2
April, 2026

A News 365Times Venture

2
Thursday
April, 2026

A News 365Times Venture

Wired Earphones: ఓల్డ్ ఈజ్ గోల్డ్.. మళ్లీ వైర్డ్ ఇయర్ ఫోన్స్‌కు పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే..

Date:

సాంకేతిక ప్రపంచంలో మార్పులు చాలా వేగంగా జరుగుతుంటాయి. ఒకప్పుడు వైర్లతో కూడిన హెడ్‌ఫోన్లు వాడటం ఇబ్బందిగా అనిపించి, అందరం వైర్‌లెస్ (Bluetooth) వైపు పరుగులు తీశాం. స్మార్ట్‌ఫోన్ల నుంచి హెడ్‌ఫోన్ జాక్ తొలగించడంతో వైర్డ్ హెడ్‌ఫోన్ల యుగం ముగిసిందని అందరూ భావించారు. కానీ, ఆశ్చర్యకరంగా టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్తున్నా, వినియోగదారులు మళ్లీ పాత కాలపు వైర్డ్ హెడ్‌ఫోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. సౌండ్ క్వాలిటీ, భద్రత కారణంగా ఇవి ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి.

మారిన టెక్ ప్రపంచం..

2016లో యాపిల్ సంస్థ తన ఫోన్ల నుంచి హెడ్‌ఫోన్ జాక్‌ను తొలగించి పెద్ద సంచలనం సృష్టించింది. ఆ తర్వాత గూగుల్, శామ్‌సంగ్ వంటి కంపెనీలు కూడా అదే దారిలో నడిచాయి. దీంతో బ్లూటూత్ హెడ్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్ వాడకం అనివార్యమైంది. అయితే.. 2025 చివరి నాటికి పరిస్థితిలో మార్పు వచ్చింది. గణాంకాల ప్రకారం.. 2026 ప్రారంభంలోనే వైర్డ్ హెడ్‌ఫోన్ల అమ్మకాలు 20 శాతం మేర పెరగడం విశేషం. ఇది కేవలం ఒక తాత్కాలిక ట్రెండ్ మాత్రమే కాదు, వినియోగదారుల ఆలోచనా విధానంలో వచ్చిన మార్పుగా నిపుణులు భావిస్తున్నారు.

వైర్డ్ హెడ్‌ఫోన్ల ప్లస్ పాయింట్లు..

వైర్డ్ హెడ్‌ఫోన్లకు ఉన్న ప్రధాన బలం వాటి సౌండ్ క్వాలిటీ. బ్లూటూత్ హెడ్‌ఫోన్లతో పోలిస్తే తక్కువ ధరలోనే ఇవి అద్భుతమైన ఆడియో అనుభూతిని ఇస్తాయి. వీటిలో బ్యాటరీ ఛార్జింగ్ సమస్య ఉండదు, కనెక్షన్ కట్ అయ్యే ప్రమాదం ఉండదు. ప్లగ్ చేస్తే చాలు, వెంటనే వాడుకోవచ్చు. ప్రస్తుతం సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు వైర్డ్ హెడ్‌ఫోన్లతో కనిపించడం ఒక కొత్త ఫ్యాషన్‌గా మారింది. బ్లూటూత్ కన్నా వైర్డ్ వాడటమే ఇప్పుడు “కూల్” అని యువత భావిస్తోంది.

బ్లూటూత్ హెడ్‌ఫోన్ల వాడకంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. బ్లూటూత్ ఆన్ చేసి ఉంటే హ్యాకింగ్ చేయడం సులభమని, ప్రైవసీకి భంగం కలుగుతుందని చాలామంది భయపడుతున్నారు. అలాగే.. బ్లూటూత్ రేంజ్ పరిమితంగా ఉండటం, నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ల వల్ల వచ్చే రేడియేషన్ ప్రభావం వంటివి ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో సేఫ్టీ పరంగా, క్వాలిటీ పరంగా ‘ఓల్డ్ ఫ్యాషన్’ వైర్డ్ హెడ్‌ఫోన్లే మేలని వినియోగదారులు నిర్ణయించుకుంటున్నారు.

అధిక టెక్నాలజీ వల్ల కలిగే ఒత్తిడి నుంచి దూరంగా ఉండి, సహజమైన అనుభూతిని పొందాలని చాలామంది కోరుకుంటున్నారు. అందుకే హెడ్‌ఫోన్లే కాదు.. పాత కాలపు క్యాసెట్లు, డీవీడీలు, టైప్‌రైటర్లు కూడా మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. క్వాలిటీ , సింప్లిసిటీని కోరుకునే వారంతా మళ్ళీ ఓల్డ్ టెక్నాలజీనే ఇష్టపడుతున్నారు. మొత్తానికి వైర్డ్ హెడ్‌ఫోన్ల యుగం మళ్లీ మొదలైందని చెప్పవచ్చు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

Abhishek Sharma Catch Controversy: ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఐపీఎల్ 2026...

Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

ఆదాయ పన్ను చెల్లించే వారికి ప్రభుత్వం ఓ బిగ్ షాక్ ఇచ్చింది....

CM Chandrababu: అమరావతి ఇక అన్‌స్టాపబుల్‌.. ఇది చారిత్రాత్మకం.. మోడీ, అమిత్‌షాకు హృదయపూర్వక ధన్యవాదాలు

CM Chandrababu: రాజధానిగా అమరావతికి చట్టబద్దత లభించడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ...

LayOffs: ఆ ఉద్యోగులకు బిగ్ షాక్.. మరోసారి లేఆఫ్స్ ప్రకటన.. కొంప ముంచుతున్న ఏఐ..

ట్విట్టర్ (ప్రస్తుత X) సహ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ‘బ్లాక్’...