ స్పీడ్ లభిస్తుంది. దీంతో ఆన్‌లైన్ గేమింగ్, 4K వీడియో స్ట్రీమింగ్, వీడియో కాల్స్, వర్క్ ఫ్రమ్ హోమ్, భారీ ఫైళ్ల డౌన్‌లోడ్ వంటి పనులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయవచ్చు. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు ప్రతి నెల 5TB హైస్పీడ్ డేటా అందుతుంది. 5TB డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 10Mbpsకు తగ్గుతుంది. ఇలా మరుసటి బిల్లింగ్ సైకిల్ ప్రారంభమైన తర్వాత మళ్లీ పూర్తి స్పీడ్ అందుబాటులోకి వస్తుంది. మార్కెట్లోని అనేక బ్రాడ్‌ బ్యాండ్ ప్లాన్‌ లలో సాధారణంగా 3.3TB వరకు మాత్రమే డేటా లభిస్తుండగా.. BSNL ఈ ప్లాన్‌లో 5TB డేటా ఇవ్వడం ప్రత్యేకతగా నిలుస్తోంది.

ఉచిత OTT సబ్‌స్క్రిప్షన్లు:

ఈ ప్లాన్‌తో పాటు పలు ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్లను కూడా బిఎస్ఎన్ఎల్ ఉచితంగా అందిస్తోంది. ఇందులో జియో హాట్‌స్టార్, జీ5, సోనీలివ్, లయన్స్‌గేట్ ప్లే, హంగామా, షెమరూమీ, ఎపిక్ఆన్ తోపాటు మరికొన్ని OTT సేవలు కూడా ఉన్నాయి. దీంతో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు అదనపు ఖర్చు లేకుండానే వీక్షించవచ్చు.

అన్‌లిమిటెడ్ ల్యాండ్‌లైన్ కాలింగ్:

ఇంటర్నెట్‌తో పాటు అన్‌లిమిటెడ్ ల్యాండ్‌లైన్ కాలింగ్ సదుపాయం కూడా ఈ ప్లాన్‌లో ఉంటుంది. దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా పరిమితులు లేకుండా కాల్స్ చేసుకోవచ్చు. అయితే ల్యాండ్‌లైన్ ఫోన్ పరికరాన్ని వినియోగదారులే ప్రత్యేకంగా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఫైబర్ బ్రాడ్‌ బ్యాండ్ అందుబాటులో లేని ప్రాంతాల్లో నివసించే వారికి BSNL AirFibre మంచి ప్రత్యామ్నాయం. కేబుల్స్ అవసరం లేకుండానే వేగవంతమైన ఇంటర్నెట్, భారీ డేటా, ఉచిత OTTలు, అన్‌లిమిటెడ్ కాలింగ్ వంటి ప్రయోజనాలు ఒకే ప్లాన్‌లో లభించడం దీని ప్రత్యేకత.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..

S Janaki: లెజెండరీ సింగర్ ఎస్. జానకి కన్నమూశారు. భారత సినీ సంగీత...

Sri Charani: చరిత్ర సృష్టించిన కడప బిడ్డ.. టెస్ట్ ఫార్మాట్‌లోకి అడుగు పెట్టిన తెలుగమ్మాయి..

Sri Charani: మహిళల క్రికెట్ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక అద్భుతమైన...

Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..

Governor Abdul Nazeer: విశాఖపట్నంలోని జేఎన్‌టీయూ–జీవీ క్యాంపస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర...

Kitchen Cleaning Hacks: టీ జల్లెడపై నల్లటి మచ్చలా? ఈ ఇంటి చిట్కాతో క్షణాల్లో శుభ్రం..

Kitchen Cleaning Hacks: భారతీయ ఇళ్లలో ఉదయం వేడి వేడి టీతోనే...