13
March, 2026

A News 365Times Venture

13
Friday
March, 2026

A News 365Times Venture

Vijay TVK: తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. ఎన్డీఏ గూటికి దళపతి విజయ్?

Date:

Vijay TVK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నగారా మోగకముందే రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. ఇదే సమయంలో దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీపై అందరి దృష్టి నెలకొంది. ఈ క్రమంలో విజయ్‌ను తమ కూటమిలోకి ఆహ్వానించేందుకు బీజేపీ పావులు కదుపుతున్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సినీ గ్లామర్‌తో పాటు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ పార్టీని తమ కూటమిలోకి తెచ్చుకునేందుకు భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం.

READ ALSO: IndiGo: ఇరాన్ వార్ ఎఫెక్ట్.. పెరిగిన ఇండిగో టికెట్ ధరలు..

కూటమిపై ‘విజయ్’ నిర్ణయం ఏంటి?
విజయ్‌తో చర్చలు జరపడానికి బీజేపీ అగ్రనాయకత్వం వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఒక రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి కీలక మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ ఇమేజ్ ద్వారా తమిళనాడులో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ.. ఓట్ల శాతాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది. పార్టీని ప్రకటించిన సమయంలో విజయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని, ప్రజలకు స్వతంత్ర ప్రత్యామ్నాయంగా నిలుస్తామని అప్పట్లో ప్రకటించారు. మరి ఇప్పుడు ఉన్నట్లుండి బీజేపీతో చేతులు కలిపితే తన స్వతంత్ర గుర్తింపు దెబ్బతింటుందని విజయ్ భావిస్తున్నట్లు సమాచారం. విజయ్ సన్నిహితులు, రాజకీయ సలహాదారులు ఎన్డీఏ కూటమిలో చేరడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న పార్టీలు పెద్ద కూటముల్లో చేరితే వాటి అస్తిత్వం కనుమరుగవుతుందన్నది వారి ప్రధాన భయంగా సమాచారం. ప్రారంభ దశలోనే పొత్తు పెట్టుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని మరికొందరు హెచ్చరిస్తున్నట్లు టాక్ నడుస్తుంది.

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాలా తక్కువ మెజారిటీతో మారుతుంటాయి. కేవలం 2 శాతం ఓట్లు అటు ఇటు అయినా అధికారం తారుమారయ్యే అవకాశం ఉంది. అందుకే విజయ్ వైపు ఉన్న భారీ యువత ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకుంటే డిఎంకె (DMK) కు గట్టి పోటీ ఇవ్వొచ్చని బీజేపీ వ్యూహకర్తల ప్లాన్‌గా చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే లోపు విజయ్ తన రాజకీయ పంథాను స్పష్టం చేసే అవకాశం ఉందని సమాచారం. దళపతి నిర్ణయం తమిళనాడు భవిష్యత్తును ఎలా మారుస్తుందో వేచి చూడాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: Oil Crisis: చమురు సెగ.. రోజుకు రూ.2 వేల కోట్ల నష్టం.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

LPG Crisis: భారత్‌కు గుడ్‌ న్యూస్.. హార్ముజ్ నుంచి బయలుదేరిన LPG నౌకలు..

LPG Crisis: భారత్‌కు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ముంచుకొస్తున్న...

Sachin Tendulkar: సచిన్ రిటైర్మెంట్ వెనుక ఇంత కథ ఉందా.. డ్రెస్సింగ్ రూంలోనే ప్లాన్..?

క్రికెట్ ప్రపంచంలో ‘దేవుడు’గా పిలవబడే సచిన్ టెండూల్కర్ పేరు వినగానే పరుగుల...

Ustaad Bhagath Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

Ustaad Bhagath Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆంధ్రప్రదేశ్...

LPG BOOKINGS: వంటగ్యాస్‌‌ భయాలు.. రోజుకు అదనంగా 25 లక్షల సిలిండర్ల బుకింగ్స్..

LPG BOOKINGS: దేశంలో వంట గ్యాస్ (LPG) డిమాండ్ తీరు మారిందని,...