4
June, 2026

A News 365Times Venture

4
Thursday
June, 2026

A News 365Times Venture

Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..

Date:

Xiaomi 17T Launched: స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీలలో ఒకటైన షియోమీ (Xiaomi) భారత మార్కెట్లో కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ షియోమీ 17T (Xiaomi 17T)ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కొత్త మొబైల్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ లెన్స్, 50MP 5x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. లైకా (Leica) Summilux ఆప్టికల్ లెన్స్‌తో ఉన్న ఈ కెమెరా వ్యవస్థ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజషన్) సపోర్ట్‌ను అందిస్తుంది. అలాగే దీనికి AI ఆధారిత 120x Ultra Zoom ఫీచర్‌ను కూడా అందించారు. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఇవ్వగా, ముందు మరియు వెనుక కెమెరాలతో 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఉంది.

ఈ ఫోన్‌లో 6.59 అంగుళాల 1.5K OLED AMOLED డిస్‌ప్లేను అందించగా.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్‌తో పాటు గరిష్టంగా 3500 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ డిస్‌ప్లేకు TÜV Rheinland ఇంటెలిజెంట్ ఐ కేర్ సర్టిఫికేషన్ కూడా లభించింది. ఈ కొత్త Xiaomi 17Tలో MediaTek Dimensity 8500-Ultra 4nm ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఫోన్‌లో 12GB LPDDR5X RAM, 256GB/512GB UFS 4.1 స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే కొత్తగా పనితీరు తగ్గకుండా ఉండేందుకు Xiaomi 3D IceLoop కూలింగ్ సిస్టమ్‌ను తీసుకవచ్చారు.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6500mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందించారు. ఇది ఇదివరకు మోడళ్లతో పోలిస్తే 18% అధిక సామర్థ్యాన్ని కలిగి ఉందని కంపెనీ తెలిపింది. 67W హైపర్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఉండగా.. 50W PPS ఛార్జింగ్ సపోర్ట్‌తో థర్డ్ పార్టీ ఛార్జర్లను కూడా ఉపయోగించవచ్చు. ఇంకా ఇందులో IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఐటమ్స్, Hi-Res ఆడియో, Wi-Fi 7, బ్లూటూత్ 6.0, NFC, IR బ్లాస్టర్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3పై ఈ ఫోన్ పనిచేస్తుంది.

Image (10)

Xiaomi 17T రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 12GB + 256GB వేరియంట్ రూ. 59,999 కాగా, 12GB + 512GB వేరియంట్ రూ. 64,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ జూన్ 10 నుంచి Mi.com, అమెజాన్, షియోమీ రిటైల్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. కొత్త Xiaomi 17T కొనుగోలు చేసే వినియోగదారులకు రూ. 5,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ లేదా క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంతేకాకుండా 18 నెలల వరకు నో కాస్ట్ EMI, జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే స్ఫోటిఫై ప్రీమియం, యూట్యూబ్ ప్రీమియం, గూగుల్ AI ప్రో (5TB క్లౌడ్ స్టోరేజ్‌తో), జియో టీవీ+ వంటి డిజిటల్ సబ్‌స్క్రిప్షన్లను ఉచితంగా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?

Story Board: తెలంగాణ ఏర్పాటై పన్నెండేళ్లు గడిచింది. ఉద్యమ ఆకాంక్షలు ఏ...

IndiGo Flights Suspended: విదేశీ ప్రయాణికులకు అలర్ట్.. కీలక రూట్లలో ఇండిగో సర్వీసులు రద్దు

IndiGo Flights Suspended: భారత్‌లో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో...

Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభం తీవ్రమవుతోంది. ఇప్పటికే...