19
April, 2025

A News 365Times Venture

19
Saturday
April, 2025

A News 365Times Venture

YS Jagan: లింగమయ్య కుటుంబానికి జగన్‌ పరామర్శ.. సర్కార్‌పై సంచలన ఆరోపణలు..

Date:

YS Jagan: రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లికి వెళ్లిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. ఇటీవల హత్యకు గురైన వైసీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు.. అసలు ఏం జరిగింది.. ఎంత మంది వచ్చారు.. ఎవరెవరిపై దాడి చేశారు.. లాంటి విషయాలపై ఆరా తీశారు.. లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చారు.. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని లింగమయ్య కుటుంబానికి భరోసా ఇచ్చారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సర్కార్‌పై సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ జగన్‌.. రాష్ట్రంలో బీహార్‌ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయన్న ఆయన.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, శాంతిభద్రతలు దిగజారాయి.. మొత్తం రెడ్‌బుక్‌ పరిపాలన నడుస్తోందని మండిపడ్డా.. చంద్రబాబు ఎంత భయపెట్టినా.. ప్రలోభాలు పెట్టినా ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది.. అయితే, వైసీపీ గెలిచినచోట్ల చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

Read Also: Karnataka: నా వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నా.. మహిళలకు హోంమంత్రి క్షమాపణ

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అడుగడుగునా దౌర్జన్యాలకు పాల్పడ్డారు.. రాప్తాడులో జరిగిన ఘటన బాధాకరం అన్నారు జగన్.. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలని సూచించారు.. అయితే, చంద్రబాబు ఎంత భయపెట్టినా, ప్రలోభాలు పెట్టినా ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ గెలిచిందని తెలిపారు.. ఏపీలో ఎక్కడా శాంతి భద్రతలు లేవు.. ఎన్నికలు జరిగిన 57 స్థానాల్లో టీడీపీకి బలం లేదు.. అయితే, చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు పెట్టినా 39 స్థానాల్లో వైసీపీ గెలుపొందిందన్నారు.. టీడీపీకి అనుకూలంగా లేదని 7 చోట్ల ఎన్నికలు వాయిదా వేయించారని ఫైర్‌ అయ్యారు.. రామగిరిలో తొమ్మిది ఎంపీటీసీ స్థానాలను వైసీపీ గెలిచింది.. అయినా.. టీడీపీ నేతలు ఎంపీపీ కోసం ప్రయత్నించి విఫలం అయ్యారన్నారు.. ఈ ఘటన తర్వాత 20 మంది దాడి చేసి లింగమయ్యను హత్య చేశారని ఆవేదన వెలిబుచ్చారు.. లింగమయ్య హత్య కేసులో కేవలం ఇద్దరిపైనే కేసులు పెట్టారు.. మరి, ఎస్ఐ సుధాకర్‌పై ఎందుకు చర్యలు తీసుకోరు? అని నిలదీశారు..

Read Also: Chiranjeevi: పవన్‌ కల్యాణ్‌ కుమారుడికి గాయాలు.. స్పందించిన చిరంజీవి..

లింగమయ్య భార్యతో బలవంతంగా వేలిముద్ర తీసుకుని కేసును బిల్డప్‌ చేశారు.. అసలు నిందితుల్ని వదిలేసి తూతూ మంత్రంగా ఇద్దరిపై కేసులు నమోదు చేశారని మండిపడ్డారు వైఎస్‌ జగన్‌.. పోలీసులే ఇష్టం వచ్చిన స్టేట్‌మొత్తం రాసుకొని.. చదువురాని లింగమయ్య భార్యతో వేలిముద్ర తీసుకున్నారని విమర్శించారు.. బేస్‌ బాల్‌ బ్యాట్‌తో కొట్టి చంపారు.. ఈ విషయాన్ని పోలీసులు ఎక్కడా ప్రస్తావించలేదు.. చిన్న కర్రలతో కొట్టారని.. కేసును తప్పుదారి పట్టించేలా రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సాక్షులను కూడా నిందితులకు సంబంధించినవారిని తీసుకోవడం దారుణమైన విషయం అన్నారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Gaza-Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 90 మంది మృతి

హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా...

GT vs DC: వాహ్.. ఢిల్లీ బ్యాటర్ల సమష్టి కృషి.. .. గుజరాత్ టైటాన్స్ లక్ష్యం 204

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-35లో గుజరాత్ టైటాన్స్...

Raj Kasireddy Sensational Audio: రాజ్ కసిరెడ్డి సంచలన ఆడియో.. సాయిరెడ్డి బాగోతం బయటపెడతా..

Raj Kasireddy Sensational Audio: ఏపీ లిక్కర్‌ స్కాంలో విచారణకు హాజరైన...

BJP MP: ‘‘సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే పార్లమెంట్ మూసేయాలి’’.. వక్ఫ్ చట్టంపై బీజేపీ ఎంపీ..

BJP MP: పార్లమెంట్ ఉభయసభల ఆమోదం, రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారిన...