* నేడు జపాన్ లో కొనసాగుతున్న సీఎం రేవంత్ పర్యటన.. తోషిబా, టయోటా కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశాలు..
* నేడు బీజేపీ జిల్లా అధ్యక్షులతో కిషన్ రెడ్డి సమావేశం.. పెండింగ్ మండల అధ్యక్షుల ఎంపికపై చర్చ..
* నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్న ముగ్గురు మంత్రులు.. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూభారతి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్న మంత్రులు పొంగులేటి, సీతక్క, కొండా సురేఖ..
* నేటి నుంచి సంగారెడ్డి నియోజకవర్గంలో ఐదు రోజుల పాటు జగ్గారెడ్డి పర్యటన.. ఏఐసీసీ పిలుపు మేరకు సంగారెడ్డిలో జైబాపు, జైభీమ్, జైం సవిధాన్ కార్యక్రమం..
* నేడు మడకశిరలో నలుగురు మంత్రుల పర్యటన.. సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్న మంత్రులు గొట్టిపాటి, అనగాని, సత్యకుమార్, సవిత..
* నేడు సిట్ విచారణకు హాజరుకానున్న విజయ సాయిరెడ్డి.. లిక్కర్ కేసులో విచారణకు రావాలని నోటీసులు.. ఇదే కేసులో సిట్ విచారణకు హాజరుకావాలని కసిరెడ్డి తండ్రి ఉపేందర్ కు నోటిసులు..
* నేడు కర్నూలులో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పర్యటన.. పిన్నాపురంలో గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును సందర్శించనున్న కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి..
* నేడు తెలంగాణలోని 16 జిల్లాలకు వర్ష సూచన.. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. కొన్ని చోట్ల వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 15గంటల సమయం.. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు..
* నేడు దేశవ్యాప్తంగా బీజేవైఎం నిరసనలు.. కాంగ్రెస్ నిరసనలకు కౌంటర్ గా ఆందోళనలు.. బీజేపీ, కేంద్ర దర్యాప్తు సంస్థలను విమర్శించడంపై బీజేవైఎం దేశవ్యాప్త నిరసనలు..
* నేడు ఐపీఎల్ లో బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య కీలక పోరు.. బెంగళూరు వేదికగా రాత్రి 7.30 గంటలకి మ్యాచ్..