23
February, 2026

A News 365Times Venture

23
Monday
February, 2026

A News 365Times Venture

ఆసియాలో రెండవ అతిపెద్ద కార్యాలయాన్ని ప్రారంభించిన Amazon..!

Date:

Amazon: ప్రపంచ ప్రముఖ ఈ-కామర్స్, టెక్ దిగ్గజం అమెజాన్ (Amazon) భారతదేశంలో తన కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తూ బెంగళూరులో ఆసియాలోనే రెండవ అతిపెద్ద కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఈ కొత్త కార్పొరేట్ భవనాన్ని కర్ణాటక మంత్రి M.B. పాటిల్ ప్రారంభించారు. ఇప్పటివరకు అమెజాన్ భారత్ లో $40 బిలియన్ కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టగా.. 2030 నాటికి అదనంగా మరో $35 బిలియన్ పెట్టుబడి పీతబొతున్నట్లు ప్రకటించింది.

T20 World Cup 2026 India: 0,0,0,0,0,0,0,0,0,0,0.. చెత్త రికార్డును మూటగట్టుకున్న టీమిండియా!

ఈ క్యాంపస్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఇది బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొత్తం 12 అంతస్తులతో నిర్మించబడిన ఈ భవనం 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 7,000 మందికి పైగా ఉద్యోగులు పని చేసే సౌకర్యం కల్పించబడింది. ఈ కార్యాలయంలో ఈ-కామర్స్, టెక్నాలజీ, ఆపరేషన్స్, పేమెంట్స్, సెల్లర్ సర్వీసెస్ వంటి కీలక విభాగాలు కార్యకలాపాలు నిర్వహించనున్నాయి.

ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యాలయాన్ని ఆధునిక విధానంలో రూపొందించారు. ఇందులో ఫ్లెక్సిబుల్ వర్క్ స్టేషన్లు, సమావేశ గదులు, చిన్న టీమ్‌ల కోసం హడిల్ స్పేస్‌లు, బ్రేకౌట్ ప్రాంతాలు, 200 మందికి పైగా పాల్గొనగలిగే ఈవెంట్ స్పేస్‌ లను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు ఉద్యోగుల విశ్రాంతి కోసం ల్యాండ్‌ స్కేప్ గార్డెన్లు, బాస్కెట్‌ బాల్, పికిల్‌ బాల్ కోర్టులు కూడా ఏర్పాటు చేశారు. భవనంలో రెండు అంతస్తులు పూర్తిగా క్యాఫెటీరియాలకు కేటాయించి వివిధ దేశాల వంటకాలను అందించేలా రూపొందించారు.

T20 World Cup Records: నిన్నటి మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ ఉంటే కథ వేరేలా ఉండేది.. రికార్డులు చెబుతున్న సత్యం ఇదే!

పర్యావరణ పరిరక్షణకు కూడా అమెజాన్ ప్రాధాన్యత ఇచ్చింది. కంపెనీ ‘ది క్లైమేట్ ప్లెడ్జి’ లక్ష్యాల ప్రకారం 2040 నాటికి నెట్ జీరో కార్బన్ ఉద్గారాలను సాధించేందుకు కట్టుబడి ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఈ కొత్త క్యాంపస్ నిర్మాణంలో పర్యావరణానికి అనుకూలమైన నిర్మాణ సామగ్రి వినియోగం, పాత కార్యాలయ వనరుల పునర్వినియోగం, ఇంకా అధిక సామర్థ్యం గల ఎనర్జీ సిస్టమ్‌ లను ఉంచారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Mudragada Padmanabham: అంబటి రాంబాబు ఇంటిపై దాడిని ఖండించిన ముద్రగడ..

Mudragada Padmanabham: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన...

Mexico: డ్రగ్ డాన్ ఎల్ మెన్చో హత్య.. మంటల్లో తగలబడుతోన్న మెక్సికో

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డ్రగ్స్ మాఫియా డాన్ నెమెసియో రుబ్న్ ఒసెగుయెరా...