19
March, 2026

A News 365Times Venture

19
Thursday
March, 2026

A News 365Times Venture

Weather Updates : తెలంగాణలో మండుతున్న ఎండలు.. ప్రజలకు వాతావరణ శాఖ గుడ్‌ న్యూస్‌

Date:

Weather Updates : తెలంగాణలో వేసవి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. తెల్లవారుజామునే ఎండలు మండి పడటంతో ప్రజలు దైనందిన పనులు చేసుకోవడానికే ఇబ్బందిపడుతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఉష్ణోగ్రతలు మరింత పెరిగి, ఫిబ్రవరి నుంచే ఉష్ణోగ్రతలు తీవ్రంగా నమోదవుతున్నాయి. తాజాగా, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

వడగాలులతో ఉక్కిరిబిక్కిరి
తీవ్ర వేడి ప్రభావంతోపాటు వడగాలులు కూడా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వడగాలుల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది. రానున్న రెండు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఊపిరి పీల్చుకునేలా తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఓ మంచి వార్త చెప్పింది. ఈ నెల 21వ తేదీ నుండి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా, రేపు , ఎల్లుండి ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో ప్రజలు వేసవి ప్రభావం నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Allu Aravind: యాంకర్ ప్రదీప్ డైరెక్షన్లో మాత్రమే నటిస్తా..అరవింద్ కీలక వ్యాఖ్యలు

అల్లు అరవింద్ మెగా నిర్మాతగా గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు,...

CSK IPL 2026: ఐపీఎల్ 2026కు ముందు సీఎస్‌కేకు భారీ ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ ఈ సీజన్ మొత్తానికి దూరం

ఐపీఎల్ 2026 మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. ఐపీఎల్ 2026కు ముందు సీఎస్‌కేకు...

AP Weather Alert: అలర్ట్.. మరో మూడు రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు..

AP Weather Alert: ఇప్పటికే అకాల వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి.....

HDFC Bank: 9% పతనం.. HDFC బ్యాంక్ మార్కెట్ క్యాప్ ఒక్కసారిగా రూ.1 లక్ష కోట్లు డ్రాప్

భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేరు ధర,...